ramyasri
-
'రమ్యశ్రీని కొట్టి చంపేశారు..'
సాక్షి, కాకినాడ క్రైం: కాకినాడ పల్లంరాజు నగర్లో సోమవారం తెల్లవారుజామున ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కాకినాడ మూడో పట్టణ పోలీసుల కథనం ప్రకారం.. రాజానగరం మండలం దివాన్‌చెరువుకు చెందిన మండాల రమ్యశ్రీ(23)కి కాకినాడకు చెందిన వెంకట్‌తో 2018 ఆగస్టు 19న వివాహమైంది. ఆ సమయంలో వెంకట్ సాఫ్ట్వేర్ ఉద్యోగి అని, ఐదంకెల జీతం అని చెప్పి నమ్మబలికి అతడి కుటుంబం లక్షలాది రూపాయలు డిమాండ్ చేశారు. బిడ్డ భవిష్యత్తు బాగుండాలని భావించిన రమ్యశ్రీ తల్లిదండ్రులు అప్పు చేసి మరీ రూ.30 లక్షల కట్నం, నగదు సమర్పించారు. వివాహమైన కొన్నాళ్లకే రమ్యశ్రీపై అదనపు కట్నపు వేధింపులు ప్రారంభమయ్యాయి. చదవండి: (జీవితం మీద విరక్తితోనే చనిపోతున్నా..) పల్లంరాజునగర్ పవన్ గార్డెన్స్ అపార్ట్మెంట్లో రమ్యశ్రీ భర్త, అత్తమామలతో కలిసి ఉండేది. అత్తింటివారి వేధింపులు తల్లిదండ్రులకు చెప్పి కన్నీటి పర్యంతమయ్యేది. రమ్యశ్రీ 2019 నవంబర్‌లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అంతకుముందే ఆచారం ప్రకారం పుట్టింటివారు తీసుకువెళ్లారు. ఇదే అదునుగా భావించిన వెంకట్ కుటుంబ సభ్యులు రమ్యశ్రీని 11 నెలల వరకు ఇంటికి తీసుకురాలేదు. అదనపు కట్నంతోనే అడుగుపెట్టాలంటూ వేధించేవారు. ఈ నేపథ్యంలో కొందరు పెద్దలు మధ్య వర్తిత్వంతో తాత్కాలికంగా సద్దుమణిగింది. చదవండి: (నిన్న చెల్లెలు.. నేడు అన్న మృతి) ఈ ఏడాది అక్టోబర్‌లో రమ్యశ్రీ తన బిడ్డతో సహా అత్తింటిలో అడుగుపెట్టింది. ఆమె రాకను జీర్ణించుకోలేని అత్తమామ సౌభాగ్యలక్ష్మి, మురళీకృష్ణ గుంటూరులో ఉన్న చిన్నకుమారుడు వద్దకు వెళ్లిపోయారు. నవంబర్‌లో చిన్నారి మొదటి పుట్టినరోజు వేడుకకు వారు హాజరై తిరిగి వెళ్లిపోయారు. వారు దూరంగా ఉన్నా రమ్యశ్రీకి వేధింపులు ఆగలేదు. వారు ఫోన్లో వేధించడంతోపాటు భర్త ప్రత్యక్షంగా ఇంట్లో ఉంటూ వేధించేవాడు. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో రమ్యశ్రీ ఆత్మహత్యకు పాల్పడిందని భర్త, ఆ ఇంటి పైపోర్షన్లో ఉంటున్న చిన్నత్తయ్య, చినమామయ్య సంధ్యారాణి, విక్రమ్‌శ్రీనివాస్ మృతురాలి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చనిపోయిందని చెప్పారు. వారే త్రీటౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆగమేఘాల మీద చేరుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపించారు. తమ కుమార్తెను కొట్టిచంపారని కటుంబ సభ్యులు ఆరోపించారు. ఉరి వేసుకున్నట్టు చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమార్తె మరణంపై నిజానిజాలు తేల్చాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ హత్య చేసింది భర్త, అత్త, మామలేనని ఫిర్యాదులో పేర్కొన్నారు. వరకట్న వేధింపులు, అనుమానాస్పద మృతి ఘటనగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మూడవ పట్టణ పోలీసులు తెలిపారు. చదవండి: (అన్నలారా.. మేమెలా బతకాలి?) -
