breaking news
Ranji Trophy 2025-26
-
మరోసారి 'మరో ఛాన్స్' అంటున్న కరుణ్ నాయర్..!
డియర్ క్రికెట్ మరో ఛాన్స్ ఇవ్వు అంటూ ఎనిమిదేళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ (Karun Nair).. ఇచ్చిన ఛాన్స్‌ను సద్వినియోగం చేసుకోలేక, ఇలా వచ్చి అలా మాయమయ్యాడు. ఇటీవలి ఇంగ్లండ్ పర్యటనలో భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన నాయర్.. 7 ఇన్నింగ్స్‌ల్లో ఒకే ఒక హాఫ్ సెంచరీ సాయంతో 205 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఫలితంగా తదుపరి సిరీస్‌కే జట్టులో స్థానం కోల్పోయాడు. ఆతర్వాత అతనికి 'ఏ' జట్టులోనూ స్థానం లభించలేదు. సెలెక్టర్లు కరుణ్ నుంచి చాలా ఆశించామని చెప్పి చేతులు దులుపుకున్నారు. తాజాగా కరుణ్ మరోసారి 'మరో ఛాన్స్' అంటూ ముందుకు వచ్చాడు.ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో తొలి మ్యాచ్‌లో అర్ద సెంచరీ (73), రెండో మ్యాచ్‌లో భారీ సెంచరీ (174 నాటౌట్) చేసి సెలెక్టర్లకు సవాల్ విసిరాడు. సెంచరీ అనంతరం కరుణ్ విలేకరులతో మాట్లాడుతూ ఇలా అన్నాడు."టీమిండియా నుంచి తప్పించడం బాధ కలిగించింది. ఒక్క సిరీస్ కంటే ఎక్కువ అర్హుడినని నన్ను నేను ఒప్పించుకుంటూ ఉంటాను. గత రెండు సంవత్సరాల నా ప్రదర్శన చూస్తే, ఆ స్థాయికి అర్హుడిననే అనిపిస్తుంది. ప్రస్తుతం నా పని పరుగులు చేయడం ఒక్కటే. దేశం కోసం ఆడాలన్నదే నా లక్ష్యం. అది సాధపడకపోతే, నా జట్టుకు విజయాన్ని అందించడమే తదుపరి లక్ష్యం"కరుణ్ చేసిన ఈ వ్యాఖ్యలు చూస్తుంటే అతనిలో నిరాశతో కూడిన ఆశ కనిపిస్తుంది. క్రికెట్.. మరోసారి మరో ఛాన్స్ ఇవ్వు అంటూ అర్దించినట్లనిపిస్తుంది. దేశం కోసం ఆడాలన్న తాపత్రయం స్పష్టమవుతుంది.33 ఏళ్ల కరుణ్‌కు ఇంగ్లండ్ పర్యటనలో మంచి ఆరంభాలు లభించినా దురదృష్టవశాత్తు వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయాడు. ఐదో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో కరుణ్ కష్టమైన పిచ్‌పై అద్భుత ఇన్నింగ్స్ ఆడినా తగిన గుర్తింపు దక్కలేదు. ఆ ఇన్నింగ్స్‌లో ఇరు జట్లలో కరుణే టాప్ స్కోరర్‌గా నిలిచాడు.వాస్తవానికి కరుణ్‌కు అతి భారీ ఇన్నింగ్స్‌లు ఆడగల సామర్థ్యం ఉంది. ఇది చాలాసార్లు నిరూపితమైంది. ఇలాంటి ఆటగాడికి కొన్ని అవకాశాలు మాత్రమే ఇవ్వడం సబబు కాదు. కరుణ్‌కు కనీసం దక్షిణాఫ్రికా 'ఏ' సిరీస్‌తో అయినా భారత ఏ జట్టుకు ఎంపిక చేసి ఉండాల్సింది. అక్కడ ప్రదర్శనను బట్టి అతని భవిష్యత్తును డిసైడ్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకో సెలెక్టర్లు కరుణ్ విషయంలో పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారనే భావన కలుగుతుంది.చదవండి: చారిత్రక ఘట్టం.. భారత క్రికెట్ ప్రయాణంలో మరిచిపోలేని అధ్యాయం -
పది పరుగులే ఇచ్చి మూడు వికెట్లు కూల్చిన పున్నయ్య
పుదుచ్చేరి: హైదరాబాద్ సీమర్ పున్నయ్య (6–2–10–3) నిప్పులు చెరిగే బౌలింగ్‌తో పుదుచ్చేరి బ్యాటర్ల పనిపట్టాడు. వర్షం వల్ల కేవలం 25 ఓవర్ల ఆటే జరిగినా... పుదుచ్చేరి పతనావస్థకు చేరింది. రంజీ ట్రోఫీ గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో 25/1 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన పుదుచ్చేరి వర్షంతో ఆట నిలిచే సమయానికి 34 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. టాపార్డర్ బ్యాటర్ ఆనంద్ బైస్ (41; 6 ఫోర్లు, 1 సిక్స్) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లే చేయలేకపోయారు. పది మంది క్రీజులోకి రాగా... సిద్దాంత్ (16), గంగా శ్రీధర్ రాజు (11) తప్ప మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. హైదరాబాద్ సీమర్ పున్నయ్య ఆరు ఓవర్ల స్పెల్‌తోనే పుదుచ్చేరి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఇతనికి జతగా తనయ్ త్యాగరాజన్ (2/41) స్పిన్ మాయాజాలంతో కీలకమైన వికెట్లను తీయడంతో పుదుచ్చేరి ఆలౌట్‌కు సిద్ధమైంది. ప్రస్తుతం చేతిలో 2 వికెట్లు మాత్రమే మిగిలున్న పుదుచ్చేరి ఇంకా 343 పరుగులు వెనుకడి ఉంది. ఆటకు నేడు ఆఖరి రోజు. వర్షం వల్ల ఆట ఇంకా మొదలుకానేలేదు.మూడో రోజు ఆట రద్దు రంజీ ట్రోఫీ గ్రూప్ ‘ఎ’లో ఆంధ్ర, బరోడా జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు మోంథా తుపాను అడ్డుపడింది. దీంతో మూడో రోజు ఒక్కబంతి కూడా పడకుండానే ఆట రద్దు అయ్యింది. బరోడా తొలి ఇన్నింగ్స్‌లో 363 పరుగులు చేయగా, ఆంధ్ర రెండో రోజు ఆట వరకే 43/2 స్కోరు చేసింది. -
జైస్వాల్ కీలక నిర్ణయం
భారత టెస్ట్ జట్టు ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) కీలక నిర్ణయం తీసుకున్నాడు. టీమిండియా తరఫున ఎలాంటి కమిట్మెంట్స్ లేకపోవడంతో దేశవాలీ క్రికెట్ ఆడేందుకు నిర్ణయించుకున్నాడు. త్వరలో జరుగనున్న రంజీ ట్రోఫీ 2025/26 (Ranji Trophy) మూడో రౌండ్ మ్యాచ్ ఆడేందుకు సన్నద్దత వ్యక్తం చేస్తూ.. తన హోం టీమ్ మేనేజ్మెంట్కు లేఖ రాశాడు. ఈ విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా వెల్లడించాడు.జైస్వాల్ కొద్ది కాలం క్రితం తన హోం టీమ్ ముంబైని కాదని గోవాకు ఆడాలని నిర్ణయించుకున్నాడు. అయితే తదనంత పరిణామాల్లో యూటర్న్ తీసుకున్నాడు. తాజాగా రాజస్తాన్‌తో జరిగబోయే మూడో రౌండ్ మ్యాచ్‌కు ముంబై తరఫున ఆడేందుకు అందుబాటులో ఉన్నట్లు ప్రకటించాడు.ఈ మ్యాచ్ నవంబర్ 1 నుంచి జైపూర్‌లో జరుగుతుంది. ఎలైట్ గ్రూప్ D భాగంగా ఈ మ్యాచ్ జరుగనుంది. ముంబై మేనేజ్మెంట్ తమను కాదని వెళ్లిపోవాలని చూసిన జైస్వాల్‌కు అవకాశం ఇస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒక వేళ అవకాశం ఇస్తే అతను ముంబై జట్టులో కీలకమవుతాడు.జైస్వాల్ తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో పాల్గొన్నాడు. అయితే అక్టోబర్ 29 నుంచి ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల టీ20ల సిరీస్‌కు అతను ఎంపిక కాలేదు. దీంతో దేశీయ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నాడు.టీమిండియా తరఫున కమిట్మెంట్స్ లేని సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్లు దేశీయ క్రికెట్ ఆడాలని బీసీసీఐ కండిషన్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకే జైస్వాల్ కూడా రంజీ ఆడాలని నిర్ణయించుకున్నాడు. మూడో రౌండ్‌కు ముంబై జట్టును త్వరలో ప్రకటిస్తారు.జైస్వాల్ గత సీజన్లో జమ్మూ అండ్ కాశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరఫున చివరిసారి ఆడాడు. ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మ కూడా పాల్గొన్నాడు. జైస్వాల్ తన చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ను ఈ ఏడాది ఆగస్ట్‌లో ఆడాడు. దులీప్ ట్రోఫీ 2025లో వెస్ట్ జోన్ తరఫున బరిలోకి దిగాడు.రంజీ ట్రోఫీలో ఆడటం జైస్వాల్‌కు వ్యక్తిగతంగా కలిసొస్తుంది. నవంబర్ 14 నుంచి దక్షిణాఫ్రికాతో జరుగబోయే హోం సిరీస్‌కు ముందు మంచి ప్రాక్టీస్ అవుతుంది. ఆ సిరీస్‌లో భారత్ రెండు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. జైస్వాల్‌కు టెస్ట్ జట్టులో చోటు పక్కా కాగా.. వన్డే, టీ20ల్లో అవకాశం లభిస్తుందో లేదో చూడాలి. సౌతాఫ్రికాతో టెస్ట్ మ్యాచ్‌లు నవంబర్ 14 (కోల్‌కతా), నవంబర్ 22 (గౌహతి) తేదీల్లో జరుగనున్నాయి.చదవండి: వెస్టిండీస్ బోణీ -
ఉగ్రరూపం దాల్చిన పృథ్వీ షా.. సెకెండ్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ
వివాదాస్పద బ్యాటర్ పృథ్వీ షా (Prithvi Shaw) మహారాష్ట్ర (Maharashtra) తరఫున తన రెండో రంజీ మ్యాచ్‌లోనే ఉగ్రరూపం దాల్చాడు. 2025-26 ఎడిషన్‌లో (Ranji Trophy) భాగంగా చండీఘడ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో (రెండో ఇన్నింగ్స్) కేవలం 141 బంతుల్లోనే డబుల్ సెంచరీ బాదాడు. రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ చరిత్రలో ఇది రెండో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 156 బంతులు ఎదుర్కొన్న షా.. 29 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 222 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. డబుల్ సెంచరీ చేసే క్రమంలో షా కేవలం 72 బంతుల్లోనే శతక్కొట్టాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో మహారాష్ట్ర తరఫున ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. మొత్తంగా షాకు ఇది ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 14వ సెంచరీ.ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 8 పరుగులకే ఔటైన షా.. రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా పుంజుకుని డబుల్ సెంచరీ సాధించాడు. మహారాష్ట్ర తరఫున రంజీ అరంగేట్రాన్ని (ఈ ఎడిషన్ తొలి మ్యాచ్) డకౌట్‌తో ప్రారంభించిన షా (కేరళపై).. ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 75 పరుగులతో రాణించాడు.ప్రస్తుత రంజీ సీజన్ ప్రారంభానికి ముందే ముంబై నుంచి మహారాష్ట్రకు మారిన షా.. కొత్త జట్టు తరఫున ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ముంబైతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో 181 పరుగులు.. అంతకుముందు బుచ్చిబాబు టోర్నీలో చత్తీస్‌ఘడ్‌పై 111 పరుగులు చేశాడు. వరుస సెంచరీతో షా మరోసారి టీమిండియావైపు దూసుకొస్తున్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో రుతురాజ్ గైక్వాడ్ (116) సెంచరీతో కదంతొక్కడంతో మహారాష్ట్ర 313 పరుగులు చేసింది. అనంతరం విక్కీ ఓస్త్వాల్ (21-6-40-6) ఆరేయడంతో చంఢీఘడ్ తొలి ఇన్నింగ్స్‌లో 209 పరుగులకు ఆలౌటైంది. రమన్ బిష్ణోయ్ (54), పదో నంబర్ ఆటగాడు నిషంక్ బిర్లా (56 నాటౌట్) చండీఘడ్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు.104 పరుగుల కీలక ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మహారాష్ట్ర.. 3 వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఫలితంగా 463 పరుగుల భారీ ఆధిక్యం సాధించి, ప్రత్యర్దికి 464 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.చదవండి: పక్కటెముకల్లో రక్తస్రావం.. సీరియస్‌గా శ్రేయస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితి -
