Ranipet Police
-
నటి కస్తూరి కేసుపై విచారణ
సాక్షి, చెన్నై(పెరంబూరు) : నటి కస్తూరిపై కేసు బుధవారం కోర్టులో విచారణకు వచ్చింది. వివరాల్లోకెళ్లితే వెళ్లం పుత్తూర్ గ్రామంలో సమయన్ అనే వ్యక్తి హత్య, ఆరాయి,ధనంలపై దాడి సంఘటనపై తన ట్విట్టర్లో స్పందించిన నటి కస్తూరి ఒక వర్గంపై చేసిన అనుచిత వ్యాఖ్య లు వివాదాస్పదంగా మారాయి. ఈ సంఘటనపై పట్టాలి మక్కల్ కట్చి రాష్ట్ర ఉపకార్యదర్శి, న్యాయవాది జానకీరామన్ రాణీపేట పోలీస్‌స్టేషన్‌లో నటి కస్తూరిపై ఫిర్యాదు చేశారు. ఈ కేసు బుధవారం రాణీపేట కోర్టులో విచారణకు వచ్చింది. కేసును విచారించిన న్యాయమూర్తి అనసూయ తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేశారు. -
రూ. 2 కోట్ల గడియారాల చోరీ : ఒకరి అరెస్ట్
కేకే.నగర్ : మైలాపూర్ దుకాణంలో రూ.2 కోట్ల విలువైన గడియారాలను చోరీ చేసిన సంఘటనలో బీహార్‌కు చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై మైలాపూర్ రాధాకృష్ణన్ రోడ్డుపై గడియారాల దుకాణం ఉంది. ఇందులో గత నెల 29వ తేదీ రాత్రి భారీ చోరీ జరిగింది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దుకాణం తాళాలను బద్దలుకొట్టి రూ.2 కోట్ల విలువైన చేతి గడియారాలను పట్టుకెళ్లారు. ఈ చోరీకి సంబంధించి రాయపేట పోలీసులు విచారణ ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా వా టిని ఆధారంగా పోలీసులు దుండగుల కోసం వెతకడం ప్రారంభించారు. వారి ముఖాలు ఉత్తర దేశానికి చెందిన వారని తెలిసింది. దీంతో బీహార్ పోలీసులకు చెన్నై పోలీసుల సమాచారం పంపారు. వారు ఇచ్చిన వివరాల మేరకు చెన్నై నుంచి ప్రత్యేక బృందం పోలీసులు బీహార్‌కు వెళ్లారు. అక్కడ నిందితుల్లో ఒకరైన మనోజ్‌ను బీహార్ పోలీసుల సహాయంతో అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.80 వేల విలువైన గడియారాలను మాత్రమే పోలీసు లు స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద పోలీసులు తమ దైన శైలిలో విచారణ జరపగా ఇంకనూ అతనితో పాటు పదిమంది సహచరులు ఉన్నట్లు తెలిసింది. వారందరిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా పట్టుబడిన మనోజ్ ఎనిమిదేళ్ల క్రితం పూనేలో జరిగిన చోరీలో పట్టుబడి జైలు శిక్ష అనుభవించాడని పోలీసులు తెలిపారు.