నిలబెట్టిన సినిమా రాముడు-భీముడు
1960.. కారంచేడు.. అప్పటికే స్టార్ హీరో, హీరోయిన్లయిన అక్కినేని నాగేశ్వర్రావు, సావిత్రి జంటగా నటించిన 'నమ్మినబంటు' సినిమా షూటింగ్.. ఎండ్ల పందాల దృశ్యం చిత్రీకరిస్తున్నారు. సరదాగా ఆ సీన్లో నటించారు రామానాయుడు. అక్కడ హుషారుగా కనిపించే రామానాయుణ్ణి చూసి 'మీరూ సినిమాల్లోకి ఎందుకు రాకూడదు?' అని అడిగారట ఏఎన్నార్. అయితే తనకు వ్యవసాయం తప్ప వేరే ఆలోచనలేవీ లేవని బదులిచ్చారు నాయుడు. తర్వాత మూడేళ్లకి అంటే 1963 నాటికి రామానాయుడు నిర్మాతగా తన తొలిసినిమా 'అనురాగం' నిర్మించారు. జగ్గయ్య, భానుమతి హీరో, హీరోయిన్లుగా నటించిన ఆ సినిమా తగిన ఫలితాలను ఇవ్వలేదు.
డబ్బు వృధా చేయనని తండ్రికిచ్చిన మాటను అనుక్షణం గుర్తుచేసుకుంటూ 1965లో సొంత నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడక్షన్స్ ప్రారంభించి 'రాముడు-భీముడు' సినిమాను నిర్మించారు. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ మాసివ్ యాక్షన్, తాపీ చాణక్య దర్శకత్వ ప్రతిభ తోడవ్వడంతో ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి రాలేదు. అక్కడి నుంచి మొదలుపెట్టి ఏకంగా 155 సినిమాలు నిర్మించారు. ఆయన నిర్మించిన చివరి చిత్రం 'గోపాలా గోపాలా'