వడోదర బీజేపీ అభ్యర్థి రంజన్‌బెన్ భట్టా
న్యూఢిల్లీ: గుజరాత్ లోని వడోదర లోక్‌సభ స్థానానికి తమ అభ్యర్థిగా రంజన్‌బెన్ భట్టా పేరును బీజేపీ ఖరారు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయడంతో వడోదర స్థానం ఖాళీ అయింది. ఈ ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో వడోదర్ లో మోడీ 5.7లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచ్చారు. వారణాసిలో కూడా ఆయన విజయం సాధించడంతో వడోదర సీటు వదులుకున్నారు.
కాగా, కాంగ్రెస్ తరపున నరేంద్ర రావత్ పోటీ చేసే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ 13న వడోదర ఉప ఎన్నిక జరగనుంది.