పృథ్వీ షా విధ్వంసకర శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ
వివాదాస్పద బ్యాటర్ పృథ్వీ షా (Prithvi Shaw) రంజీ ట్రోఫీలో (Ranji Trophy) మహారాష్ట్ర (Maharashtra) తరఫున తన తొలి సెంచరీ సాధించాడు. 2025-26 ఎడిషన్‌లో భాగంగా చండీఘడ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో (రెండో ఇన్నింగ్స్) కేవలం 72 బంతుల్లోనే (13 ఫోర్ల సాయంతో) శతక్కొట్టాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో ఇది ఆరో వేగవంతమైన శతకం. తొలి ఐదు ఫాస్టెస్ట్ సెంచరీలు రిషబ్ పంత్ (48), రాజేశ్ బోరా (56), రియన్ పరాగ్ (56), రూబెన్ పాల్ (60), రజత్ పాటిదార్ (68) పేరిట ఉన్నాయి. రంజీ మహారాష్ట్ర తరఫున ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. షాకు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇది 14వ సెంచరీ. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 8 పరుగులకే ఔటైన షా.. రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా పుంజుకుని సెంచరీ సాధించాడు. మహారాష్ట్ర తరఫున రంజీ అరంగేట్రాన్ని (ఈ ఎడిషన్ తొలి మ్యాచ్) డకౌట్‌తో ప్రారంభించిన షా (కేరళపై).. రెండో ఇన్నింగ్స్‌లో 75 పరుగులతో రాణించాడు.ప్రస్తుత రంజీ సీజన్ ప్రారంభానికి ముందే ముంబై నుంచి మహారాష్ట్రకు మారిన షా.. కొత్త జట్టు తరఫున అదరగొడుతున్నాడు. ముంబైతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో 181 పరుగులు.. అంతకుముందు బుచ్చిబాబు టోర్నీలో చత్తీస్‌ఘడ్‌పై 111 పరుగులు చేశాడు. వరుస సెంచరీలతో షా మరోసారి టీమిండియావైపు దూసుకొస్తున్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో రుతురాజ్ గైక్వాడ్ (116) సెంచరీతో కదంతొక్కడంతో మహారాష్ట్ర 313 పరుగులు చేసింది. అనంతరం విక్కీ ఓస్త్వాల్ (21-6-40-6) ఆరేయడంతో చంఢీఘడ్ తొలి ఇన్నింగ్స్‌లో 209 పరుగులకు ఆలౌటైంది. రమన్ బిష్ణోయ్ (54), పదో నంబర్ ఆటగాడు నిషంక్ బిర్లా (56 నాటౌట్) చండీఘడ్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు.104 పరుగుల కీలక ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మహారాష్ట్ర, మూడో రోజు తొలి సెషన్ సమయానికి వికెట్ నష్టానికి 164 పరుగులు చేసి, 268 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. షా 105, సిద్దేశ్ వీర 28 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. చదవండి: IND vs AUS T20 Series: తొలి పంజా మనదే..! -
రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యద్భుతం
రంజీ ట్రోఫీ 2025-26 (Ranji Trophy) ఎడిషన్‌లో అద్భుతం జరిగింది. అస్సాం, సర్వీసస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ (Assam vs Services) కేవలం 90 ఓవర్లలోనే ముగిసింది. 91 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యంత వేగంగా (బంతుల పరంగా) పూర్తైన మ్యాచ్ ఇదే.గతంలో ఈ రికార్డు 1961-62 ఎడిషన్‌లో ఢిల్లీ, రైల్వేస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ పేరిట ఉండేది. ఈ మ్యాచ్ 547 బంతుల్లో ముగియగా.. అస్సాం-సర్వీసస్ మ్యాచ్ కేవలం 540 బంతుల్లోనే పూర్తైంది.అస్సామ్‌లోని టిన్సుకియా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ గ్రౌండ్లో నిన్న (అక్టోబర్ 25) మొదలైన ఈ మ్యాచ్ కేవలం నాలుగు సెషన్లలోనే (రెండో రోజు తొలి సెషన్) ముగిసింది. ఎలైట్ గ్రూప్-సిలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో అస్సాంపై సర్వీసస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అస్సాం తొలి ఇన్నింగ్స్‌లో 17.2 ఓవర్లు (103 ఆలౌట్), రెండో ఇన్నింగ్స్‌లో 29.3 ఓవర్లు (75 ఆలౌట్) ఆడగా.. సర్వీసస్ తొలి ఇన్నింగ్స్‌లో 29.2 ఓవర్లు (108 ఆలౌట్), రెండో ఇన్నింగ్స్‌లో 13.5 ఓవర్లు (73/2) ఆడింది.మ్యాచ్ మొత్తంలో ఇరు జట్లు కలిపి 359 పరుగులు చేశాయి. 32 వికెట్లు పడ్డాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు రియాన్ పరాగ్ (Riyan Parag) (అస్సాం) బంతితో అద్భుత ప్రదర్శనలు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5, రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు తీశాడు.చరిత్రాత్మక హ్యాట్రిక్స్ఈ మ్యాచ్‌లో మరో అద్భుతం కూడా చోటు చేసుకుంది. సర్వీసస్ బౌలర్లు అర్జున్ శర్మ (లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్), మోహిత్ జాంగ్రా (లెఫ్ట్ ఆర్మ్ సీమర్) ఒకే ఇన్నింగ్స్‌లో (అస్సాం తొలి ఇన్నింగ్స్) హ్యాట్రిక్‌లు నమోదు చేశారు. రంజీ ట్రోఫీ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో డబుల్ హ్యాట్రిక్‌లు నమోదు కావడం ఇదే తొలిసారి.ఇన్నింగ్స్ విశ్లేషణ:- అస్సాం తొలి ఇన్నింగ్స్: 103 పరుగులు (17.2 ఓవర్లు) టాప్ స్కోరర్: ప్రద్యున్ సైకియా – 52 - సర్వీసస్ తొలి ఇన్నింగ్స్: 108 పరుగులు (29.2 ఓవర్లు) అస్సాం బౌలర్ రియాన్ పరాగ్: కెరీర్ బెస్ట్ 5/25 - అస్సాం రెండో ఇన్నింగ్స్: 75 పరుగులు (29.3 ఓవర్లు) అర్జున్ శర్మ: 4/20 అమిత్ శుక్లా: 6 ఓవర్లు – 3 వికెట్లు – కేవలం 6 పరుగులు - సర్వీసస్ లక్ష్యం- 71 పరుగులు 13.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించిందిచదవండి: Women's CWC: అద్వితీయ ప్రస్థానం.. చరిత్ర తిరగేస్తే అంతా వారే..! -
టీమిండియా పొమ్మంది.. కట్ చేస్తే! సెంచరీతో సెలక్టర్లకు వార్నింగ్
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా వెటరన్ కరుణ్ నాయర్ అద్భుత సెంచరీతో సెలక్టర్లకు సవాల్ విసిరాడు. భారత టెస్టు జట్టులో చోటు కోల్పోయిన వెటరన్ కరుణ్ నాయర్.. ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో కర్ణాటకకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.ఈ క్రమంలో శిమొగా వేదికగా గోవాతో జరుగుతున్న మ్యాచ్‌లో నాయర్ శతక్కొట్టాడు. 65 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కర్ణాటకను నాయర్ తన సెంచరీతో ఆదుకున్నాడు. తొలుత అభినవ్ మనోహర్‌తో భాగస్వామ్యం నెలకొల్పిన నాయర్.. తర్వాత శ్రేయస్ గోపాల్‌తో కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు.కరుణ్ ప్రస్తుతం 129 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 11 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. అంతకుముందు సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో కూడా హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో 95 ఓవర్లు ముగిసే సరికి కర్ణాటక 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది.నాయర్ మళ్లీ వస్తాడా?కాగా దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత జట్టులోకి వచ్చిన కరుణ్ నాయర్.. ఇంగ్లండ్ గడ్డపై తనను లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆ సిరీస్‌లో నాలుగు టెస్టులు ఆడి కేవలం 25.63 సగటుతో 205 పరుగులు మాత్రమే చేశాడు. భారత బ్యాటర్లు సెంచరీల మోత మ్రోగించిన చోట.. నాయర్ కనీసం ఒక్కసారి కూడా మూడెంకెల స్కోర్ సాధించకపోవడం సెలక్టర్లను తీవ్రంగా నిరాశపరిచింది.దీంతో స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌కు కరుణ్ నాయర్‌ను జట్టు నుంచి తప్పించారు. అతడి స్ధానంలో దేవ్‌దత్త్ పడిక్కల్‌కు అవకాశమిచ్చారు. ఇప్పుడు మళ్లీ తన ఫామ్‌ను తిరిగి అందుకోవడంతో నాయర్‌ను సౌతాఫ్రికా సిరీస్‌కు ఎంపిక చేస్తారో లేదో వేచి చూడాలి.చదవండి: రోహిత్ శర్మ రిటైర్మెంట్ అప్పుడే.. కన్ఫర్మ్ చేసిన కోచ్ -
ఆసీస్ టూర్‌కు నో ఛాన్స్.. రవీంద్ర జడేజా సంచలన నిర్ణయం!
