Rare flower
-
ఈ పువ్వులు 12 ఏళ్లకు ఓసారి వికసిస్తాయి.. ఎక్కడో తెలుసా?
Neelakurinji Flowering Facts: ప్రకృతి విలయ తాండవం చేస్తే ఎంత భీకరంగా ఉంటుందో.. ప్రశాంతంగా ఉంటే అంత అందంగా ఉంటుంది. చుట్టూ కొండలు, పచ్చని గడ్డి, పరవశించే పైర గాలి, ఆదమరపించే చెట్లు, అందమైన పూలు. చేతితో తాకవచ్చు అనిపించే మేఘాలు.. ఆ ఊహ ఎంత అందంగా ఉంటుంది. అదే నిజమైతే ఒళ్లు పులకించి, ఆనంద తాండవం చేయని మనిషి ఉండడు. తిరువనంతపురం: కేరళలోని శాంతన్‌పర షలోమ్ హిల్స్‌లో పూసిని పువ్వులు నేలపై బ్లూ కార్పెట్‌ను పరిచినట్టు వికసించాయి. 12 ఏళ్లకు ఓసారి వికసించే నీలకురింజి పువ్వులు అక్కడకి వచ్చిన పర్యాటకులను మంత్ర ముగ్దులను చేస్తున్నాయి. ఈ సీజన్లో సేకరించిన తేనెకు యమ గిరాకీ..! స్ట్రోబిలాంథెస్ కుంతియానస్ అనే శాస్త్రీయ నామం కలిగిన నీలకురింజి పువ్వులు జూలై-అక్టోబర్ మధ్యలో వికసిస్తాయి. నీలకురింజి అంటే మలయాళంలో ‘నీలి పువ్వు’ అని అర్థం. నీలకురింజి పువ్వుల పరాగసంపర్కానికి చాలా కాలం అవసరం. అందువల్ల ఇవి వికసించడానికి 12 సంవత్సరాలు పడుతుంది. వృక్షశాస్త్రంలో, దీనిని మొక్కల‘‘సర్వైవల్ మెకనిజమ్(మనుగడ విధానం) గా సూచిస్తారు. పక్షులు, గడ్డి తినే క్షీరదాల నుంచి నీలకురింజి పువ్వులకు పెద్ద ముప్పు ఉంది. దాంతో అవి వికసించడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఏఎన్ఐ ఇటీవల సంతన్పారా పంచాయితీలోని అందమైన కొండలలో పువ్వులు గాలికి ఊగుతున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇక నీలకురింజి పువ్వులు వికసించే ఈ సీజన్లో సేకరించే తేనె రుచి, పోషకాహార అంశాలలో అత్యున్నతమైనదిగా భావిస్తారు. దీంతో ఈ సీజన్లో తేనె ధర చాలా ఎక్కువగా ఉంటుంది. కాగా, ప్రపంచంలో 250 జాతుల పువ్వులలో 46 భారతదేశంలో కనిపిస్తాయి. ఇవి ప్రధానంగా పశ్చిమ కనుమలలో వికసిస్తాయి. ఇక కోవిడ్-19 మహమ్మారి వల్ల పర్యాటకుల తాకిడి చాలా తగ్గింది. #WATCH | Shantanpara Shalom hills under Santhanpara Panchayat in Kerala's Idukki are covered in hues of blue as Neelakurinji flowers bloom, which occurs once every 12 years pic.twitter.com/DyunepahAv — ANI (@ANI) August 2, 2021 -
బ్రహ్మకమలం విరబూసింది
సంవత్సరానికి ఒకేసారి పూసే బ్రహ్మకమలం హిందూపూర్ లోని ఓ ఇంట్లో విరబూసింది. అనంతపురం జిల్లా హిందూపురంలోని డీబీ కాలనీలోని ద్వారకానాథ్ రెడ్డి కొన్ని సంవత్సరాల క్రితం బ్రహ్మ కమలం మొక్కను తెచ్చి పెంచుతున్నారు. ఈ క్రమంలో శనివారం బ్రమ్మ కమలం పువ్వు వికసించింది. కొన్ని గంటలు మాత్రమే వికసించే ఈ అందమైన పుష్పాన్ని చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో వచ్చారు. హిమాలయాల్లో దొరికే.. ఈ మొక్క ఇంట్లో ఉంటే మంచిదని భావిస్తారు. -
