Ravindarravu
-
బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా రవీందర్రావు
మంచిర్యాల టౌన్, న్యూస్‌లైన్ : బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా మంచిర్యాలకు చెందిన వెరబెల్లి రవీందర్రావు నియామకం అయ్యారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ రాష్ట్ర కో కన్వీనర్‌గా ఉన్న రవీందర్రావు జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా నియామకం కావడంతో గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మల్లేశ్, బీజేపీ నాయకులు చుంచు శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్చార్జి మద్దెర్ల కృష్ణమూర్తి, జిల్లా మహిళామోర్చా ప్రధాన కార్యదర్శి బోడకుంట ప్రభ, బీజేవైఎం పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొద్దున మల్లేశ్, మేరుగు ఆంజనేయులు, కిషాన్ మోర్చా మండల అధ్యక్షుడు నరెడ్ల పోచమల్లు పాల్గొన్నారు. -
ఓరుగల్లుభగ్గుమంది
వరంగల్ సిటీ, న్యూస్‌లైన్: హైదరాబాద్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈటెల రాజేం దర్, కొప్పుల ఈశ్వర్, హరీష్ రావు, జిల్లా ఇన్చార్జ్ పెద్ది సుదర్శన్‌రెడ్డి అరెస్ట్... తెలంగాణ న్యాయవాదులపై దాడుల నేపథ్యంలో ఓరుగల్లు భగ్గుమంది. మీకో న్యాయం... మాకో న్యా యమా... అంటూ సోమవారం జిల్లావ్యాప్తంగా తెలంగాణవాదులు రోడ్డెక్కారు. నిరసన ర్యాలీలు... రాస్తోరోకోలు... దిష్టిబొమ్మల దహనాల వంటి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. రాష్ట్ర ప్ర భుత్వం సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరిస్తోందనడానికి ఈ ఘ టనలే నిదర్శనమని పలువురు దుయ్యబట్టారు. తెలంగాణ ఉ ద్యమాన్ని అణచివేయాలని యత్నించిన సర్కారు... సీమాంధ్ర లో ఆందోళనలకు సహకరించడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో.. వరంగల్, హైదరాబాద్ ప్రధాన రహదారిపై స్టేషన్ ఘన్పూర్ వద్ద టీఆర్ఎస్ నాయకులు, తెలంగాణవాదులు రాస్తారోకో నిర్వహించడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సీఎం డౌన్... డౌన్ అనే నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. రాస్తారోకో అనంతరం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్, డీజీపీ దినేష్‌రెడ్డి.. సీమాంధ్ర ఉద్యమ నాయకులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో ఘర్షణలు సృష్టించేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. నిరసనకు ముందుగా రెండు రోజులుగా అక్కడ నిర్వహిస్తున్న శాంతి దీక్షలను ఎమ్మెల్యే రాజయ్య విరమింపజేశారు. హన్మకొండ చౌరస్తాలో... టీఆర్ఎస్ ఆధ్వర్యంలో హన్మకొండ చౌరస్తాలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ ప్రాంతంలో నిర్బంధాన్ని ప్రయోగిస్తూ, సీమాంధ్రలో ఉద్యమానికి వత్తాసు పలుకుతున్నారని ఆ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు నయీమొద్దీన్ విమర్శించారు. తీగెల జయరాజ్, రహీమున్నీసా, మందాటి కిషన్, చాగంటి రమేష్ పాల్గొన్నారు. మహబూబాబాద్‌లో... తెలంగాణవాదులను రెచ్చగొట్టేందుకు సీఎం కుట్రలు చేస్తున్నారంటూ తెలంగాణవాదులు మహబూబాబాద్‌లో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. టీఆర్ఎస్ నాయకుడు వెంకన్న మాట్లాడుతూ శాంతియుత వాతావరణంలో విడిపోయేందుకు సహకరించాలని సీమాంధ్రులను కోరారు. పాలకుర్తిలో... పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణవాదులు పాలకుర్తిలో ధూంధాం నిర్వహించారు. ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కాగా... నినాదాలు మిన్నంటారుు. న్యాయవాదుల ఫైర్ హైదరాబాద్‌లో తెలంగాణ న్యాయవాదులపై దాడులకు నిరసనగా వరంగల్‌లో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రదర్శనలు చేపట్టారు. వరంగల్‌లో న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి అదాలత్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. సీఎం, పోలీసుల పక్షపాత వైఖరిపై మండిపడ్డారు. తెలంగాణవాదులను రెచ్చగొట్టేలా ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు వ్యాఖ్యలు చేశారని సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీ మాంధ్రుల కుట్రలను పసిగట్టి తెలంగాణవాదులు అప్రమత్తంగా ఉండాలన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అంబరీష, కార్యదర్శి సునీల్, అబ్దుల్నబీ, గుడిమల్ల రవికుమార్ పాల్గొన్నారు. జనగామలో న్యాయవాదులు కోర్టు ముందు నిరసన వ్యక్తం చేశారు. విద్యుత్ కార్మికులు... విద్యుత్ కార్మికుడు సంతోష్‌పై సీమాంధ్ర ఉద్యోగుల దాడిని విద్యుత్ కార్మికులు ఖండించారు. ములుగురోడ్డులో ర్యాలీ నిర్వహించడంతోపాటు సమైక్యవాదులు, సీఎం దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. తెలంగాణ ఉద్యోగులపై దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణవాదులను రెచ్చగొట్టే చర్యలను మానుకోవాలని విద్యుత్ జేఏసీ నాయకుడు సంపత్‌రావు కోరారు. -
