rash driveing
-
ఇద్దరి స్నేహితుల ప్రాణాలను తీసిన.. విద్యార్థుల రాష్ డ్రైవింగ్!
సాక్షి, రంగారెడ్డి: ఇద్దరు మిత్రుల ఐదేళ్ల ప్రయాణం విద్యార్థుల రాష్ డ్రైవింగ్‌తో ఆగిపోయింది. నిమిషాల వ్యవధిలోనే ఇరువురూ ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన బుధవారం మోకిల పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం మండల పరిధిలోని జనవాడకు చెందిన బ్యాగరి రాజు(40) శేరిలింగంపల్లిలోని ఓ కంపెనీలో సూపర్వైజర్, మోత్కుపల్లి శ్రీశైలం(31) ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి. రోజు మాదిరిగానే వారు బైక్‌పై విధులకు బయలుదేరారు. గ్రామ శివారులోకి కొల్లూరు రోడ్డులో ఇక్ఫాయి కళాశాల విద్యార్థులు అతివేగంగా వచ్చి వీరి బైక్‌ను ఢీకొట్టారు. దీంతో రాజు ఘటనాస్థలిలోనే మృతి చెందగా.. శ్రీశైలంను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే తుదిశ్వాస విడిచాడు. రాజుకు భార్య మమత, ముగ్గురు సంతానం. శ్రీశైలంకు ఏడాదిన్నర క్రితం సంధ్యతో వివాహమైంది. మృతదేహాలను చికిత్స నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. ఇద్దరు మిత్రుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కళాశాల ఎదుట ధర్నా.. మృతుల కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్తులు కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని.. ప్రమాదానికి కారణమైన విద్యార్థులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గతంలోనూ శంకర్పల్లి–హైదరాబాద్ ప్రధాన రహదారిపై కార్ రేసింగ్ నిర్వహించి ఓ మహిళ ప్రాణాలను బలిగొన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల విద్యార్థులు గంజాయి, మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారని ఆరోపించారు. పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోకిల సీఐ నరేశ్, శంకర్పల్లి సీఐ వినాయకరెడ్డి కళాశాల వద్దకు చేరుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. -
పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ అరెస్ట్!
పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ్ శేఖర్ శర్మ అరెస్ట్ ఫిన్ టెక్ వర్గాల్లో కలకలం రేపుతుంది. విజయ్ శేఖర్ శర్మను ర్యాష్ డ్రైవింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు గత నెలలో అరెస్టు చేశారు. అరెస్ట్ అనంతరం ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. ఢిల్లీ పోలీస్ అధికార ప్రతినిధి సుమన్ నల్వా సమాచారం ప్రకారం..ఫిబ్రవరి 22న విజయ్ శేఖర్ శర్మ తన ల్యాండ్ రోవర్ కారులో మదర్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి వస్తుండగా డీసీపీ బెనిటా మేరీ జాకర్ ను ఢీకొట్టారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే డీసీపీ కారును డ్రైవ్ చేస్తున్న డ్రైవర్, కానిస్టేబుల్ దీపక్ కుమార్ విజయ్ ల్యాండ్ రోవర్ నంబర్‌ను గుర్తించి, వెంటనే డీసీపీకి సమాచారం అందించినట్లు సుమన్ నల్వా తెలిపారు. ప్రాథమిక విచారణ తర్వాత ల్యాండ్ రోవన్ కారును గుర్గావ్లోని ఒక కంపెనీలో రిజిస్టర్ చేసినట్లు, ఆ కారు దక్షిణ ఢిల్లీలో నివసిస్తున్న పేటీఎం సీఈఓ విజయ్ శంకర్ శర్మదేనని పోలీసులు నిర్ధారించారు. ర్యాష్ డ్రైవ్ చేశారనే కారణంగా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు విజయ్ శేఖర్ శర్మను అరెస్టు చేశారు. అరెస్ట్ తర్వాత ఆయన బెయిల్‌పై విడుదలయ్యారని సుమన్ నల్వా ధృవీకరించారు. కాగా, మార్చి 11న పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంకుకు ఆర్బీఐ నోటీసులు జారీ చేసింది. కొత్తగా వచ్చే ఖాతాదారుల్ని ఆన్ బోర్డింగ్ చేసుకోవడాన్ని నిలిపివేయాలని ఆర్బీఐ ఆదేశించింది. పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంకుకు చెందిన ఐటీ వ్యవస్థను సమగ్రంగా ఆడిట్ చేయడానికి ఐటీ ఆడిట్ సంస్థను నియమించాలని సూచించింది. ఈ నేపథ్యంలో విజయ్ శేఖర్ శర్మను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారనే వార్తలు హాట్ టాపిగ్గా మారాయి. చదవండి: కష్టపడేతత్వం ఉంటే చాలు... కుటుంబ నేపథ్యం, ఇంగ్లీష్ పరిజ్ఞానంతో పని లేదు -
కారును ఢీకొట్టడమే కాకుండా దౌర్జన్యం
హైదరాబాద్ : బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ కారును ఢీకొట్టడమే కాకుండా ఇదేమిటని అడిగినందుకు ఆయన కుమార్తెతోపాటు భార్యపై మరో కారు డ్రైవర్ దుర్భాషలాడాడు. ఈ సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ మెక్ అలిస్టర్ కుమార్తె ఫియోనా మెక్ అలిస్టర్ తన తల్లితో కలిసి సోమవారం రాత్రి షేక్‌పేట్ నాలా వైపు నుంచి కారులో అపర్ణ సినార్ వ్యాలీ వైపు వస్తుంది. ఆ క్రమంలో ఏపీ 29 ఏఎల్ 9332 కారు .. ఈ కారును ఓవర్టేక్ చేస్తూ ఢీకొట్టింది. ఇదేమిటని కారు నడుపుతున్న డ్రైవర్‌తో పాటు అందులో కూర్చున్న ఫియోనా.. ఢీకొట్టిన కారు డ్రైవర్‌ను ప్రశ్నించింది. దీంతో రెచ్చిపోయిన కారు డ్రై వర్ వారిని అసభ్యపదజాలంతో దూషిస్తూ... కారు అద్దాలు పగలగొట్టేందుకు యత్నించాడు. కారులోని మహిళలపై దాడి చేసేందుకు యత్నించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ప్రమాదానికి కారకుడైన కారు యజమానిపై ఐపీసీ సెక్షన్ 279, 341, 506ల కింద కేసు నమోదు చేసి డ్రైవర్ కోసం గాలింపు చేపట్టారు. ఈ కేసును ఎస్ఐ గోవర్ధన్‌రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.