అమర్నాథ్ యాత్రలో చిక్కుకున్నఅనంతవాసులు
అనంతపురం: అమర్ నాథ్ యాత్రకు వెళ్లిన అనంతపురం జిల్లా వాసులు అక్కడ చిక్కుకుపోయారు. రాంబాగ్ ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడటంతో యాత్రికులు అక్కడే చిక్కుకున్నట్లు సమాచారం. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న మంత్రి పరిటాల సునీత... బాధితులకు సాయం అందించాల్సిందిగా డీజీపీ జేవీ రాముడును ఆదేశించారు. డీజీపీ ఈ విషయంపై జమ్మూ కాశ్మీర్ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. చిక్కుకుపోయినవారిలో శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఉద్యోగులు ఉన్నారు.