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా దాదాపు పది నెలల తర్వాత తిరిగి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆడేందుకు సిద్దమయ్యాడు. రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో భాగంగా మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌కు ప్రకటించిన సౌరాష్ట్ర జట్టులో జడేజాకు చోటు దక్కింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌కు జడేజా ఎంపిక కాకపోవడంతో ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాడు.ఈ క్రమంలో ఎంపీతో మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాని జడేజా తనంతట తానే సౌరాష్ట్ర సెలక్టర్లకు తెలియజేసినట్లు తెలుస్తోంది. జడేజా జట్టులోకి వచ్చినప్పటికి సౌరాష్ట్ర కెప్టెన్‌గా జయదేవ్ ఉనద్కట్ కొనసాగనున్నాడు. అక్టోబర్ 25 నుంచి రాజ్‌కోట్ వేదికగా సౌరాష్ట్ర-మధ్యప్రదేశ్ మ్యాచ్ ప్రారంభం కానుంది.సూపర్ ఫామ్‌లో జడ్డూ..కాగా జడేజా ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన జడ్డూ.. ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. అయితే ఆసీస్‌తో వన్డేలకు జడేజాను ఎంపిక చేస్తారని అంతా భావించారు. కానీ సెలక్టర్లు మాత్రం ఎడమ చేతి వాటం స్పిన్నర్‌గా జడేజాకు బదులుగా అక్షర్ పటేల్‌ను తీసుకున్నారు.వాషింగ్టన్ సుందర్, పటేల్‌ను స్పిన్ ఆల్రౌండర్లగా ఎంపిక చేసిన సెలక్టర్లు.. జడేజాకు ఛాన్స్ ఇవ్వలేదు. అయితే జడ్డూతో చర్చించాకే సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సౌరాష్ట్ర క్రికెట్ తిరిగి వచ్చే నెలలో భారత జెర్సీలో కన్పించనున్నాడు. సౌతాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్‌లో జడ్డూ భాగంగా కానున్నాడు. ఈ సిరీస్ సన్నాహకంగా రంజీ ట్రోఫీ మ్యాచ్‌ను ఉపయోగించుకోవాలని జడేజా భావిస్తున్నాడు.సౌరాష్ట్ర జట్టు: హార్విక్ దేశాయ్ (వికెట్ కీపర్), తరంగ్ గోహెల్, రవీంద్ర జడేజా, యువరాజ్‌సిన్హ్ దోడియా, సమ్మర్ గజ్జర్, అర్పిత్ వాసవాడ, చిరాగ్ జానీ, ప్రేరక్ మన్కడ్, జయదేవ్ ఉనద్కత్ (కెప్టెన్), ధర్మేంద్రసింగ్ జడేజా, చేతన్ సకారియా, అన్ష్ గోసాయి, జే గోహిల్, పార్త్ భుట్, కెవిన్ జీవరాజని, హెత్విక్ కోటక్ మరియు అంకుర్ పన్వర్. -
చరిత్ర సృష్టించిన రింకూ సింగ్
టీమిండియా టీ20 స్పెషలిస్టు రింకూ సింగ్ (Rinku Singh) రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌ను అద్భుతంగా ఆరంభించాడు. ఈ దేశవాళీ రెడ్‌బాల్ టోర్నీలో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ మొదటి మ్యాచ్‌లోనే భారీ శతకంతో మెరిశాడు. తద్వారా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో తన సగటును 54.68 నుంచి 57.39కి పెంచుకున్నాడు.దిగ్గజాలను దాటేసి..తద్వారా యాభై ఇన్నింగ్స్ పూర్తి చేసుకున్న తర్వాత అత్యుత్తమ సగటు కలిగి ఉన్న ఆటగాడిగా రింకూ సింగ్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో దిగ్గజ బ్యాటర్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid), సబా కరీం, జడేజాతో పాటు టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)ను అధిగమించాడు. ఓవరాల్‌గా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అత్యుత్తమ సగటు కలిగి ఉన్న భారత ఆటగాళ్ల జాబితాలో పదో స్థానంలో నిలిచాడు.ఈ లిస్టులో విజయ్ మర్చంట్ 71.64 సగటుతో 13 వేల పరుగులు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. షంతను సుగ్వేకర్, కేసీ ఇబ్రహీం 60కి పైగా సగటుతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. కాగా రంజీ టోర్నీ తాజా సీజన్ బుధవారం మొదలైంది.ఆంధ్ర క్రికెటర్ల శతకాలుఇందులో భాగంగా ఎలైట్ గ్రూప్-‘ఎ’లో భాగంగా కాన్పూర్ వేదికగా ఉత్తరప్రదేశ్- ఆంధ్ర జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన ఆంధ్ర తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్, వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ (142), వన్‌డౌన్ బ్యాటర్ షేక్ రషీద్ (136) భారీ శతకాలతో సత్తా చాటారు.ఈ క్రమంలో ఆంధ్ర జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 143 ఓవర్లలో 470 పరుగులకు ఆలౌట్ అయింది. యూపీ బౌలర్లలో విప్రజ్ నిగమ్ నాలుగు వికెట్లు తీయగా.. ఆకిబ్ ఖాన్ రెండు, శివం మావి, శివం శర్మ, కెప్టెన్ కరణ్ శర్మ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.రింకూ సింగ్ భారీ శతకంఅనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన యూపీ శుభారంభమే అందుకుంది. ఓపెనర్లలో అభిషేక్ గోస్వామి (24) నిరాశపరచగా.. మాధవ్ కౌశిక్ (54), వన్‌డౌన్ బ్యాటర్ ఆర్యన్ జుయాల్ (66) అర్ధ శతకాలతో రాణించారు. అయితే, కెప్టెన్ కరణ్ శర్మ (2) విఫలం కాగా.. లోయర్ ఆర్డర్లో ప్రియమ్ గార్గ్ (18), ఆరాధ్య యాదవ్ (17) ఇలా వచ్చి అలా వెళ్లారు.ఇలాంటి దశలో ఐదో నంబర్ బ్యాటర్ రింకూ సింగ్ పట్టుదలగా క్రీజులో నిలబడ్డాడు. మొత్తంగా 273 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 165 పరుగులు సాధించి.. ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా విప్రజ్ నిగమ్ 42, శివం శర్మ 38, శివం మావి 20 (నాటౌట్) రాణించారు.యూపీదే పైచేయిఫలితంగా 169 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి ఉత్తరప్రదేశ్ జట్టు 471 పరుగులు సాధించింది. శనివారం ఆఖరి రోజు ఆట కావడంతో ఫలితం తేలకుండానే మ్యాచ్ ముగిసిపోయింది. అయితే, తొలి ఇన్నింగ్స్‌లో ఆంధ్ర కంటే ఒక్క పరుగు ఆధిక్యం సంపాదించిన యూపీ.. మూడు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. మరోవైపు.. ఆంధ్రకు ఒక పాయింట్ దక్కింది. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు ముందు రింకూ రెడ్‌బాల్ క్రికెట్లో ఈ మేరకు సెంచరీతో సత్తా చాటడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. రింకూకు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇది ఎనిమిదో సెంచరీ కావడం విశేషం.చదవండి: రోహిత్ శర్మతో విభేదాలు!.. స్పందించిన శుబ్‌మన్ గిల్ -
అందరికీ తెలుసు: అగార్కర్‌కు ఇచ్చిపడేసిన షమీ.. స్ట్రాంగ్ కౌంటర్
టీమిండియా సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ (Mohammed Shami)- చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు షమీని ఎంపిక చేయలేదు యాజమాన్యం. ఈ విషయం గురించి మాట్లాడుతూ.. అతడి ఫిట్నెస్ గురించి తమకు సమాచారం లేదని అగార్కర్ జట్టు ప్రకటన సందర్భంగా మీడియా ముఖంగా వెల్లడించాడు.ఇందుకు షమీ ఘాటుగానే స్పందించాడు. రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడేవాడిని.. వన్డేలు ఆడలేనా? అని ప్రశ్నించాడు. తాను పూర్తి ఫిట్‌గా ఉన్నానని స్పష్టం చేశాడు. సెలక్షన్ అనేది తన చేతుల్లో లేదని.. ఫిట్నెస్ గురించి ఎవరూ అడగకపోయినా చెప్పడం సరికాదంటూ.. సెలక్టర్లు జట్టు ఎంపిక సమయంలో తనను సంప్రదించలేదని సంకేతాలు ఇచ్చాడు.ఫిట్‌గా లేకపోవడం వల్లేఈ క్రమంలో షమీ వ్యాఖ్యలపై అగార్కర్ శుక్రవారం స్పందించాడు. ఎన్డీటీవీ వేదికగా మాట్లాడుతూ.. ‘‘షమీ నా ముందు ఉండి ఉంటే సమాధానం ఇచ్చేవాడిని. అతడు నిజంగా ఫిట్‌గా ఉంటే అలాంటి బౌలర్‌ను ఎవరైనా కాదనుకుంటారా. గత ఆరు నుంచి ఎనిమిది నెలల వ్యవధిలో నేను అతడితో చాలాసార్లు మాట్లాడాను.