Ranjan
-
ఏపీలో 40 శాతం పెరిగినఉపాధి అవకాశాలు
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): ఏపీలో 2019లో 4.05 లక్షల చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఉంటే 2023 నాటికి 5.61 లక్షలకు చేరాయని తద్వారా 40శాతం ఉపాధి అవకాశాలు పెరిగాయని టాలీ సొల్యూషన్ సౌత్ ఇండియన్ హెడ్ భువన్ రంజన్ చెప్పారు. గురువారం టాలీ ప్రైమ్ 4.0 సాఫ్ట్‌వేర్‌ను విశాఖలోని ఓ హోటల్లో ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ నాలుగేళ్లలో ఏపీలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగాయని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. దక్షిణ భారత్‌లో వ్యాపార విస్తరణకు ఏపీ అనుకూలంగా ఉందని, అందుకే విశాఖలో తమ సాఫ్ట్‌వేర్‌ను ఆవిష్కరించామని తెలిపారు. వచ్చే రెండేళ్లలో వంద ఎంఎస్ఎంఈ వ్యాపార క్లస్టర్లను ప్రారంభించాలని ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తుందని, ఇది తమ వ్యాపార విస్తరణకు ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రంలో టాలీ సాఫ్ట్‌వేర్‌ను 50 వేల మందికి పైగా ఉపయోగిస్తున్నారని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా రాబోయే రెండేళ్లలో ఈ సంఖ్య 4 లక్షలకు చేరుకునే అవకాశం తమ సంస్థకు లభిస్తుందన్నారు. ఈ టాలీ ప్రైమ్ 4.0లో ఆకర్షణీయమైన డ్యాష్‌బోర్డు, వాట్సప్‌ను అనుసంధానం, ఎంఎస్ ఎక్స్ఎల్ ఫైల్‌ను నేరుగా సాఫ్ట్‌వేర్‌లో అప్లోడ్ చేసే ఫీచర్ ఉంచినట్లు వివరించారు. టాలీపై యువతకు శిక్షణ ఇచ్చేందుకు టాలీ ఎడ్యుకేషన్ సెంటర్లను ప్రతీ నగరంలో ఏర్పాటు చేస్తామన్నారు. -
కాషాయీకరణ ‘క్విట్ ఇండియా’
న్యూఢిల్లీ: కాషాయీకరణను, మత శక్తుల ఏకీకరణను, మతతత్వాన్ని దేశం నుంచి తరిమికొట్టాల్సిన సమయం వచ్చిందని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదర అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో గురువారం జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. అవినీతి క్విట్ ఇండియా అంటూ బీజేపీ ఇచ్చిన నినాదాన్ని తిప్పికొట్టారు. క్విట్ ఇండియా ఉద్యమం జరగాల్సిందేనని చెప్పారు. కాషాయీకరణ, మతతత్వం క్విట్ ఇండియా అని సభలో అధిర్ రంజన్ నినదించారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే.. కేవలం ఒక రాష్ట్ర సమస్యగా చూడొద్దు ‘‘నరేంద్ర మోదీ 100సార్లు ప్రధానమంత్రి అయినా మాకు ఎలాంటి ఆందోళన, అభ్యంతరం లేదు. మా ఆందోళన అంతా దేశ ప్రజల గురించే. మణిపూర్ ప్రజలకు ప్రధానమంత్రి స్వయంగా శాంతి సందేశం ఇవ్వాలని మా పార్టీ కోరుతోంది. మణిపూర్ హింసాకాండ గురించి ‘మన్ కీ బాత్’లో కనీసం ఒక్కసారైనా మోదీ మాట్లాడాలని మేము ఆకాంక్షిస్తున్నాం. మణిపూర్‌లో హింస అనేది సాధారణ అంశం కాదు. ఆ రాష్ట్రంలో తెగల మధ్య ఘర్షణ జరుగుతోంది. పౌర యుద్ధం కొనసాగుతోంది. మణిపూర్ హింస మొత్తం ప్రపంచం దృష్టిలో పడింది. యూరోపియన్ యూనియన్ పార్లమెంట్‌తోపాటు అమెరికాలోనూ దీనిపై చర్చ జరిగింది. మణిపూర్ వ్యవహారాన్ని కేవలం ఒక రాష్ట్ర సమస్యగా చూడొద్దు. అందుకే ప్రదానమంత్రి స్వయంగా కలుగజేసుకోవాలని, మణిపూర్‌లో పరిస్థితిని చక్కదిద్దాలని, శాంతిని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రధానమంత్రిని లోక్‌సభకు రప్పించడానికి అవిశ్వాస తీర్మానం మినహా మాకు (విపక్ష ‘ఇండియా’ కూటమి) మరో మార్గం లేకుండా పోయింది. బఫర్ జోన్.. ప్రజల మధ్య వద్దు అది హస్తినాపురం అయినా, మణిపూర్ అయినా మహిళలపై అకృత్యాలు, అత్యాచారాలు జరుగుతూ ఉంటే దేశాన్ని పరిపాలించే రాజు అంధుడిగా వ్యవహరించకూడదు. కఠిన చర్యలు ఉపక్రమించాలి. దోషులను శిక్షించాలి. దేశాన్ని ఏలే పాలకుడు అంధుడైన ధృతరాష్ట్రుడిలా మిన్నకుండిపోతే ఇక మహిళలకు రక్షణ కల్పించేదెవరు? మణిపూర్‌లో రెండు వర్గాల