‘జగ్జీవన్‌రామ్ బాటలో నడుద్దాం’
సాక్షి, హైదరాబాద్: బాబు జగ్జీవన్‌రామ్ ఆశయ సాధనకు కృషి చేస్తామని ఆర్టీసీ కార్మికులు పేర్కొన్నారు. బాబు జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా శుక్రవారం రాణిగంజ్ డీపో వన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా డీపో మేనేజర్ పొన్నగంటి మల్లేశం మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్‌రామ్ చూపిన బాటలో నడవాలని అన్నారు. బడుగు, బలహీన వర్గాల శ్రేయస్సు కోసం పాటు పడిన బాబు జగ్జీవన్‌రామ్ బాటలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పొన్నగంటి మల్లేశంతో పాటు సుద్దాల సురేశ్, పీవీరావు, గోపీ, సీఎస్ రెడ్డి, లక్ష్మణ్ నాయక్, రమేశ్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.