జనహారతి
రాయలసీమ పుష్కరాలకు భారీగా తరలి వచ్చిన ప్రజలు
వెయ్యిమంది తో సహస్త్ర హారతులు
పాతముచ్చుమర్రి గ్రామంలో శుక్రవారం రాయలసీమ పుష్కరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దాదాపు వెయ్యి మంది కృష్ణమ్మకు హారతి పట్టారు. ఈ వేడుకలను తిలకించేందుకు సమీప గ్రామాలైన నెహ్రూనగర్, పగిడ్యాల, పడమర వనుములపాడు, లక్ష్మాపురం, ప్రాతకోట, నందికొట్కూరు తదితర గ్రామాల నుంచి ప్రజలు వేలాదిగా తరలి వచ్చారు. పురోహితులు తెలకపల్లి రఘురామశర్మ ప్రారంభపూజలు చేశారు. రాయలసీమ పుష్కర ఏర్పాట్లలో భాగస్వాములైన అందరికి రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ప్రజలు పుణ్యస్నానాలు ఆచరించారు.
– పగిడ్యాల