ఫిట్‌గా లేకపోవడం వల్లే ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ఎంపిక చేయలేకపోయాం’ అని ఈ భారత మాజీ పేసర్ స్పష్టం చేశాడు. తాము ఆడిన రోజుల్లో సెలక్టర్లకు ఏనాడూ ఫోన్ చేయలేదని, ఇప్పుడు కాలం మారిందన్న అగార్కర్... జట్టుకు ఎంపిక కాని యువ ఆటగాళ్లు తనకు వెంటనే ఫోన్ చేస్తారని, వారికి వంద శాతం నిజాయితీగా తాను సమాధానం ఇస్తానని చెప్పాడు.అంతా మీ కళ్ల ముందే ఉంది కదా!ఈ నేపథ్యంలో అగార్కర్‌కు షమీ మరోసారి గట్టిగానే కౌంటర్ ఇచ్చిపడేశాడు. హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ‘‘అతడు ఏం చెప్పాలనుకుంటున్నాడో చెప్పనివ్వండి. నేను ఎలా బౌలింగ్ చేస్తున్నారో మీరే చూస్తున్నారు. నేనెంత ఫిట్‌గా ఉన్నానో.. ఎలా ఆడుతున్నానో.. అంతా మీ కళ్ల ముందే ఉంది కదా!’’ అంటూ అగార్కర్‌కు దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చాడు.కాగా షమీ చివరగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా ప్రాతినిథ్యం వహించాడు. ఈ మెగా వన్డే టోర్నమెంట్లో తొమ్మిది వికెట్లు కూల్చిన ఈ కుడిచేతి వాటం పేసర్.. వరుణ్ చక్రవర్తితో కలిసి భారత్ తరఫున సంయుక్తంగా లీడ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. అయితే, ఐపీఎల్-2025లో మాత్రం ఈ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.ఈ సీజన్లో షమీ ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి.. 11.23 ఎకానమీతో కేవలం ఆరు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. కాగా ఫామ్‌లేమి, పనిభారం కారణంగా ఇంగ్లండ్‌తో టెస్టులకు షమీని ఎంపిక చేయలేదనే వార్తలు వచ్చాయి. తాజాగా ఆసీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ నుంచి కూడా అతడిని తప్పించడం గమనార్హం.దుమ్ములేపిన షమీఇదిలా ఉంటే.. షమీ ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌తో బిజీగా ఉన్నాడు. బెంగాల్ తరఫున బరిలోకి దిగిన ఈ యూపీ బౌలర్.. ఉత్తరాఖండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 14.5 ఓవర్లలో 37 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసిన షమీ.. రెండో ఇన్నింగ్స్‌లో 24.4 ఓవర్లలో కేవలం 38 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు కూల్చాడు.తద్వారా బెంగాల్ విజయంలో కీలక పాత్ర పోషించి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు షమీ. కాగా ఎలైట్ గ్రూప్-సి మ్యాచ్‌లో భాగంగా బెంగాల్ జట్టు ఉత్తరాఖండ్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది.చదవండి: సెలక్షన్ విషయంలో ద్రవిడ్‌తో విభేదాలు.. మా నిర్ణయమే ఫైనల్: అగార్కర్ -
రీఎంట్రీలో అదరగొట్టిన సంజూ శాంసన్.. ‘మెరుపు’ అర్ధ శతకం
టీమిండియా స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ (Sanju Samson) రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో శుభారంభం అందుకున్నాడు. మహారాష్ట్రతో మ్యాచ్‌లో ఈ కేరళ బ్యాటర్ ‘మెరుపు’ అర్ధ శతకం సాధించాడు. దేశీ ఫస్ట్‌క్లాస్ టోర్నీ రంజీ తాజా సీజన్ బుధవారం మొదలైన విషయం తెలిసిందే.రుతురాజ్ గైక్వాడ్ పోరాటంఈ క్రమంలో ఎలైట్ గ్రూప్-బిలో భాగంగా తిరువనంతపురం వేదికగా కేరళ- మహారాష్ట్ర (Kerala Vs Maharashtra) తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కేరళ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. మహారాష్ట్ర బ్యాటింగ్‌కు దిగింది. టాపార్డర్ విఫలమైన చోట రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad- 151 బంతుల్లో 91; 11 ఫోర్లు) విలువైన ఇన్నింగ్స్ ఆడటంతో... మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 84.1 ఓవర్లలో 239 పరుగులకు ఆలౌటైంది. కేరళ బౌలర్ల ధాటికి ఒక దశలో 18/5తో నిలిచిన మహారాష్ట్ర ఆ తర్వాత లోయర్ ఆర్డర్ పోరాటంతో తేరుకుంది. జలజ్ సక్సేనా (49; 4 ఫోర్లు), వికీ ఓస్త్వాల్ (38), రామకృష్ణ ఘోష్ (31) ఆకట్టుకున్నారు.కేరళ బౌలర్లలో నిదీశ్ 5 వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కేరళ జట్టు గురువారం నాటి రెండో రోజు ఆట ముగిసే సమయానికి 10.4 ఓవర్లలో 3 వికెట్లకు 35 పరుగులు చేసింది.ఘీ క్రమంలో 35/3 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం నాటి మూడో రోజు ఆట మొదలు పెట్టిన కేరళ ఇన్నింగ్స్‌ను సంజూ చక్కదిద్దాడు.సంజూ శాంసన్ ‘మెరుపు’ అర్ధ శతకంఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సంజూ 63 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 54 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ అజారుద్దీన్ 36 పరుగులతో ఆకట్టుకోగా.. సల్మాన్ నిజార్ 49 పరుగులతో రాణించాడు.అయితే, మిగిలిన వారి నుంచి పెద్దగా సహకారం అందకపోవడంతో 63.2 ఓవర్లలో కేరళ 219 పరుగులకు ఆలౌట్ అయింది. సంజూ పోరాడినప్పటికీ కేరళను ఆధిక్యంలోకి తీసుకురాలేకపోయాడు. ఇరవై పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మహారాష్ట్రకు శుభారంభమే దక్కింది. ఆధిక్యంలో మహారాష్ట్రతొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన ఓపెనర్లు పృథ్వీ షా 37, అర్షిన్ కులకర్ణి 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఫలితంగా మూడో రోజు ఆట ముగిసేసరికి తొమ్మిది ఓవర్లలో వికెట్ నష్టపోకుండా మహారాష్ట్ర 51 పరుగులు చేసింది. తద్వారా కేరళ కంటే 71 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.ఆసీస్‌తో టీ20 సిరీస్ ఆడేందుకు సంజూకాగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు టీమిండియా సెలక్టర్లు సంజూ శాంసన్‌ను ఎంపిక చేయలేదన్న విషయం తెలిసిందే. దీంతో అతడు సొంత జట్టు కేరళ తరఫున రీఎంట్రీ ఇస్తూ రంజీ బరిలో దిగాడు. అయితే, ఆసీస్‌తో టీ20 సిరీస్ కోసం సన్నద్ధమయ్యే క్రమంలో త్వరలోనే సంజూ జట్టును వీడనున్నాడు. ఇక అక్టోబరు 19- 29 వరకు ఆసీస్- భారత్ మధ్య వన్డే సిరీస్.. అక్టోబరు 29- నవంబరు 8 మధ్య టీ20 సిరీస్ జరుగునుంది. చదవండి: షమీ విమర్శలు.. స్పందించిన చీఫ్ సెలక్టర్ అగార్కర్ -
డబుల్ సెంచరీతో చెలరేగిన ఆర్సీబీ కెప్టెన్.. కెరీర్లో తొలి సారి
దేశవాళీ క్రికెట్లో మధ్యప్రదేశ్ కెప్టెన్, టీమిండియా ఆటగాడు రజత్ పాటిదార్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో భాగంగా ఇండోర్ వేదికగా పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాటిదార్ డబుల్ సెంచరీతో చెలరేగాడు.పాటిదార్ 330 బంతుల్లో 26 ఫోర్ల సాయంతో తొలి ఫస్ట్ క్లాస్ డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 107 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో తన ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఈ ఆర్సీబీ కెప్టెన్.. ఆచితూచి ఆడుతూ మూడంకెల ఫిగర్‌ను సాధించాడు.ఇప్పటివరకు అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 196గా ఉండేది. ఈ ఎంపీ కెప్టెన్ 203 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అతడి ద్విశతకం ఫలితంగా మధ్యప్రదేశ్ జట్టు 145 ఓవర్లు ముగిసే సరికి తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 489 పరుగులు చేసింది. ఎంపీ టీమ్ ప్రస్తుతం 257 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇస్తాడా?ఇటీవల కాంలో పటిదార్ దుమ్ములేపుతున్నాడు. గత 8 ఇన్నింగ్స్‌ల్లో అతడు సాధించిన స్కోర్లు ఇవే 100*(160), 10(25), 66(132), 13(27), 101(115), 77(84), 66(72) & 203*(332). పాటిదార్ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే భారత టెస్టు జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశముంది. పాటిదార్ గతేడాది ఇంగ్లండ్‌పై టెస్టు అరంగేట్రం చేశాడు. కానీ తనకు వచ్చిన అవకాశాన్ని అందుపుచ్చుకోలేకపోయాడు. భారత్ తరపున మూడు టెస్టుల్లో కేవలం 63 పరుగులు మాత్రమే చేశాడు.దీంతో అతడిని జట్టు నుంచి తప్పించారు. ఇప్పుడు మళ్లీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మెరుగ్గా రాణించి టీమిండియాలోకి తిరిగి రావాలని పట్టుదలతో పాటిదార్ ఉన్నాడు.చదవండి: IND vs AUS: ఈసారైనా కంగారులను కంగారు పెట్టిస్తారా? -
అస్సలు ఊహించలేదు.. సొంతగడ్డపై తిలక్ డకౌట్
రంజీ ట్రోఫీ 2025-26 ఎలైట్ గ్రూపులో భాగంగా నెక్స్‌జెన్ క్రికెట్ గ్రౌండ్(తూముకొండ) వేదికగా హైదరాబాద్, ఢిల్లీ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ కెప్టెన్ తిలక్ వర్మ(Tilak varma) తీవ్ర నిరాశపరిచాడు. కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్.. రెండు బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.ఢిల్లీ కెప్టెన్ అయూష్ బదోని బౌలింగ్‌లో వికెట్ల ముందు ఆసియాకప్ హీరో దొరికిపోయాడు. తిలక్ విఫలమైనప్పటికి హైదరాబాద్ బ్యాటర్లు ఢిల్లీకి ధీటైన జవాబు ఇస్తున్నారు. 50 ఓవర్లు ముగిసే హైదరాబాద్ మూడు వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. క్రీజులో తన్మయ్ అగర్వాల్(90), హిమతేజ(7) ఉన్నారు. అంతకముందు అంకిత్ రెడ్డి(87), రాహుల్ సింగ్(35) రాణించారు. హైదరాబాద్ ప్రస్తుతం ఢిల్లీ కంటే 306 పరుగులు వెనుకబడి ఉంది.సాంగ్వాన్, దొసెజా డబుల్ సెంచరీలు..ఇక మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ తమ తొలి ఇన్నింగ్స్‌ను 4 వికెట్ల నష్టానికి 529 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 256/3తో ఆట కొనసాగించిన జట్టు గురువారం మరో 68 ఓవర్లు ఆడి 273 పరుగులు జోడించింది. ఢిల్లీ బ్యాటర్లలో సనత్ సాంగ్వాన్ (470 బంతుల్లో 211 నాటౌట్; 21 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఆయుశ్ దొసెజా (279 బంతుల్లో 209; 25 ఫోర్లు, 5 సిక్స్‌లు) డబుల్ సెంచరీలతో సత్తాచాటారు.చదవండి: పాకిస్తాన్ టీమ్‌కు కొత్త కెప్టెన్!? -
‘వైభవ్ సూర్యవంశీ గురించి ఆ మాట అస్సలు నమ్మను’
భారత్‌తో పాటు ప్రపంచ క్రికెట్ వర్గాల్లో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) పేరు ఓ సంచలనం. పదమూడేళ్ల వయసులోనే ఐపీఎల్ వేలంలో ఏకంగా రూ. 1.10 కోట్లకు అమ్ముడు పోయిన ఈ బిహారీ పిల్లాడు.. పద్నాలుగేళ్ల వయసులోనే క్యాచ్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చాడు.ఐపీఎల్-2025 (IPL 2025)లో రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals)కు ప్రాతినిథ్యం వహించిన వైభవ్.. కేవలం 35 బంతుల్లోనే శతక్కొట్టి అతిపిన్న వయసులో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఆ తర్వాత భారత అండర్-19 క్రికెట్ జట్టు తరఫున ఇంగ్లండ్, ఆస్ట్రేలియా గడ్డపై ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ సత్తా చాటాడు.బిహార్ జట్టు వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ఇక వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌తో బిజీగా ఉన్నాడు. బిహార్ జట్టు వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ కొట్టేసిన వైభవ్.. ప్లేట్ గ్రూప్‌లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో విఫలమయ్యాడు.టీ20 తరహాలో చెలరేగి.. నిరాశపరిచిరంజీలోనూ టీ20 తరహా విధ్వంసకర బ్యాటింగ్‌కు దిగిన వైభవ్.. అరుణాచల్ ప్రదేశ్ బౌలర్ యాబ్ నియా బౌలింగ్‌లో ఒక సిక్స్, రెండు ఫోర్లు బాది.. ఆ వెంటనే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. తద్వారా ఐదు బంతుల్లో 14 పరుగులు చేసి నిష్క్రమించాడు.ఆశ్చర్యపోయాఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ గురించి ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హెడెన్ గతంలో చేసిన వ్యాఖ్యలు తాజాగా తెరమీదకు వచ్చాయి. టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘‘ఆరోజు నిజంగా నేను ఆశ్చర్యపోయా. జైపూర్‌లో కామెంట్రీ చేస్తున్నా.నాలుగో ఓవర్లో లైవ్‌లోకి వెళ్లా. అయితే, ఆ సమయంలో మాకు ఓ కామెంటేటర్ తక్కువగా ఉన్నారు. తొమ్మిది, పదో ఓవర్.. అప్పుడే వైభవ్ సెంచరీ చేశాడు. తనదైన శైలిలో శతక్కొట్టేశాడు. మొహమ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ వంటి మేటి బౌలర్లను చితక్కొడుతూ.. ఎక్స్ట్రా కవర్, మిడ్ వికెట్ మీదుగా షాట్లు బాదాడు.అతడి వయసు పద్నాలుగే అంటే నమ్మనుఆ సమయంలో హైడోస్ (మాథ్యూ హెడెన్) అక్కడే ఉన్నాడు. అప్పుడు తను.. ‘ఓహ్.. అతడి వయసు పద్నాలుగే అంటే నేను అస్సలు నమ్మను’ అంటూ ఎగ్జైట్ అయ్యాడు. ఇందుకు నేను బదులిస్తూ.. ‘కమాన్.. కామ్‌డౌన్’ అన్నాను’’ అంటూ విల్లో టాక్ షోలో రవిశాస్త్రి పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాడు. కాగా ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ సందర్భంగా వైభవ్ ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన విషయం తెలిసిందే.చదవండి: అతడు టీమిండియాకు ఆడనే లేదా?.. నేను సెలక్టర్‌నే.. నువ్వు చైర్మన్‌వి కదా! -
సూపర్ సెంచరీతో కదంతొక్కిన ఆర్సీబీ కెప్టెన్
ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ (Rajat Patidar) రంజీ ట్రోఫీ (Ranji Trophy 2025-26) తొలి మ్యాచ్‌లోనే చెలరేగిపోయాడు. ఈ టోర్నీలో మధ్యప్రదేశ్ కెప్టెన్‌గానూ వ్యవహరిస్తున్న పాటిదార్.. పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సూపర్ సెంచరీతో కదంతొక్కాడు. పాటిదార్‌కు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇది 16వ సెంచరీ. దేశవాలీ క్రికెట్లో పాటిదార్ గత కొంతకాలంగా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. గత 8 ఇన్నింగ్స్‌ల్లో అతను 3 సెంచరీలు, 3 అర్ద సెంచరీలు చేశాడు. ఆ స్కోర్లు ఇలా ఉన్నాయి. 100*(160), 10(25), 66(132), 13(27), 101(115), 77(84), 66(72) & 125(96)పంజాబ్‌తో మ్యాచ్‌లో పాటిదార్ వెంకటేశ్ అయ్యర్‌తో (73) కలిసి ఐదో వికెట్‌కు 147 పరుగులు జోడించాడు. 92 ఓవర్ల తర్వాత (రెండో రోజు) మధ్యప్రదేశ్ స్కోర్ 6 వికెట్ల నష్టానికి 304 పరుగులుగా ఉంది. పంజాబ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌తో పోలిస్తే 72 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుందిపాటిదార్తో పాటు సరాన్ష్ జైన్ (2) క్రీజ్‌లో ఉన్నాడు. మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్‌లో హిమాన్షు మంత్రి (40), శుభమ్ శర్మకు (41) మంచి ఆరంభాలు లభించినా భారీ స్కోర్లుగా మలచలేకపోయారు.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 232 పరుగులకు ఆలౌటైంది. సరాన్ష్ జైన్ 6 వికెట్లు తీసి పంజాబ్‌ను దెబ్బకొట్టాడు. కుమార్ కార్తికేయ, ఆర్యన్ పాండే, అర్షద్ ఖాన్ తలో వికెట్ తీశారు. పంజాబ్ ఇన్నింగ్స్‌లో ఉదయ్ సహరన్ (75) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. విధ్వంసకర ఆటగాడు ప్రభ్‌సిమ్రన్ సింగ్ 4 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. చదవండి: విధ్వంసకర వీరుడికే ప్రతిష్టాత్మక అవార్డు.. సహచరుడు పోటీ పడినా..! -
అతడు టీమిండియాకు ఆడనే లేదా?.. నేను సెలక్టర్‌నే.. నువ్వు చైర్మన్‌వి కదా!
