బాబుకు ఈ వయసులోనే జీర్ణ సమస్య... తగ్గేదెలా?
మా అబ్బాయికి ఐదేళ్లు. ఇటీవల వాడికి ఏం తినిపించినా జీర్ణం కావడం లేదు. ఎప్పుడూ కడుపు ఉబ్బరంగా ఉంటోంది. ఏదైనా తినిపించిన కొద్దిసేపటికే వాంతులు చేసుకుంటున్నాడు. ఎప్పుడూ నీరసంగా ఉంటున్నాడు. వాడి విషయంలో మాకు తగిన సలహా ఇవ్వండి.
- ఆర్. కుమార్, విజయవాడ
చిన్న పిల్లలు వాంతులు చేసుకోవడం అన్నది తరచూ చూసే సమస్యే అయినా మీరు చెబుతున్నట్లుగా ఈ వయసులో అరుగుదలలో లోపాలు ఉండటం, కడుపు ఉబ్బరంగా ఉండటం, తిన్న వెంటనే వాంతులు కావడం అన్న విషయాలను కాస్త సీరియస్‌గానే పరిగణించాల్సిన అవసరం ఉంది. సాధారణంగా ఈ వయసు పిల్లల్లో... గాస్ట్రో ఎంటిరైటిస్, గ్యాస్ట్రో ఇంటస్టినల్ రిఫ్లక్స్, ఎక్కువగా తినేయడం, చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్, పొట్టలో అల్సర్స్, కొన్ని మెటబాలిక్ కండిషన్స్ వల్ల తరచూ ఈ తరహా లక్షణాలను చూస్తుంటాం. అలాగే మాల్ అబ్జార్ప్షన్ (అంటే తిన్నది సరిగా ఒంటబట్టకపోవడం) కూడా ఒక కారణం కావచ్చు.
అయితే మీ అబ్బాయి విషయంలో అతడి సమస్యకు గ్యాస్ట్రో ఇంటస్టినల్ రిఫ్లక్స్ లేదా శరీర నిర్మాణపరమైన అడ్డంకులు (అంటే... పేగు తిరగబడటం లాంటి మాల్రొటేషన్, హయటస్ హర్నియా, కంజెనిటల్ బ్యాండ్) వంటివి కారణాలు కావచ్చా అని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. అందుకోసం కొన్ని రొటీన్ ఇవాల్యుయేషన్స్తో పాటు బేరియం మీల్ పరీక్షలు చేయించడం కూడా అవసరం. ఆ పరీక్షలతో చాలావరకు సమాచారం తెలుసుకోవచ్చు. పై విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మీరు ఒకసారి మీ పీడియాట్రీషియన్ లేదా గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌లను సంప్రదించి తగిన సూచనలు, చికిత్స తీసుకోండి.
మా బాబుకు ఏడేళ్లు. పుట్టుకతోనే రక్తంలో తెల్లరక్తకణాలు లేవని డాక్టర్లు చెప్పారు. దాంతో తరచూ రక్తం ఎక్కిస్తూ తెల్లరక్తకణాలను భర్తీ చేయాల్సి వస్తోంది. మా బాబుకు ఇలా ఎన్నాళ్లు ఎక్కించాలి? అతడి కండిషన్‌కు శాశ్వత చికిత్స లేదా? దయచేసి మాకు తగిన సలహా ఇవ్వండి.
- ఎమ్. నారాయణరావు, రాజమండ్రి
మీరు చెప్పిన లక్షణాలను బట్టి, మీ బాబుకి థ్రాంబో సైటోపీనియా ఉన్నట్లు అందులోనూ... ఏమెగాకారియోసైటిక్ థ్రాంబోసైటోపీనియా అనే కండిషన్ ఉన్నట్లు అనిపిస్తోంది. ఈ కండిషన్ ఉన్నవాళ్లలో సాధారణంగా రక్తం గడ్డకట్టడంలో సమస్యలు ఉంటారుు. ఇది వురికొన్ని జన్యుపరమైన సవుస్యలతోనూ ఇది కలిసి ఉండవచ్చు. ఇలాంటి సవుస్య ఉన్నవారిలో దాదాపు 20 శాతం వుంది పిల్లల్లో ఇది ఎప్లాస్టిక్ అనీమియా అనే వురింత తీవ్రమైన పరిస్థితికి దారితీయువచ్చు. అంటే... సాధారణ అనీమియూలో ఎర్రరక్తకణాలు వూత్రమే తగ్గితే... ఈ ఎప్లాస్టిక్ అనీమియూలో రక్తంలోని అన్ని రకాల కణాలూ తగ్గుతారుు. అరుదుగా ఒక శాతం వుంది పిల్లల్లో ల్యూకేమియూ కూడా రావచ్చు. మీ బాబుకు పీడియూట్రిక్ హివుటాలజిస్ట్ ఆధ్వర్యంలో చికిత్స అందించండి.
డాక్టర్ రమేశ్‌బాబు దాసరి, పీడియాట్రీషియన్,
స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్