
సాక్షి, చెన్నై(పెరంబూరు) : నటి కస్తూరిపై కేసు బుధవారం కోర్టులో విచారణకు వచ్చింది. వివరాల్లోకెళ్లితే వెళ్లం పుత్తూర్ గ్రామంలో సమయన్ అనే వ్యక్తి హత్య, ఆరాయి,ధనంలపై దాడి సంఘటనపై తన ట్విట్టర్‌లో స్పందించిన నటి కస్తూరి ఒక వర్గంపై చేసిన అనుచిత వ్యాఖ్య లు వివాదాస్పదంగా మారాయి. ఈ సంఘటనపై పట్టాలి మక్కల్ కట్చి రాష్ట్ర ఉపకార్యదర్శి, న్యాయవాది జానకీరామన్ రాణీపేట పోలీస్‌స్టేషన్‌లో నటి కస్తూరిపై ఫిర్యాదు చేశారు. ఈ కేసు బుధవారం రాణీపేట కోర్టులో విచారణకు వచ్చింది. కేసును విచారించిన న్యాయమూర్తి అనసూయ తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment