Ranjita
-
పీరియడ్స్‌లో వేతన సెలవులివ్వాల్సిందే
సంబాల్పూర్: ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే మహిళలకు పీరియడ్స్ సమయంలో వేతనంతో కూడిన సెలువులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఒడిశాలోని సంబాల్పూర్ పట్టణ యువతులు ఆన్లైన్ ఉద్యమం ప్రారంభించారు. ఈ విషయంలో తగిన మార్గదర్శకాలుజారీ చేయాలని ఉద్యమకారిణి రంజితా ప్రియదర్శిని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌కు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఒడిశా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుశాంత్ సింగ్‌కు వినతి పత్రం సమర్పించారు. పీరియడ్స్ సమయంలో మహిళలు మానసికంగా, శారీరకంగా ఎంతో ఒత్తిడి ఎదుర్కొంటారని, వారికి తగిన విశ్రాంతి అవసరమని అన్నారు. అందుకే వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలని కోరారు. కనీసం ఒక్క రోజైనా సెలవు ఇవ్వాలని చెప్పారు. ఎందుకంటే 99 శాతం మంది మహిళలు గరిష్టంగా 24 గంటలపాటు నొప్పితో బాధపడుతూ ఉంటారని గుర్తుచేశారు. భారత్‌లో ప్రస్తుతం 12 కంపెనీలు మహిళలకు రుతుస్రావం సమయంలో పెయిడ్ లీవులు మంజూరు చేస్తున్నాయి. తమ ఉద్యమానికి మహిళల నుంచి అనూహ్యమైన మద్దతు లభిస్తోందని, ఇది సిగ్గు పడాల్సిన విషయం కాదని రంజితా ప్రియదర్శిని స్పష్టం చేశారు. -
అర్ధరాత్రి మహిళా ఎంపీ కారుపై రాళ్లు, రాడ్లతో దాడి
జైపూర్: కరోనాతో బాధపడుతున్న వారిని పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్తున్న బీజేపీ లోక్‌సభ సభ్యురాలికి ఘోర పరాభవం ఎదురైంది. ఒక్కసారిగా కారును నిలువరించి రాళ్లు, ఇనుప రాడ్లతో దాడులకు పాల్పడ్డారు. దీంతో ఆమె వాహనం అద్దాలు పగిలిపోగా వాహనం తీవ్రంగా దెబ్బతింది. ఈ ఘటన నుంచి ఆమె సురక్షితంగా బయటపడ్డారు. రాజస్థాన్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌లోని భరత్పూర్ లోక్‌సభ స్థానం నుంచి రంజిత కోలి గెలిచారు. ఆమె తన నియోజకవర్గంలోని ఆస్పత్రుల సందర్శనకు మంగళవారం బయల్దేరారు. తిరుగు ప్రయాణంలో రాత్రి 11.30 గంటల సమయంలో ధర్సోని గ్రామం మీదుగా భరత్పూర్ వెళ్తున్నారు. గ్రామం మీదుగా ఒక్కసారిగా ఐదారుగురు వ్యక్తులు రాళ్లు.. ఇనుప రాడ్లతో దాడికి తెగబడ్డారు. వీరి దాడితో ఎంపీ రంజిత, ఆమె అనుచరులు భయాందోళన చెందారు. వారి దాడిలో స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వారు డిశ్చార్జయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఎంపీ రంజిత కోలి ట్విటర్లో పోస్టు చేశారు. దాడి చేసిన వారిని వదిలిపెట్టనని.. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారని తెలిపారు. అర్ధరాత్రి కావడంతో నిందితులను గుర్తించలేకపోయారు.దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు సతీశ్ పూనియా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ దాడి చేసిందని ఆరోపించారు. నేరాలకు రాజస్థాన్ అడ్డాగా మారిందని విమర్శించారు. చదవండి: సీఎం మార్పు: కుట్రలపై ముఖ్యమంత్రి ఘాటు స్పందన చదవండి: ఒక ప్రభుత్వం కాదు ఇది మూడు గ్రూపుల సర్కారు आज रात भरतपुर के आरबीएम हॉस्पिटल का निरीक्षण करने के बाद सीएचसी वैर का निरीक्षण करने जा रहीं भरतपुर सांसद श्रीमती रंजीता कोली जी के काफिले पर धरसोनी गांव के समीप हथियार बंद बदमाशों द्वारा हमला किया गया।@BJP4India @JPNadda @BJP4Rajasthan @DrSatishPoonia @chshekharbjp pic.twitter.com/CJkBECepDJ — Ranjeeta Koli MP (@RanjeetaKoliMP) May 27, 2021 -
సన్యాసం స్వీకరించిన రంజిత
బెంగళూరు, న్యూస్‌లైన్ : నిత్యానంద శిష్యురాలు, బహుభాషా నటి రంజిత శుక్రవారం సన్యాసం స్వీకరించారు. బెంగళూరు శివారులోని బిడిది సమీపంలోని ధ్యానపీఠంలో నిత్యానంద సమక్షంలో జరిగిన ఈ వేడుకలో రంజితతో పాటు 40 మంది సన్యాసం తీసుకున్నారు. అనంతరం రంజిత పేరును ‘మా ఆనందమయి’గా మార్చారు. ప్రతి ఏటా జనవరి 1న నిత్యానంద పుట్టిన రోజు జరుపుకుంటారు. అయితే జన్మనక్షత్రం ప్రకారం శుక్రవారం ఆయన ఈ వేడుకను తన శిష్యుల మధ్య పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే జనవరి 1వ తేది వరకు ధ్యానపీఠంలో పలు ధార్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కాగా, నిత్యానంద జన్మదిన వేడుకలకు మీడియాను దూరం పెట్టారు. కేసులుండగా సన్యాసమా? నటి రంజిత సన్యాసం తీసుకోవడం చాలా ఆశ్చర్యానికి గురి చేసిందని శ్రీజగద్గురు బసవ ధర్మ పీఠాధ్యక్షురాలు మాత మహాదేవి అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... నిత్యానంద - రంజితల కేసు విచారణ దశలోనే ఉందని, ఈ సమయంలో ఆమె సన్యాసం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. సన్యాసం తీసుకోవడమంటే అంత సులువు కాదని, సేవ చేయడానికి సిద్ధం కావాలని, అన్ని త్యాగం చేయాల్సి ఉంటుందని తెలిపారు. అన్ని భోగాలు అనుభవిస్తూ సన్యాసి అని చెప్పుకోవడం సాధ్యం కాదని గుర్తు చేశారు. అసలు నిత్యానంద ఆశ్రమంలో ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి తెలియాల్సిన అవసరముందని అన్నారు. నిరసనలు నిత్యానందను రాష్ట్రం నుంచి వెలివేయాలంటూ కర్ణాటక నవ నిర్మాణ సేన ఆధ్వర్యంలో బిడిది ఆశ్రమం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. నిత్యానంద పోస్టర్లను చించి, నిరసనలు వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు ప్రహరీ ఎక్కి చిత్రీకరించేందుకు ప్రయత్నించడంతో నిత్యానంద శిష్యులు లోపలి నుంచి రాళ్లు రువ్వారు.