షాకింగ్.. నమ్మలేకపోతున్నాం.. రాజమౌళి, ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్
ఆర్ఆర్ఆర్ సినిమాలో మెయిన్ విలన్ స్కాట్ దొర పాత్ర పోషించిన ఐరిష్ నటుడు రే స్టీవెన్సన్ (58) హఠాన్మరణం పట్ల ఆ సినిమా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఆయన మరణ వార్త విని షాకయ్యానంటూ ట్వీట్ చేశాడు. ‘షాకింగ్.. రే స్టీవెన్సన్ చనిపోయారనే వార్తను నమ్మలేకపోతున్నాను. సినిమా సెట్లో ఎంతో హుషారుగా ఉంటూ అందరిలో చైతన్య తీసుకొచ్చాడు. అతనితో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. రే స్టీవెన్సన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నాను. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను’ అంటూ రాజమౌళి ట్వీట్ చేశాడు.
Shocking... Just can't believe this news. Ray brought in so much energy and vibrancy with him to the sets. It was infectious. Working with him was pure joy.
My prayers are with his family. May his soul rest in peace. pic.twitter.com/HytFxHLyZD
— rajamouli ss (@ssrajamouli) May 23, 2023
‘స్కాట్ దొర’ అకాల మరణం పట్ల ఎన్టీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘రే స్టీవెన్సన్ మరణవార్త విని షాక్ అయ్యాను. చాలా త్వరగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఆయనతో పనిచేయడం గొప్ప అనుభవం. అతని ఆత్మకు శాంతి కలుగాలని ఆ భవంతున్ని కోరుకుంటున్నాను. అతని కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. మరోవైపు ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ కూడా ట్విటర్ వేదికగా స్టీవెన్సన్ మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ‘సర్ స్కాట్.. మీరెప్పుడు మా గుండెల్లో నిలిచే ఉంటారు’అంటూ ట్వీట్ చేసింది.
Shocked to hear about Ray Stevenson's passing. Gone too soon. It was a great experience working with him. May his soul rest in peace.
My thoughts and prayers are with his family and dear ones during this difficult time.
— Jr NTR (@tarak9999) May 23, 2023