రాకాసి పువ్వు
తిరుపతి తుడా: తిరుమల శేషాచల కొండల్లో అరుదైన పుష్పం దర్శనమిస్తోంది. ప్రపంచ దేశాల్లో కేవలం మూడు రకాల పుష్పాలు మాత్రమే మాంసహారంతో జీవిస్తాయని తెలుస్తోంది. అందులో ఒకటి శేషాచల అడవుల్లో ఉండటం గమనార్హం. ఎస్వీ యూ బోటనీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె.మాధవశెట్టి వీటిపై పరిశోధన చేస్తున్నారు. రంగులతో అందంగా .. శేషాచలం కొండల్లో పెరుగుతున్న సన్‌డ్యూ ప్లాంట్ డ్రాసిరేసి జాతికి చెందినది మెగ్గ. డ్రాసిరా బర్మానై శాస్త్రీయ నామం. తెలుగులో బ్యాడ్ సుందరి, సీమకుట్టు, బురద బూచి, బురద సుందరి, కవారమొగ్గ పేర్లు ఉన్నాయి. శేషాచల కొండల్లో బురద, నీరు ప్రవహించే ప్రంతాల్లో పెరుగుతున్నాయి. భూమికి రెండు, మూడు అంగుళాల ఎత్తు వరకు మాత్రమే పెరుగుతుంది. లేత గులాబీతో ఆకుపచ్చ రంగు మిళితమై ఉంటుంది. పువ్వుకు నాలుగు లేక ఐదు రేకులు ఉంటాయి. ఒక్కో రేకుపై వందల్లో గ్లాండ్ టిప్డ్ హేర్స్ ఉంటాయి. ఈ హేర్స్ చివరిలో బుడుపుగా ఉండాయి. సూర్యోదయం సమయంలో ఈ హేర్స్ బుడుపుల్లోంచి విడుదలయ్యే ద్రవ పదార్థాంపై సూర్య కిరణాలు పడ్డప్పుడు రంగు మరింత అందంగా మారి మెరుస్తాయి. ఆకర్షించి .. కరిగించి పువ్వు రేకులపై ఉండే గ్లాండ్ టిప్డ్ హేర్స్ నుంచి జిగడ పదార్థం ( హైడ్రోక్లోరిక్ యాసిడ్) విడుదల అవుతుంది. సూర్య కిరణాలకు అందంగా మెరుస్తూ సూక్ష్మ జీవులను ఆకర్షిస్తాయి. చిన్న పురుగులు, సూక్ష్మజీవులు రేకులపై వాలగానే జిగడలో చిక్కుకుంటాయి. ఒక్కో హేర్ నుంచి 10 మిల్లీ లీటర్ల జిగడ ద్రవం విడుదలై పువ్వు రేకులు ముడుచుకుంటాయి. ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్‌లో మరిగి సూక్ష్మజీవులు కరిగిపోతాయి. తరువాత వాటిని పువ్వులు ఆహారంగా తీసుకుంటాయి. ఇలా రోజుకు ఒక్కో పువ్వు సుమారుగా 700 పురుగులు, సూక్ష్మజీవులను ఆహారంగా తీసుకుంటాయి. ఔషధంగా కూడా.. ఈ మొక్కకు మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. పువ్వు రేకులను ఎండబెట్టి పొడి చేసి శరీరానికి పూసుకుంటే ఇరిటేషన్, ర్యాష్‌లు పోతాయి. చాలా అరుదుగా కనిపిస్తాయి. చూడటానికి చాలా అందంగా ఉంటాయి. - డాక్టర్ కె.మాధవశెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, వృక్ష శాస్త్రం, ఎస్వీయూ