కేకే.నగర్ : మైలాపూర్ దుకాణంలో రూ.2 కోట్ల విలువైన గడియారాలను చోరీ చేసిన సంఘటనలో బీహార్‌కు చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై మైలాపూర్ రాధాకృష్ణన్ రోడ్డుపై గడియారాల దుకాణం ఉంది. ఇందులో గత నెల 29వ తేదీ రాత్రి భారీ చోరీ జరిగింది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దుకాణం తాళాలను బద్దలుకొట్టి రూ.2 కోట్ల విలువైన చేతి గడియారాలను పట్టుకెళ్లారు. ఈ చోరీకి సంబంధించి రాయపేట పోలీసులు విచారణ ప్రారంభించారు.
సీసీ కెమెరాల ఆధారంగా వా టిని ఆధారంగా పోలీసులు దుండగుల కోసం వెతకడం ప్రారంభించారు. వారి ముఖాలు ఉత్తర దేశానికి చెందిన వారని తెలిసింది. దీంతో బీహార్ పోలీసులకు చెన్నై పోలీసుల సమాచారం పంపారు. వారు ఇచ్చిన వివరాల మేరకు చెన్నై నుంచి ప్రత్యేక బృందం పోలీసులు బీహార్‌కు వెళ్లారు. అక్కడ నిందితుల్లో ఒకరైన మనోజ్‌ను బీహార్ పోలీసుల సహాయంతో అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.80 వేల విలువైన గడియారాలను మాత్రమే పోలీసు లు స్వాధీనం చేసుకున్నారు.
అతని వద్ద పోలీసులు తమ దైన శైలిలో విచారణ జరపగా ఇంకనూ అతనితో పాటు పదిమంది సహచరులు ఉన్నట్లు తెలిసింది. వారందరిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా పట్టుబడిన మనోజ్ ఎనిమిదేళ్ల క్రితం పూనేలో జరిగిన చోరీలో పట్టుబడి జైలు శిక్ష అనుభవించాడని పోలీసులు తెలిపారు.