శ్రీసిటీకి అన్ని ప్రాంతాలనుంచి బస్సు సర్వీసులు
సత్యవేడు: శ్రీసిటీలోని పలు కంపెనీల కార్మికులను చేరవేసేందుకు ఆర్టీసీ మినీ బస్సులు నడిపేందుకు చర్యలు చేపడుతున్నామని నెల్లూరు రీజియన్ ఈడీ రవీంద్రబాబు తెలిపారు. సోమవారం ఆయన సత్యవేడు ఆర్టీసీ డిపోను పరిశీలించారు. ఈసందర్భంగా ఈడీ మాట్లాడుతూ ఆర్టీసీకి ఆదాయాన్ని పెంచే దిశగా శ్రీసిటీలో పలు కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు చెన్నై, నెల్లూరు, సత్యవేడు, పుత్తూరు, శ్రీకాళహస్తి ప్రాంతాలకు తీసుకువెళ్లేందుకు కంపెనీ యాజమాన్యాలతో ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అనంతరం ఆర్టీసీ డీఎం సురేష్‌బాబుతో మాట్లాడుతూ డిపో పరిధిలో 12 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులను ఆపేయాలని ఈడీ ఆదేశించారు. రాత్రి 9గంటలకు తిరుపతి బస్టాండు నుంచి సత్యవేడుకు బస్సు బయలుదేరేటట్లు చర్యలు తీసుకోవాలని డీఎంను ఆదేశించారు.