వ్యాగన్ వర్క్‌షాపును సందర్శించిన రైల్వే జీఎం
గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): గుంటుపల్లి రైల్వే వ్యాగన్ వర్క్‌షాప్‌ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్త గురువారం సందర్శించారు. ఎంప్లాయీస్ సంఘ్ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. కార్మికుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఎంప్లాయీస్ సంఘ్ డివిజన్ అధ్యక్షుడు ఎస్వీ సాంబశివరావు, కార్యదర్శి చాంద్‌బాషా కార్మికుల సమస్యలు వివరించారు. వర్క్‌షాపులో ఖాళీగా ఉన్న 450 పోస్టులు వెంటనే భర్తీ చేయాలని కోరారు. రైల్వే ఆస్పత్రిలో మహిళా డాక్టర్‌ను నియమించాలన్నారు. మచిలీపట్నం, సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రాయనపాడులో నిలిపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైల్వే కాలనీ శిథిలావస్థకు చేరిన క్వార్టర్ల స్థానంలో కొత్తవి నిర్మించాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం కార్మికులు రవీంద్రగుప్తాను సత్కరించారు. కార్యక్రమంలో బ్రాంచి అధ్యక్షుడు కె.దుర్గాప్రసాద్, డేవిడ్‌రాజు తదితరులు పాల్గొన్నారు.