ఓరుగల్లుభగ్గుమంది
వరంగల్ సిటీ, న్యూస్‌లైన్: హైదరాబాద్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈటెల రాజేం దర్, కొప్పుల ఈశ్వర్, హరీష్ రావు, జిల్లా ఇన్చార్జ్ పెద్ది సుదర్శన్‌రెడ్డి అరెస్ట్... తెలంగాణ న్యాయవాదులపై దాడుల నేపథ్యంలో ఓరుగల్లు భగ్గుమంది. మీకో న్యాయం... మాకో న్యా యమా... అంటూ సోమవారం జిల్లావ్యాప్తంగా తెలంగాణవాదులు రోడ్డెక్కారు. నిరసన ర్యాలీలు... రాస్తోరోకోలు... దిష్టిబొమ్మల దహనాల వంటి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. రాష్ట్ర ప్ర భుత్వం సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరిస్తోందనడానికి ఈ ఘ టనలే నిదర్శనమని పలువురు దుయ్యబట్టారు. తెలంగాణ ఉ ద్యమాన్ని అణచివేయాలని యత్నించిన సర్కారు... సీమాంధ్ర లో ఆందోళనలకు సహకరించడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో.. వరంగల్, హైదరాబాద్ ప్రధాన రహదారిపై స్టేషన్ ఘన్పూర్ వద్ద టీఆర్ఎస్ నాయకులు, తెలంగాణవాదులు రాస్తారోకో నిర్వహించడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సీఎం డౌన్... డౌన్ అనే నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. రాస్తారోకో అనంతరం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్, డీజీపీ దినేష్‌రెడ్డి.. సీమాంధ్ర ఉద్యమ నాయకులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో ఘర్షణలు సృష్టించేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. నిరసనకు ముందుగా రెండు రోజులుగా అక్కడ నిర్వహిస్తున్న శాంతి దీక్షలను ఎమ్మెల్యే రాజయ్య విరమింపజేశారు. హన్మకొండ చౌరస్తాలో... టీఆర్ఎస్ ఆధ్వర్యంలో హన్మకొండ చౌరస్తాలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ ప్రాంతంలో నిర్బంధాన్ని ప్రయోగిస్తూ, సీమాంధ్రలో ఉద్యమానికి వత్తాసు పలుకుతున్నారని ఆ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు నయీమొద్దీన్ విమర్శించారు. తీగెల జయరాజ్, రహీమున్నీసా, మందాటి కిషన్, చాగంటి రమేష్ పాల్గొన్నారు. మహబూబాబాద్‌లో... తెలంగాణవాదులను రెచ్చగొట్టేందుకు సీఎం కుట్రలు చేస్తున్నారంటూ తెలంగాణవాదులు మహబూబాబాద్‌లో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. టీఆర్ఎస్ నాయకుడు వెంకన్న మాట్లాడుతూ శాంతియుత వాతావరణంలో విడిపోయేందుకు సహకరించాలని సీమాంధ్రులను కోరారు. పాలకుర్తిలో... పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణవాదులు పాలకుర్తిలో ధూంధాం నిర్వహించారు. ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కాగా... నినాదాలు మిన్నంటారుు. న్యాయవాదుల ఫైర్ హైదరాబాద్‌లో తెలంగాణ న్యాయవాదులపై దాడులకు నిరసనగా వరంగల్‌లో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రదర్శనలు చేపట్టారు. వరంగల్‌లో న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి అదాలత్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. సీఎం, పోలీసుల పక్షపాత వైఖరిపై మండిపడ్డారు. తెలంగాణవాదులను రెచ్చగొట్టేలా ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు వ్యాఖ్యలు చేశారని సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీ మాంధ్రుల కుట్రలను పసిగట్టి తెలంగాణవాదులు అప్రమత్తంగా ఉండాలన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అంబరీష, కార్యదర్శి సునీల్, అబ్దుల్నబీ, గుడిమల్ల రవికుమార్ పాల్గొన్నారు. జనగామలో న్యాయవాదులు కోర్టు ముందు నిరసన వ్యక్తం చేశారు. విద్యుత్ కార్మికులు... విద్యుత్ కార్మికుడు సంతోష్‌పై సీమాంధ్ర ఉద్యోగుల దాడిని విద్యుత్ కార్మికులు ఖండించారు. ములుగురోడ్డులో ర్యాలీ నిర్వహించడంతోపాటు సమైక్యవాదులు, సీఎం దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. తెలంగాణ ఉద్యోగులపై దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణవాదులను రెచ్చగొట్టే చర్యలను మానుకోవాలని విద్యుత్ జేఏసీ నాయకుడు సంపత్‌రావు కోరారు.