తల్లీ కొడుకుల ఆత్మహత్య..!
గుంటూరు: తల్లీ కొడుకులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం రామిరెడ్డిపేట పాత సమితి కార్యాలయం సమీపంలో గురువారం అర్దరాత్రి దాటాక జరిగింది. వివరాలు.. సిరిగిరి విజయలక్ష్మి (67) ఆమె కుమారుడు గురుప్రసాద్ (35)తో గత పదిరోజులుగా కాలనీలో అద్దె ఇల్లు తీసుకొని నివాసముంటోంది. శుక్రవారం ఉదయం ఎంత సేపటికీ తలుపులు తీయకపోవడంతో స్థానికులు తలుపులు తెరిచి చూస్తే.. తల్లీ కొడుకులు విగతజీవులుగా పడిఉన్నారు.
దీంతో పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు వారి బంధువులకు తెలియజేశారు. పురుగుల మందు తాగిన ఆనవాళ్లు ఉండటంతో.. ఇద్దరు కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. గురుప్రసాద్కు మతిస్థిమితం లేదని స్థానికులు అంటున్నారు.