జలజ్ సక్సేనా (Jalaj Saxena).. దేశవాళీ క్రికెట్లో అతడొక దిగ్గజం. రంజీ ట్రోఫీ (Ranji Trophy) చరిత్రలో ఇప్పటి వరకు ఏడు వేలకు పరుగులు సాధించాడు ఈ కుడిచేతి వాటం బ్యాటర్. అంతేకాదు.. ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఖాతాలో 484 పైగా వికెట్లు కూడా ఉన్నాయి.టీమిండియాకు ఆడే అవకాశమే రాలేదుటీమిండియాకు తొలి ప్రపంచకప్ అందించిన దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ (Kapil Dev), మదన్ లాల్, రవీంద్ర జడేజా తర్వాత ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఈ మేరకు భారీగా పరుగులు రాబట్టడంతో పాటు.. వికెట్లు తీసిన ఘనత జలజ్ సక్సేనాదే. అయితే, 38 ఏళ్ల ఈ మధ్యప్రదేశ్ వెటరన్ ప్లేయర్‌కు టీమిండియా తరఫున అరంగేట్రం చేసే అవకాశం మాత్రం ఇంత వరకు రాలేదు.కేరళ టు మహారాష్ట్రఇదిలా ఉంటే.. దేశీ క్రికెట్లో సుదీర్ఘ కాలం పాటు కేరళకు ప్రాతినిథ్యం వహించిన జలజ్ సక్సేనా.. తాజా రంజీ సీజన్లో మహారాష్ట్రకు మారాడు. ఈ క్రమంలో రంజీ ట్రోఫీ 2025-26 ఎలైట్ గ్రూప్-బిలో భాగంగా మహారాష్ట్ర బుధవారం కేరళతో మ్యాచ్ మొదలుపెట్టింది.తిరునంతపురం వేదికగా టాస్ ఓడిన మహారాష్ట్ర.. కేరళ జట్టు ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే, కేరళ బౌలర్ల ధాటికి మహారాష్ట్ర టాపార్డర్ కుప్పకూలింది. ఓపెనర్లు పృథ్వీ షా, అర్షిన్ కులకర్ణితో పాటు వన్‌డౌన్ బ్యాటర్ సిద్ధేశ్ వీర్ డకౌట్ అయ్యారు.హాఫ్ సెంచరీ మిస్.. అయినా భేష్కెప్టెన్ అంకిత్ బవానే కూడా పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. ఈ క్రమంలో మాజీ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (91) నెమ్మదిగా క్రీజులో నిలదొక్కుకోగా.. ఏడో స్థానంలో వచ్చిన జలజ్ సక్సేనా కూడా ఆకట్టుకున్నాడు. మొత్తంగా 106 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్ల సాయంతో 49 పరుగులు చేశాడు.ఒక్కసారి కూడా ఆడలేదంటే ఆశ్చర్యమేఈ క్రమంలో కామెంట్రీ బాక్స్‌లో ఉన్న టీమిండియా మాజీ సెలక్టర్లు సలీల్ అంకోలా, చేతన్ శర్మ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జలజ్ సక్సేనాను ఉద్దేశించి..‘‘సక్సేనా టీమిండియాకు ఒక్కసారి కూడా ఆడలేదంటే ఆశ్చర్యంగా ఉంది’’ అని సలీల్ అన్నాడు.నువ్వు చైర్మన్‌వి కూడానూఇందుకు బదులిస్తూ.. ‘‘సలీల్.. నువ్వు.. ఆశ్చర్యకరం అనే మాటను ఉపయోగించావు. అయితే, నీకో విషయం చెప్పాలి. మన ఇద్దరం మాజీ సెలక్టర్లమే’’ అని చేతన్ శర్మ నవ్వులు చిందించాడు. ఇందుకు స్పందిస్తూ.. ‘‘నువ్వు చైర్మన్‌వి కూడానూ’’ అంటూ చేతన్‌కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు సలీల్.దీంతో.. ‘‘నిజమే.. వేళ్లన్నీ మన వైపే చూపించేవి’’ అని చేతన్ శర్మ కవర్ చేశాడు. ఏదేమైనా ప్రతిభ ఉన్న జలజ్ సక్సేనాకు అంతర్జాతీయ క్రికెట్లో కనీసం అరంగేట్రం చేసే అవకాశం రాకపోవడం పట్ల నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. నవ్వుతూనే అయినా తప్పును ఒప్పుకొన్నారంటూ మాజీ సెలక్టర్లకు చురకలు అంటిస్తున్నారు.239 పరుగులకు ఆలౌట్ఇదిలా ఉంటే.. కేరళతో మ్యాచ్‌లో మహారాష్ట్ర తమ తొలి ఇన్నింగ్స్‌లో 239 పరుగులకు ఆలౌట్ అయింది. రుతు, జలజ్‌తో పాటు విక్కీ ఓస్త్వాల్ (38), రామకృష్ణ ఘోష్ (31) రాణించడంతో ఈ మేర నామమాత్రపు స్కోరు సాధ్యమైంది. కేరళ బౌలర్లలో నిధీశ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. నెడుమంకులి బాసిల్ మూడు, ఈడెన్ ఆపిల్, అంకిత్ శర్మ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.చదవండి: టీమిండియా సెలక్టర్లకు ఇషాన్ స్ట్రాంగ్ కౌంటర్.. అంతలోనే...When they showed Jalaj Saxena's domestic stats one commentator said he has such great stats but it's surprising that he hasn't played for India and the other commentator replied"Surprisingly" both of us were the selectors and you were the chairman. pic.twitter.com/QvtzZEbWkG https://t.co/q8kHY6rkkv— Aditya Soni (@imAdsoni) October 15, 2025 -
టీమిండియా సెలక్టర్లకు ఇషాన్ స్ట్రాంగ్ కౌంటర్.. అంతలోనే...
రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌ను జార్ఖండ్ జట్టు కెప్టెన్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) ఘనంగా ఆరంభించాడు. ఎలైట్ గ్రూప్-‘ఎ’లో భాగంగా తమిళనాడు (Tamil Nadu vs Jharkhand)తో మ్యాచ్‌లో భారీ శతకంతో చెలరేగాడు. ఒకానొక సమయంలో డబుల్ సెంచరీ దిశగా పయనించిన ఇషాన్.. ద్విశతకానికి ఇరవై ఏడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.సెలక్టర్లకు గట్టి వార్నింగ్ఏదేమైనా ఈ జార్ఖండ్ డైనమైట్ ప్రదర్శన పట్ల అభిమానులు ఖుషీ అవుతున్నారు. అద్భుత సెంచరీతో టీమిండియా సెలక్టర్లకు గట్టి వార్నింగ్ ఇచ్చాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్‌ను చాన్నాళ్లుగా టీమిండియా నుంచి పక్కన పెట్టడం గురించి మాట్లాడుతూ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చేసిన వ్యాఖ్యలను తెరమీదకు తెస్తున్నారు.మెరుగైన ప్రదర్శనతో‘‘ఇషాన్ కిషన్ మంచి ఆటగాడు. అయితే, అతడు దేశీ క్రికెట్లో తరచుగా ఆడుతూ.. నిలకడైన ప్రదర్శనలు ఇస్తేనే పరిగణనలోకి తీసుకునేందుకు సెలక్టర్లు సిద్ధంగా ఉన్నారు’’ అని అగార్కర్ గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. గత సీజన్లో దేశవాళీ మ్యాచ్‌లు ఆడకుండా బీసీసీఐ ఆగ్రహానికి గురైన ఈ యువ ఆటగాడు... ఈసారి మెరుగైన ప్రదర్శనతో సీజన్‌ను ఆరంభించడం విశేషం.తొలిరోజే శతకంఇక మ్యాచ్ విషయానికొస్తే... కోయంబత్తూర్ వేదికగా తమిళనాడుతో బుధవారం మొదలైన పోరులో టాస్ గెలిచిన జార్ఖండ్.. తొలుత బ్యాటింగ్‌కు దిగింది. తొలిరోజు టీమిండియా ప్లేయర్, జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ (183 బంతుల్లో 125 బ్యాటింగ్; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీతో కదంతొక్కాడు. ఈ క్రమంలో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది.ఇషాన్ అజేయ శతకంతో ఆకట్టుకోగా... సాహిల్ రాజ్ (105 బంతుల్లో 64 బ్యాటింగ్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్ధశతకంతో కెప్టెన్‌కు అండగా నిలిచాడు. శరణ్‌దీప్ సింగ్ (102 బంతుల్లో 48; 6 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. మిగిలినవాళ్లు విఫలమవడంతో ఒక దశలో జార్ఖండ్ జట్టు 157 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఈ దశలో సాహిల్‌తో కలిసి ఇషాన్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. తమిళనాడు బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఈ జోడీ... క్రీజులో కుదురుకున్న తర్వాత చక్కటి షాట్లతో ఆకట్టుకుంది. ఈ జంట అబేధ్యమైన ఏడో వికెట్‌కు 150 పరుగులు జోడించడంతో జార్ఖండ్ కోలుకుంది. తమిళనాడు బౌలర్లలో గుర్జప్నీత్ సింగ్ 3 వికెట్లు పడగొట్టగా... చంద్రశేఖర్ 2 వికెట్లు తీశాడు.డబుల్ సెంచరీ మిస్ఇక రెండో రోజు ఆటలో భాగంగా ఇషాన్ తన ఓవర్‌నైట్ స్కోరు 125కు మరో 48 పరుగులు జోడించి అవుటయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో మొత్తంగా ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 247 బంతులు ఎదుర్కొని 15 ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 173 పరుగులు చేశాడు. ఆర్ఎస్ అంబరీశ్ బౌలింగ్‌లో షారుఖ్ ఖాన్‌కు క్యాచ్ ఇవ్వడంతో ఇషాన్ డబుల్ సెంచరీ పూర్తి చేసుకోకుండానే వెనుదిరగాల్సి వచ్చింది.మరోవైపు సాహిల్ రాజ్ 77 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గురప్జీత్ సింగ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఇక అనుకూల్ రాయ్‌ను (12)ను సందీప్ వారియర్ వెనక్కి పంపించాడు. ఈ నేపథ్యంలో 122 ఓవర్లు ముగిసే సరికి ఎనిమిది వికెట్ల నష్టానికి జార్ఖండ్ 379 పరుగులు చేసింది. జతిన్ పాండే 4, రిషావ్ రాజ్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. చదవండి: 20 నెలలుగా టీమిండియా వద్దంది.. కట్ చేస్తే! విధ్వంసకర సెంచరీ -
వైభవ్ సూర్యవంశీ అట్టర్ ప్లాప్.. టీ20 మ్యాచ్ అనుకున్నావా?
