ఉడయార్ వారసుడు
శ్రీనాథ రత్నశిల్పి ఉడయార్ దేశంలోనే గొప్ప శిల్పుల్లో ఒకరిగా పేరుపొందారు. అలాగే ఆయన కుమార్తె దేవికారాణి ఉడయార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలి మహిళా శిల్పిగా వార్తల్లో నిలిచారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నివసించే దేవిక... శిల్పకళాకారిణిగా దూసుకుపోతుంటే ఇప్పుడు ఆమె కుమారుడు కూడా ఆ రంగంలో వెలుగులోకి వచ్చాడు. తాతయ్యనే గురువుగా స్వీకరించి శిల్పకళలో రాణిస్తున్నాడు. కంప్యూటర్ యుగంలోనూ యువశిల్పులకు స్ఫూర్తినిస్తున్న శ్రీనివాస్... అంతరంగమిది.
- ఎస్.సత్యబాబు
మా తాతగారు విగ్రహాలను భుక్తి కోసం కాక, భక్తిగా రూపొందించేవారు. ఒక్క అంబేద్కర్వే దాదాపు 60 వేలకుపైగా విగ్రహాలు తయారు చేశారు ఆయన. తెలుగు రాష్ట్రాలలో కనిపించే అంబేద్కర్ విగ్రహాలలో అత్యధికం మా తాతగారు చేసినవే. ట్యాంక్‌బండ్ మీద అన్నమాచార్య, అల్లూరి సీతారామరాజు మరికొన్ని కూడా ఆయన రూపొందించినవే. ఈ విగ్రహాల కోసం ఎన్టీయార్ స్వయంగా ఆయనను పురమాయించారు. బాలకృష్ణ అరకులోయలో నెలకొల్పిన ఎన్టీయార్ విగ్రహాన్ని తాతయ్యే చేశారు. తాతగారు 2003లో చనిపోయారు. ఓ రకంగా రాష్ట్రంలో ఇంతమంది శిల్పులున్నారంటే ఆయనే స్ఫూర్తి. చిన్నతనంలో మా తాతయ్యగారికి పనిముట్లు అందిస్తుండేవాణ్ణి. అలా అలా ఈ వృత్తి మీద ఇష్టం పెరిగింది. ఆయన స్ఫూర్తితోనే ఈ రంగంలోకి వచ్చాను.
అమ్మకు చేయూతగా...
అమ్మ శిల్పిగా పనిచేస్తున్నప్పుడు ఆమె పనిలో భాగం పంచుకున్నాను.అయ్యప్ప స్వామి, వశిష్టమహర్షి... ఢిల్లీలోని ఎపి భవన్లో ఉన్న అంబేద్కర్ కాంస్య విగ్రహం, నర్సాపురంలో బాపు, హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో రఘుపతి వెంకయ్య, తమిళనాడులో బిఆర్ పంతులు, డివిఎస్ రాజు ... ఇలా పలువురు ప్రముఖుల విగ్రహాల రూపకల్పనలో మా అమ్మగారికి చేదోడుగా ఉన్నాను. కేవలం శిల్పిగానే మిగిలిపోకుండా ఉండాలని పెన్సిల్ ఆర్ట్, మ్యూరల్ ఆర్ట్స్‌లోనూ నైపుణ్యం సాధించాను. అబ్దుల్ కలామ్, సావిత్రి, ఘంటశాల, వైఎస్.ఆర్, ఎం.ఎస్.సుబ్బలక్ష్మి తదితర కీర్తి శేషులైన ప్రముఖుల చిత్రాలను పెన్సిల్‌తో గీసినవి పలువురి ప్రశంసలు అందుకున్నాయి.
సహజత్వం కోసమే తాపత్రయం
మైకెలాంజిలో డేవిడ్ స్టాచ్యూ, డావిన్సి మోనాలిసా వంటివి ఆ కళాకారులను శతాబ్దాల పాటు బతికిస్తూనే ఉన్నాయి. వాళ్ల స్ఫూర్తితో తాతగారిలా నా పేరు కూడా చిరస్థాయిగా నిలవాలని అనుకుంటున్నాను. అందుకే శిల్పం సహజంగా అనిపించేవరకూ చేస్తాను. మనం తయారు చేసిన విగ్రహాలు