రమ్యమైన హృదయం
ఆమె ఒక నటి. ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీ. అయితేనేం సమాజానికి తనవంతు సహాయం చేయాలనుకున్నారు. ‘రమ్య హృదయాలయ ఫౌండేషన్’ ఏర్పాటు చేసి.. అనాథలు, యాచకులు, వృద్ధులకు అండగా నిలుస్తున్నారు. ఆమే క్యారెక్టర్ ఆర్టిస్ట్ రమ్యశ్రీ. విశాఖపట్టణానికి చెందిన సుజాత అలియాస్ రమ్యశ్రీ 1997లో హైదరాబాద్‌కు వచ్చి తెలుగు ఇండస్ట్రీలో స్థిరపడ్డారు. ఇప్పటి వరకు 8 భాషల్లో 300లకు పైగా చిత్రాల్లో నటించారు. నటి, డ్యాన్సర్, దర్శకురాలిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2015లో స్వీయ దర్శకత్వంతో తాను నటించిన ‘ఓ మల్లీ’ చిత్రం జ్యూరీ విభాగంలో బెస్ట్ దర్శకురాలిగా నంది అవార్డు గెలుచుకొంది. ఇదంతా ఒకవైపు.. మరోవైపు ఆమె సేవా హృదయురాలు. చిన్నప్పటి నుంచి యాచకులను చూసి చలించిపోయేది. ఇంట్లో తెలియకుండా వారి వద్దకు వెళ్లి దుస్తులు, డబ్బులు ఇచ్చేది. అలా మొదలైన సేవ.. నేటికీ కొనసాగుతోంది. అవసరాలు తీరుస్తూ... రోడ్డుపై యాచకులు కనిపిస్తే చాలు.. రమ్యశ్రీ కారు ఆగిపోతుంది. వారి దగ్గరికి వెళ్లి అవసరాలు తెలుసుకుంటుంది. షూటింగ్ లేని రోజుల్లో వారుండే ప్రాంతానికి వెళ్లి దుస్తులు, దుప్పట్లు, డబ్బులు అందజేస్తుంది. భోజనం కూడా తీసుకెళ్లి ఇస్తుంది. రమ్యశ్రీ సేవలను గుర్తించిన హెల్త్‌కేర్ ఇంటర్నేషనల్ సంస్థ ఇటీవల ఆమెకు ‘మదర్ థెరిస్సా’ అవార్డు ప్రదానం చేసింది. పిల్లల దత్తత.. వృద్ధుల బాధ్యత రమ్యశ్రీ ఇద్దరు అనాథ పిల్లలను దత్తత తీసుకున్నారు. ఆరుగురు వృద్ధుల ఆలనాపాలన చూసుకుంటున్నారు. పిల్లల్లో ఒకరు ఆరో తరగతి, మరొకరు ఎనిమిదో తరగతి చదువుతున్నారు. వీరిద్దరూ ప్రయోజకులు అయ్యే వరకు తన బాధ్యతేనని చెప్పారు రమ్యశ్రీ. ఆదుకోవాలి.. అనాథలకు ఎన్నో ఆశలు, కోర్కెలు ఉంటాయి. వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం సహకరించాలి. వారి కలల్ని సాకారం చేయాలనేది నా లక్ష్యం. అందుకు ప్రభుత్వం సహకరిస్తుందని ఆశిస్తున్నాను. – రమ్యశ్రీ, నటి -
ఓ మల్లిక గాథ
గిరిజన నేపథ్యంలో సాగే వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘ఓ మల్లి’. రమ్యశ్రీ కథానాయికగా నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రశాంత్ నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 18న విడుదలకు సిద్ధంగా ఉంది. రమ్యశ్రీ మాట్లాడుతూ- ‘‘ఓ గిరిజన జంట మధ్య సాగే అనుబంధమే ఈ చిత్రం. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌ను ఎంచుకుని ఈ సినిమా రూపొందించాం. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఉంటుంది. ఇలాంటి సినిమా తెలుగులో ఇప్పటివరకూ రాలేదు. ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నా’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, బి.ఎస్. కృష్ణమూర్తి, సినిమాటోగ్రఫీ: కె.దత్తు.