గ్రహణం విడిచే వరకు నీటిపై వాయు దిగ్బంధనం
పిఠాపురం : చంద్రగ్రహణం మొదలైనప్పటి నుంచి అది పూర్తయ్యేవరకు ఓ పురోహితుడు వాయు దిగ్బంధనం చేసి నీటిపై తేలి ఉండడం ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించారు. ఈ ఘటనకు తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం పట్టణంలోని పాదగయ క్షేత్రం వేదికగా నిలిచింది.
తాళ్లరేవు మండలం పిల్లంకకు చెందిన పురోహితుడు ఏలూరి వెంకట కామేశ్వర శర్మ (40) శనివారం సాయంత్రం ఆలయ పుష్కరిణి వద్దకు చేరుకున్నారు. పుష్కరిణిలోకి దిగి 3.45 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు వాయు దిగ్బంధనాసనం వేశారు. జాతీయ జెండాను చేతబూని ఆసాంతం నీటిపై తేలి ఉన్నారు. దీన్ని చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.