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ బిహార్ వైస్ కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే విఫలమయ్యాడు. రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ ప్లేట్ గ్రూపులో భాగంగా పాట్నా వేదికగా అరుణాచల్ ప్రదేశ్-బిహార్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అరుణాచాల్ కెప్టెన్ తొలుత బిహార్‌ను బ్యాటింగ్ అహ్హనించాడు.అయితే బ్యాటింగ్‌కు దిగిన బిహార్ ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఇటీవల కాలంలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సూర్యవంశీ.. ఈ మ్యాచ్‌లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోయాడు. టీ20 తరహాలో తన బ్యాటింగ్‌ను ప్రారంభించిన వైభవ్ కేవలం 5 బంతుల్లో 280.00 స్ట్రైక్ రేటుతో 14 పరుగులు చేసి ఔటయ్యాడు. బిహార్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేసిన యాబ్ నియా బౌలింగ్‌లో తొలి నాలుగు బంతుల్లో ఒక సిక్స్, రెండు ఫోర్లు బాదిన వైభవ్.. ఐదో బంతికి క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా అతడిపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు."వైభవ్ ఫార్మాట్ తగ్గట్టు ఆడడం నేర్చుకోవాలి. అరుణాచల్ ప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 14 పరుగులు మాత్రమే చేశాడు. ప్రతీ బంతికి షాట్ ఆడే అవసరం లేదు. ఇది రెడ్ బాల్ క్రికెట్. సహనం, టెక్నిక్ కూడా కావాలి" ఓ యూజర్ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. కాగా 12 ఏళ్ల వయసులోనే ఫస్ట్-క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ.. తన టాలెంట్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత ఐపీఎల్-2025, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా టూర్లలో దుమ్ములేపాడు. ఈ క్రమంలోనే అతడికి బిహార్ క్రికెట్ అసోయేషిన్ వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ ఇచ్చింది.అతడి బిహార్ జట్టును అత్యున్నత స్ధాయికి తీసుకు వెళ్తాడని బీసీఎ భావించింది. కానీ వైభవ్ మాత్రం తొలి మ్యాచ్‌లోనే విఫలమై నిరాశపరిచాడు. తర్వాతి మ్యాచ్‌లలోనైనా సూర్యవంశీ తన బ్యాట్‌కు పని చెబుతాడో లేదో చూడాలి.భారీ స్కోర్ దిశగా బిహార్..సూర్యవంశీ నిరాశపరిచినప్పటికి తొలి ఇన్నింగ్స్‌లో బిహార్ భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి బిహార్ రెండు వికెట్ల నష్టానికి 283 పరుగుల భారీ స్కోర్ సాధించింది. క్రీజులో ఆయుష్ లోహరుక(155), సకిబుల్ గని(56) ఉన్నారు.చదవండి: 20 నెలలుగా టీమిండియా వద్దంది.. కట్ చేస్తే! విధ్వంసకర సెంచరీ -
20 నెలలుగా టీమిండియా వద్దంది.. కట్ చేస్తే! విధ్వంసకర సెంచరీ
రంజీ ట్రోఫీ సీజన్‌ను ఆంధ్ర జట్టు మెరుగైన రీతిలో మొదలు పెట్టింది. కాన్పూర్ వేదికగా గ్రూప్ ‘ఎ’లో భాగంగా ఉత్తరప్రదేశ్‌తో మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆంధ్ర బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో జట్టు 85.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది.వికెట్ కీపర్ కేెఎస్ భరత్ (244 బంతుల్లో 142; 13 ఫోర్లు) భారీ శతకంతో చెలరేగాడు. అద్భుతమైన బ్యాటింగ్‌తో ప్రత్యర్ధి బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. భరత్ మరో యువ ఆటగాడు షేక్ రషీద్‌తో కలిసి మూడో వికెట్‌కు 194 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రషీద్ కూడా సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సరికి రషీద్ 197 బంతుల్లో 8 ఫోర్లు సాయంతో 94 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఓపెనర్ అభిషేర్ రెడ్డి(36) పర్వాలేదన్పించగా.. కెప్టెన్ రికీ భుయ్(2) మాత్రం విఫలమయ్యాడు. యూపీ బౌలర్లలో ఆఖిబ్ ఖాన్‌కు 2 వికెట్లు దక్కగా, విప్రాజ్ నిగమ్ మరో వికెట్ తీశాడు. గోల్డెన్ ఛాన్స్ మిస్..కేఎస్ భరత్ టీమిండియా తరపున 2023లో ఆస్ట్రేలియాపై టెస్టు అరంగేట్రం చేశాడు. కానీ తనకు వచ్చిన అవకాశాన్ని ఈ విశాఖ కుర్రాడు సద్వినియోగపరుచుకోలేకపోయాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ గాయ పడడంతో గతేడాది స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కూడా భరత్‌కు ఆడే అవకాశం లభించింది.కానీ ఈ వికెట్ కీపర్ బ్యాటర్ తన మార్క్ చూపించలేకపోయాడు. దీంతో సెలక్టర్లు అతడిని పక్కన పెట్టారు. పంత్‌కు ప్రత్నమ్నాయంగా మరో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్‌ను సెలక్టర్లు జట్టులోకి తీసుకున్నారు. జురెల్ తన అద్భుతమైన ప్రదర్శనలతో పంత్‌కే పోటీ ఇస్తున్నాడు. కాబట్టి ఇప్పటిలో భరత్ తిరిగి భారత జట్టులోకి వచ్చే అవకాశముంది. భరత్ చివరగా టీమిండియా తరపున గతేడాది ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌పై ఆడాడు. మొత్తంగా తన కెరీర్లో ఇప్పటివరకు 7 టెస్టులు ఆడిన భరత్.. 417 పరుగులు మాత్రమే చేశాడు.చదవండి: టి20 ప్రపంచకప్ టోర్నీకి నేపాల్, ఒమన్ అర్హత -
చెలరేగిన షమీ.. భారత సెలెక్టర్లకు దిమ్మతిరిగే కౌంటర్
ఆస్ట్రేలియా పర్యటనకు తనను ఎంపిక చేయని భారత సెలెక్టర్లకు వెటరన్ పేసర్, బెంగాల్ ఆటగాడు మహ్మద్ షమీ (Mohammed Shami) దిమ్మతిరిగే కౌంటరిచ్చాడు. ఇవాళ (అక్టోబర్ 15) ప్రారంభమైన రంజీ ట్రోఫీలో (Ranji Trophy 2025-26) ఉత్తరాఖండ్‌పై 4 బంతుల్లో 3 వికెట్లు తీసి టీమిండియాకు అడేందుకు 100 శాతం అర్హుడినన్న సందేశం పంపాడు.షమీ తీసిన 3 వికెట్లలో రెండు క్లీన్ బౌల్డ్‌లు కాగా.. మరొకటి క్యాచ్ ఔట్. షమీతో పాటు ఇషాన్ పోరెల్ (15-3-40-3), సూరజ్ సింధు జైస్వాల్ (19-4-54-4) చెలరేగడంతో ఉత్తరాఖండ్ 72.5 ఓవర్లలో 213 పరుగులకే చాపచుట్టేసింది. ఉత్తరాఖండ్ ఇన్నింగ్స్‌లో భుపేన్ లాల్వాని (71) ఒక్కడే రాణించాడు. మిగతా ఆటగాళ్లలో కనీసం ఒక్కరూ 30 పరుగుల మార్కును తాకలేకపోయారు.ఇదిలా ఉంటే, గత కొంతకాలంగా షమీని భారత సెలెక్టర్లు ఉద్దేశపూర్వకంగా పక్కకు పెడుతున్నారన్న ప్రచారం జరుగుతుంది. 2023 వన్డే ప్రపంచకప్‌లో ఊహలకందని రీతిలో రాణించిన షమీ.. గాయం కారణంగా ఏడాదికాలం పాటు ఆటకు దూరంగా ఉన్నాడు. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఈ ఏడాది స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. ఆతర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఆడిన షమీ.. ఏడు నెలలుగా జట్టుకు దూరంగా ఉన్నాడు. పూర్తి ఫిట్నెస్ సాధించి, దేశవాలీ క్రికెట్లో రాణిస్తున్నా సెలెక్టర్లు షమీని పట్టించుకోవడం లేదు. అతను చివరిగా 2023 జూన్‌లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు.ఇటీవలి ఇంగ్లండ్ పర్యటనకు అతన్ని ఎంపిక చేస్తారని అంతా అనుకున్నారు. అయితే అలా జరగలేదు. తాజాగా ఆస్ట్రేలియా పర్యటనకైనా ఎంపిక చేస్తారని షమీ పూర్తి విశ్వాసంతో ఉన్నాడు. సెలెక్టర్లు ఈసారి కూడా పట్టించుకోలేదు. తాజాగా అతను ఆసీస్ పర్యటనకు ఎంపిక కాకపోవడంపై స్పందించాడు.ఫిట్నెస్ సాకుగా చూపిస్తూ నన్ను పక్కకు పెట్టారు. ఫిట్నెస్ లేకపోతే రంజీ ట్రోఫీలో ఎలా ఆడతానన్న అర్దం వచ్చేలా వ్యాఖ్యానించాడు. సెలెక్లరు, కోచ్, కెప్టెన్ అనుకుంటేనే తాను జట్టులో ఉంటానని అన్నాడు. ఈ వాఖ్యలు చేసిన తర్వాత షమీ బంతితోనే సెలెక్టర్లను సమాధానం చెప్పాలని అనుకున్నాడు. అలాగే చేశాడు. మున్ముందైనా సెలెక్టర్లు షమీని పరిగణలోకి తీసుకుంటారో లేదో చూడాలి.చదవండి: శతక్కొట్టిన ఇషాన్ కిషన్ -