ప్రజల మధ్య ‘బఫర్ జోన్’ను ప్రభుత్వం సృష్టించిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బుధవారం సభలో చెప్పారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. బఫర్ జోన్ అనేది రెండు దేశాల మధ్య ఉంటుంది. అంతేతప్ప ప్రజల మధ్య ఉండడం తగదు. అవిశ్వాస తీర్మానంపై సభలో మాట్లాడేందుకు మణిపూర్‌కు చెందిన ఇద్దరు ఎంపీలు ప్రయత్నిస్తే స్పీకర్ అనుమతించకపోవడం దారుణం’’ అని అధిర్ రంజన్ చౌదరి అసంతృప్తి వ్యక్తం చేశారు. అధిర్ రంజన్ వ్యాఖ్యలు తొలగింపు లోక్‌సభలో అధిర్ రంజన్ చేసిన వ్యాఖ్యలపై హోంమంత్రి అమిత్ షా తీవ్ర అభ్యంతరం తెలిపారు. ప్రధాని మోదీని ధృతరాష్ట్రుడితో పోల్చడం ఏమిటని నిలదీశారు. అధిర్ రంజన్ వ్యాఖ్యల రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ ఓంబిర్లా చెప్పారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ సైతం అధిర్ రంజన్ వ్యాఖ్యలను ఖండించారు. సభకు, దేశానికి అధిర్ రంజన్ క్షమాపణ చెప్పాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు. -
మార్కెట్లో పేదోడి ఫ్రిజ్‌లు
మొదలైన కొనుగోళ్లు నిర్మల్ అర్బన్ : వేసవి కాలం రానే వచ్చింది. చల్లని నీరు అందించే పేదోడి ఫ్రిజ్‌లుగా పేరొందిన రంజన్లు, కుండలు మార్కెట్లోకి రానే వచ్చాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ప్రజలు రంజన్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రజల వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని పట్టణంలోని పలు ప్రాంతాల్లో వ్యాపారులు విక్రయకేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదలైన గిరాకీ.. రంజన్లు, కుండలు, కూజాలకు గిరాకీ మొదలైంది. వేసవిలో దాహాన్ని తీర్చుకునేందుకు చల్లని నీటి కోసం వీటి వాడకం తప్పనిసరి. ఫ్రిజ్‌లు లేనివారు, ఫ్రిజ్‌లు విని యోగించలేని వారంతా చల్లని నీటి కోసం మట్టితో త యారు చేసిన రంజన్లు, కుండలనే వాడతారు. చల్లని నీటి కోసం వీటిపైనే ఆధారపడతారు. దీంతో వీటికి సాధారణంగా గిరాకీ ఎక్కువనే చెప్పవచ్చు. రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం ఆదిలాబాద్ రంజన్లు, కుండలకు ఉన్న విషయం తెలిసిందే. వినియోగదారుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని ఆదిలాబాద్ రంజన్లు, కుండలను వ్యాపారులు అందుబాటులో ఉంచారు. మార్కెట్లో కొత్త కొత్త రకాలైన ఫ్రిజ్‌లు అందుబాటులోకి వచ్చినా.. వీటికి ఏ మాత్రం గిరాకీ తగ్గడం లేదని వ్యాపారులు చెబుతున్నా రు. రంజన్లకు ఫ్రిజ్‌లు పోటీ కాదని వినియోగదారులు చెబుతున్నారు. పేదలతో పాటు మధ్య, ఉన్నత వర్గాల వారు కూడా వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఫ్రిజ్ నీరు ఆరోగ్యదాయకం కాదని వైద్యులు పేర్కొనడంతో ఆరోగ్యంతో పాటు చల్లని నీటిని అందించే రంజన్లు, కుండలను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. అందుబాటు ధరల్లో.. ఆదిలాబాద్ నుంచి రంజన్లను నిర్మల్ పట్టణానికి తీసుకువచ్చి విక్రయదారులు అమ్మకాలు చేపడుతున్నారు. వినియోగదారులను ద ృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా దు కాణాలు వెలిశాయి. బస్టాండ్, ఎస్బీహెచ్ ముందు, రూరల్ పోలీస్‌స్టేషన్ సమీపంలో ఇతర ప్రాంతాల్లో రంజన్లు, కుండలను విక్రయిస్తున్నారు. వివిధ సైజుల్లో, డిజైన్లలో ఇవి అందుబాటులో ఉన్నాయి. రంజన్లు సైజు ను బట్టి రూ.80 నుంచి రూ.120 వరకు, కుండలు రూ. 40 నుంచి రూ.60 వరకు విక్రరుుస్తున్నారు. చల్లని నీరందించే రంజన్లు, కుండల ధరలు మధ్య తరగతి, సామా న్య ప్రజలకూ అందుబాటులో ఉండడంతో వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంకా పగటి ఉష్ణోగ్రతలు పెరిగితే గిరాకీ మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
దరఖాస్తు చేస్తే చాలు బ్యాంకు రుణం..
