కాలుష్యం, పొగమంచుతో ఢిల్లీలోని మ్యాచ్‌లు రద్దు
న్యూఢిల్లీ: హైదరాబాద్-త్రిపుర, బెంగాల్-గుజరాత్ జట్ల మధ్య ఇక్కడ జరగాల్సిన మ్యాచ్‌లను ఉన్నపళంగా రద్దు చేశారు. తీవ్రమైన వాయు కాలుష్యంతో పాటు ఎడతెగని పొగమంచు వల్ల ఆట సాగకపోవడంతో మ్యాచ్‌లను రద్దు చేసినట్లు ఆయా మ్యాచ్‌ల రిఫరీలు వెల్లడించారు.
రేపు బెంగాల్ జట్టు కోల్‌కతాకు, గుజరాత్ ఆటగాళ్లు అహ్మదాబాద్‌కు పయనం కానున్నారు. ఇలాంటి కారణంతో రంజీ మ్యాచ్‌లు రద్దవడం ఇదే మొదటిసారి. త్వరలోనే ఈ మ్యాచ్‌లను రీషెడ్యూల్ చేయాలని బీసీసీఐ భావిస్తోంది.