శతక్కొట్టిన ఇషాన్ కిషన్
రంజీ ట్రోఫీలో (Ranji Trophy 2025-26) భాగంగా తమిళనాడుతో ఇవాళ (అక్టోబర్ 15) మొదలైన మ్యాచ్‌లో జార్ఖండ్ ఆటగాడు, ఆ జట్టు కెప్టెన్ కూడా అయిన ఇషాన్ కిషన్ (Ishan Kishan) సెంచరీతో కదంతొక్కాడు. ఈ మ్యాచ్‌లో జార్ఖండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. ఐదో స్థానంలో బరిలోకి దిగిన ఇషాన్ 137 బంతుల్లో 12 బౌండరీలు, 2 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు.75 ఓవర్ల తర్వాత జార్ఖండ్ స్కోర్ 6 వికెట్ల నష్టానికి 251 పరుగులుగా ఉంది. ఇషాన్‌కు జతగా సాహిల్ రాజ్ (33) క్రీజ్‌లో ఉన్నాడు. జార్ఖండ్ ఇన్నింగ్స్‌లో శిఖర్ మోహన్ 10, శరన్‌దీప్ సింగ్ 48, కుమార్ సూరజ్ 3, విరాట్ సింగ్ 28, కుమార్ కుషాగ్రా 11, అనుకూల్ రాయ్ 12 పరుగులు చేసి ఔటయ్యారు. తమిళనాడు బౌలర్లలో గుర్జప్నీత్ సింగ్ 3, డీటీ చంద్రశేఖర్ 2, సందీప్ వారియర్ ఓ వికెట్ పడగొట్టాడు.కాగా, ప్రస్తుత రంజీ ఎడిషన్ ఇవాల్టి నుంచే ప్రారంభమైంది. ఈ రోజు దేశవ్యాప్తంగా 16 మ్యాచ్‌లు జరుగతున్నాయి. ఈ ఎడిషన్‌లో ఇషాన్ కిషన్‌దే మొదటి శతకం. వేర్వేరు మ్యాచ్‌ల్లో టీమిండియా ఆటగాళ్లు దేవ్‌దత్ పడిక్కల్ (Devdutt Padikkal), రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) సెంచరీలకు చేరువై ఔటాయ్యరు. సౌరాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్‌లో పడిక్కల్ (కర్ణాటక) 96 పరుగుల వద్ద ఔటాయ్యడు. కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో రుతురాజ్ (మహారాష్ట్ర) 9 పరుగుల తేడాతో అత్యంత అర్హమైన సెంచరీని మిస్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో రుతురాజ్ తన జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు (18/5) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. సెంచరీతో కదంతొక్కిన టీమిండియా మాజీ వికెట్కీపర్ఉత్తర్ప్రదేశ్తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా మాజీ వికెట్‌కీపర్ శ్రీకర్ భరత్ (Srikar bharat) (ఆంధ్రప్రదేశ్) సెంచరీతో కదంతొక్కాడు. 213 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 117 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా షేక్ రషీద్ (69) క్రీజ్‌లో ఉన్నాడు. 73 ఓవర్ల తర్వాత ఆంధ్ర స్కోర్ 235/1గా ఉంది.చదవండి: దుమ్మురేపిన రషీద్ ఖాన్ -
పృథ్వీ షా డకౌట్.. టాపార్డర్ సున్నా.. కెప్టెన్‌దీ అదే దారి
రంజీ ట్రోఫీ తాజా సీజన్ తొలి మ్యాచ్‌లోనే మహారాష్ట్ర ఆటగాడు పృథ్వీ షా (Prithvi Shaw)కు చేదు అనుభవం ఎదురైంది. కేరళతో బుధవారం మొదలైన మ్యాచ్‌లో ఈ కుడిచేతి వాటం బ్యాటర్ డకౌట్ అయ్యాడు. నాలుగు బంతులు ఎదుర్కొన్న పృథ్వీ.. పరుగుల ఖాతా తెరవకుండానే నిధీశ్ (Nidheesh) బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరిగాడు.మహారాష్ట్ర Vs కేరళ ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీ (Ranji Trophy) 91వ ఎడిషన్‌కు బుధవారం తెరలేచింది. ఇందులో భాగంగా ఎలైట్ గ్రూప్-బిలోని మహారాష్ట్ర- కేరళ మధ్య తిరువనంతపురం వేదికగా మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు కేరళ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.పృథ్వీ షా డకౌట్.. టాపార్డర్ సున్నా.. కెప్టెన్‌దీ అదే దారిఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన మహారాష్ట్రకు ఊహించని రీతిలో వరుస షాకులు తగిలాయి. ఓపెనర్లు పృథ్వీ షా, అర్షిన్ కులకర్ణితో పాటు వన్‌డౌన్ బ్యాటర్ సిద్ధేశ్ వీర్ డకౌట్ అయ్యాడు. అర్షిన్ బాసిల్ బౌలింగ్‌లో కణ్ణుమ్మల్కు క్యాచ్ ఇచ్చి అర్షిన్ గోల్డెన్ డకౌట్ కాగా.. సిద్ధేశ్.. నిధీశ్ బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే అజారుద్దీన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.ఖాతా తెరిచిన రుతువీరితో పాటు కెప్టెన్ అంకిత్ బావ్నే కూడా పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. అయితే, ఏడు బంతుల పాటు క్రీజులో నిలిచిన అతడు బాసిల్ బౌలింగ్ బౌల్డ్ అయ్యాడు. ఈ క్రమంలో నాలుగో నంబర్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ 25 బంతులు ఎదుర్కొన్న తర్వాత కానీ పరుగుల ఖాతా తెరవలేకపోయాడు. పది ఓవర్ల ఆట ముగిసే సరికి రుతు 28 బంతుల్లో ఒక పరుగు చేయగా.. సౌరభ్ నవాలే 20 బంతుల్లో 10 పరుగులతో క్రీజులో ఉన్నాడు.మొత్తానికి తొలిరోజు పది ఓవర్ల ఆటలో కేరళ బౌలర్ల ధాటికి మహారాష్ట్ర నాలుగు వికెట్ల నష్టానికి కేవలం 16 పరుగులే చేసి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. వరుస సెంచరీల తర్వాతకాగా కెరీర్ ఆరంభం నుంచి ముంబైకి ఆడిన పృథ్వీ షా.. ఈ ఏడాది మహారాష్ట్రకు మారాడు. ఇటీవల బుచ్చిబాబు ఇన్విటేషనల్ రెడ్‌బాల్ టోర్నీలో, ముంబైతో వార్మప్ మ్యాచ్‌లో సెంచరీలతో అలరించిన పృథ్వీ.. అసలైన పోరులో మాత్రం ఆదిలోనే తుస్సుమనిపించాడు.రంజీ ట్రోఫీ-2025: మహారాష్ట్ర వర్సెస్ కేరళ తుదిజట్లుమహారాష్ట్రఅంకిత్ బావ్నే (కెప్టెన్), పృథ్వీ షా, రుతురాజ్ గైక్వాడ్, సౌరభ్ నవాలే (వికెట్ కీపర్), జలజ్ సక్సేనా, రజనీశ్ గుర్బానీ, విక్కీ ఓస్త్వాల్, సిద్ధేష్ వీర్, ముఖేష్ చౌదరి, అర్షిన్ కులకర్ణి, రామకృష్ణ ఘోష్.కేరళమహ్మద్ అజారుద్దీన్ (కెప్టెన్, వికెట్ కీపర్), బాబా అపరాజిత్, సంజూ శాంసన్, సచిన్ బేబీ, ఎండీ నిధీశ్, అక్షయ్ చంద్రన్, రోహన్ కుణ్ణుమ్మల్, అంకిత్ శర్మ, ఈడెన్ యాపిల్ టామ్, నెడుమాన్కులి బాసిల్, సల్మాన్ నిజార్.చదవండి: BCCI: రోహిత్, కోహ్లిలకు ఇదే ఆఖరి సిరీస్!.. స్పందించిన బీసీసీఐ


