ఓట్ల లెక్కింపును సజావుగా నిర్వహించండి
చిత్తూరు (జిల్లాపరిషత్), న్యూస్‌లైన్: జిల్లాలో శుక్రవారం జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించాలని కలెక్టర్ కే.రాంగోపాల్ ఆదేశించారు. బుధవారం ఉదయం చిత్తూరులోని మహతి కళాక్షేత్రంలో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ లెక్కింపు ప్రక్రియలో ఏజెంట్లకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని, వారి అనుమానాలను తీర్చు తూ కౌంటింగ్‌ను నిర్వహించాలని సూచించారు. సాంకేతిక సమస్యలు వస్తే వెంటనే సంబంధిత రిటర్నింగ్ అధికారికి తెలియజేయాలన్నారు.
కౌంటింగ్ సిబ్బందికి ర్యాండమైజేషన్ ద్వారా విధు లు కేటాయిస్తామని, ఈ-మెయిల్ ఐడీలకు, సెల్ఫోన్లకు ఎస్ఎంఎస్ల ద్వారా తెలియజేస్తామని చెప్పారు. కౌంటింగ్ విధులకు హాజరయ్యే వారు సంబంధిత ఆర్డీవోల నుంచి ఉత్తర్వులు పొందాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆర్డర్ కాపీ ఉన్న వారు శుక్రవారం ఉదయమే వారికి కేటాయించిన కేంద్రానికి చేరుకోవాలని, గుర్తింపు కార్డులు పొంది సం బంధిత అసెంబ్లీ సెంటర్లకు వెళ్లి విధు లు నిర్వర్తించాలని ఆదేశించారు. సిబ్బం ది త్వరితగతిన కౌంటింగ్ కేంద్రాలకు చేరుకునేందుకు చిత్తూరులో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
కౌంటింగ్ విధులకు ముందురోజే హాజరయ్యే సిబ్బంది గురువారం రాత్రి ఉండేందుకు టీటీడీ కల్యాణ మండపం, చక్కెర ఫ్యాక్టరీ కల్యాణ మండపంలో బస ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా లో ఎక్కువ సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్లు వచ్చినందున ముందుగా వాటిని లెక్కించి, అర్ధగంట తర్వాత ఈవీఎంలను తెరవాలని సూచించారు. పార్లమెం ట్‌కు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు ప్రత్యేక హాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీధర్, ఏజేసీ వెంకట సుబ్బారెడ్డి, డీఆర్వో శేషయ్య, సంబంధిత నియోజకవర్గాల ఆర్వోలు తది తరులు పాల్గొన్నారు