రాష్ట్ర స్థాయిలో క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ కంపెనీల ప్రతిపాదనకు ప్రభుత్వ హామీ 2015-16లో ఇన్సూరెన్స్ ఫండ్ ఏర్పాటు తెలంగాణ పరిశ్రమల శాఖ కమిషనర్ జయేష్ రంజన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రుణాల కోసం పారిశ్రామికవేత్తలు ఇక బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరగక్కర లేదు. చిన్న, మధ్యతరహా పరిశ్రమ ఏర్పాటుకై రుణం కోరుతూ బ్యాంకుకు దరఖాస్తు చేస్తే చాలు.. రుణం మంజూరయ్యేలా రాష్ట్ర స్థాయి క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ రూపుదిద్దుకుంటోంది. నూతన పారిశ్రామిక విధానంలో భాగంగా ప్రభుత్వం ఈ స్కీమ్‌కు శ్రీకారం చుట్టిందని తెలంగాణ పరిశ్రమల శాఖ కమిషనర్ జయేష్ రంజన్ శుక్రవారం తెలిపారు. పరిశ్రమను స్థాపించేందుకై బ్యాంకులకు వచ్చే ప్రతి దరఖాస్తుకు (ఉత్తమ ప్రతిపాదన) ప్రభుత్వం నుంచి హామీ ఉంటుందన్నారు. ‘బ్యాంకులు ఇచ్చే రుణాలకు ప్రభుత్వానిదే బాధ్యత. నిధులు పక్కదారి పట్టకుండా చూస్తాం. కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తాం. కంపెనీ రుణం తీర్చలేకపోతే ఈ ఫండ్ నుంచి బ్యాంకుకు చెల్లిస్తాం’ అని అన్నారు. నిధుల మంజూరుకు బ్యాంకులకు నిర్ణీత గడువు విధిస్తామన్నారు. పారిశ్రామిక వృద్ధికి ఎంఎస్ఎంఈలకు నిధులు అన్న అంశంపై అసోచాం, ఫ్యాప్సీ సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో ఈ విషయాలను వెల్లడించారు. ఖాయిలా పడకుండా.. ఖాయిలా దిశగా వెళ్తున్న చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకోవడానికి ఇన్సూరెన్స్ ఫండ్ ఒకదానిని 2015-16 బడ్జెట్లో అమలు చేయనున్నట్టు జయేష్ రంజన్ తెలిపారు. ‘ఫండ్కై కంపెనీల నుంచి ప్రీమియం వసూలు చేస్తాం. ప్రభుత్వం కూడా అవసరమైనన్ని నిధులు సమకూరుస్తుంది. బ్యాంకుకు చెల్లించాల్సిన వాయిదాకు కంపెనీకి గడువు ఇస్తాం. అవక తవకలకు పాల్పడితే కంపెనీని సీజ్ చేస్తాం’ అని వెల్లడించారు. ఎస్ఎంఈల కోసం ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. స్థానిక ఎంఎస్ఎంఈలకు భారీ పరిశ్రమల తోడ్పాటు తప్పనిసరి అన్నారు. ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలకూ ప్రోత్సాహకాలు ఉంటాయని చెప్పారు. రుణ దరఖాస్తులు ఎలా సిద్ధం చేయాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పిస్తామని వివరించారు. ఫండింగ్ ఒక్కటే చాలదని, సమయానుకూలంగా వ్యాపారాన్ని మల్చుకోవాల్సిందేనని ఫ్యాప్సీ ప్రెసిడెంట్ శివ్‌కుమార్ రుంగ్టా అన్నారు. 50 శాతం స్టార్టప్‌లు ఏడాది తిరక్కముందే కనుమరుగు అవుతున్నాయి. 27 శాతం స్టార్టప్‌లు మూడేళ్లు కూడా నిలదొక్కుకోవడం లేదని రిసర్జెంట్ ఇండియా సీనియర్ మేనేజర్ వి.శంకరనారాయణన్ తెలిపారు.