రమ్య చట్టాన్ని తీసుకురావాలి : రమ్య తల్లి రాధిక
హైదరాబాద్: పంజాగుట్ట కారు ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి రమ్య చట్టాన్ని తీసుకురావాలని ఆమె తల్లి రాధిక డిమాండ్ చేశారు. హైదరాబాద్లో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ....తమ కుటుంబానికి జరిగిన అన్యాయం వేరే కుటుంబానికి జరగకూడదన్నారు.
హైదరాబాద్లోని అన్ని స్కూళ్లలో బుధవారం ప్రార్థనా సమయంలో రెండు నిమిషాలు మౌనం పాటించాలని విద్యాసంస్థలను కోరినట్లు రాధిక తెలిపారు. విద్యార్థులందరూ రమ్య చట్టం తీసుకురావాలని ప్లకార్డులను ప్రదర్శిస్తారని ఆమె చెప్పారు. గత నెలలో పంజాగుట్ట ఫ్లైఓవర్ పై నుంచి కారు కిందపడిన ప్రమాదంలో చిన్నారి రమ్యతో పాటు ఆమె బాబాయి, తాతయ్య మరణించిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ కేసులో నిందితుడు శ్రావెల్ బెయిల్ పిటిషన్ను హైకోర్టు మంగళవారం తోసిపుచ్చింది.