Raylaksmi
-
ఆ వయసు ఇంకా రాలేదు!
సంచలన తారల్లో నటి రాయ్‌లక్ష్మీ ఒకరని కచ్చితంగా చెప్పవచ్చు. పలు వదంతులకు కేంద్రబిందువుగా మారిన ఈ అమ్మడు ఆ మధ్య క్రికెట్ క్రీడాకారుడు ధోనీతో చెట్టాపట్టాల్ అంటూ సాగిన ప్రచారం కలకలాన్నే రేకెత్తించింది. నటిగా పుష్కరకాలాన్ని అధిగమించి రాయ్‌లక్ష్మీ దక్షిణాదిలోనే కాకుండా హిందీలోనూ నటించినా ఎందుకనో ప్రముఖ హీరోయిన్ల పట్టికలో చేరలేకపోయింది. అయితే కథానాయకిగానే నటిస్తానని పట్టుపట్టకుండా అందివచ్చిన ఎలాంటి పాత్రలోనైనా నటించి ఆ విధంగా పాపులర్ అయ్యింది. ఈ మధ్య తెలుగులో ఖైదీ నంబర్–150 చిత్రంలో చిరంజీవితో సింగిల్ సాంగ్‌కు చిందులేసి మంచి గుర్తింపునే తెచ్చుకుంది. నటిగా 12 ఏళ్లకు పైగా కొనసాగుతున్నారు పెళ్లెప్పుడు చేసుకుంటారు అన్న ప్రశ్రకు రాయ్‌లక్ష్మీ బదులిస్తూ ఇప్పుడే పెళ్లికి అవసరమేముందీ అంటూ ఎదురు ప్రశ్నించింది. అయినా 30 ఏళ్లు దాటిన నటీమణులు కూడా ఇంకా కథానాయికలుగా నటిస్తున్నారు. అలాంటిది తన వయసు 28దే. ఇంకా సినిమాలో తాను చేయాల్సిన పయనం చాలా ఉంది. మరి కొన్నేళ్ల తరువాత పెళ్లి విషయం ఆలోచిస్తాను అంటూ పేర్కొంది. అదీ నిజమే మూడు పదులు దాటిన ప్రౌడలు చాలా మంది పెళ్లికి దూరంగా ఉండి కథానాయికలుగా రాణిస్తూనే ఉన్నారుగా... -
26న తెరపైకి షావుకార్ పేట్టై
షావుకార్ పేట్టై చిత్రం ఈ నెల 26న తెరపై రానుంది. ఇంతకు ముందు మైనా, సాట్టై, మొసకుట్టి వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సాలోమన్ స్టూడియోస్ అధినేత జాన్మ్యాక్, జోన్స్‌తో కలిసి నిర్మించిన తాజా చిత్రం షావుకార్ పేట్టై. శ్రీకాంత్, రాయ్‌లక్ష్మీ జంటగా నటించిన ఈ చిత్రంలో వడివుక్కరసి, మనోబాల, వివేక్, అప్పుకుట్టి, కోటా శ్రీనివాసరావు, తలైవాసల్ విజయ్, సంపత్, కోవైసరళ, పవర్‌స్టార్ శ్రీనివాసన్, టీపీ.గణేశన్ తదితర నటులు ముఖ్య పాత్రల్ని పోషించిన ఇందులో నటుడు సుమన్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతల్ని వడివుడైయాన్ నిర్వహించారు. జాన్‌పీటర్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇది ఇంతకు ముందు వచ్చిన హారర్ చిత్రాలకు భిన్నంగా ఉంటుందని తెలిపారు.ఇందులో హీరోహీరోయిన్లు ఇద్దరూ దెయ్యాలుగా నటించడం విశేషం అన్నారు. ఈ చిత్రం శ్రీకాంత్‌కు, రాయ్‌లక్ష్మీకి టర్నింగ్ ఇస్తుందన్న విషయంలో ఎలాంటి సందేహం లేదన్నారు. షావుకార్ పేట్టై చిత్రం విడుదలకు ముందే ఇదే సంస్థలో బొట్టు చిత్రం చేసే అవకాశాన్ని నిర్మాతలు కల్పించారన్నారు. అంతే కాదు తన తదుపరి చిత్రాన్ని శ్రీకాంత్ హీరోగా ఈ సంస్థలోనే తెరకెక్కించినున్నట్లు వెల్లడించారు. షావుకార్ పేట్టై చిత్ర విడుదల హక్కుల్ని శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ పొందిందని 26న భారీ ఎత్తున విడుదలకు సన్నాహాలు చేస్తోందని దర్శకుడు వెల్లడించారు. -
అందుకే కట్ చేశా
నటి త్రిషతో స్నేహాన్ని కట్ చేసుకోవడానికి కారణమేమిటన్న ప్రశ్నకు నటి రాయ్‌లక్ష్మి చెప్పిన బదులేమిటో తెలుసా? అసత్యాలు ఆమెకు నచ్చవట. వీరి సంగతేమిటో చూద్దాం. త్రిష, రాయ్‌లక్ష్మి ఒకప్పుడు మంచి స్నేహితులు. అలాంటి స్నేహం ఇప్పుడిద్దరి మధ్య లేదట. ఇటీవల సౌకారపేట చిత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్న రాయ్‌లక్ష్మి విలేకరులతో ముచ్చటిస్తూ ప్రస్తుతం హాస్యంతో కూడిన హార్రర్ చిత్రాలకు ప్రేక్షకులు నుంచి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. ఈ సౌకారపేట చిత్రం ఆ కోవలోకే వస్తుందని చెప్పారు. అరణ్మణై చిత్రం తరువాత తానీ దెయ్యం ఇతివృత్తంతో కూడిన చిత్రంలో నటిస్తున్నానని తెలిపారు. మధ్యలో తానెక్కడికో పారిపోయినట్లు బోలెడు కథలల్లేస్తూ ప్రచారం చేశారన్నారు. నిజానికి నచ్చిన పాత్రలు లభించకపోవడంతో దొరికిన ఖాళీ సమయాన్ని న్యూజిల్యాండ్‌లో స్కై డైయింగ్, స్కూచ్ డైయింగ్ లాంటి క్రీడలో శిక్షణ పొందడానికి వెచ్చించానని వివరించారు. తనకు నటి త్రిష మధ్య కోల్డ్‌వార్‌కు కారణం ఏమిటని అడుగుతున్నారన్నారు. నాకు అసత్యాలాడే వారంటే నచ్చరని పేర్కొన్నారు. మొదట్లో త్రిష తాను చాలా ఫ్రెండ్లీగా ఉండేవారమని చెప్పారు. విందులు, వినోదాలకు కలిసే పాల్గొనేవారమని అలాంటి తనతో అబద్దాలు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. అయితే ఈ విషయమై తాను పూర్వాపరాల జోలికి వెళ్లదలచుకోలేదని రాయ్‌లక్ష్మి అన్నారు. వాళ్లను ఉరి తీయాలి: ఇంటర్నెట్లో తారల ఫొటోలను మార్ఫింగ్ చేసి బాత్రూమ్ సన్నివేశాలను ప్రచారం చేసే సంస్కృతి అధికం అవుతోందన్నారు. తారపై ద్వేషంతోనే కొందరు ఇలాంటి నీచ కార్యక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. తన ఫొటోలతో కూడిన బాత్రూమ్ సన్నివేశాలు ఇటీవల ఇంటర్నెట్లో హల్ చల్చేశాయన్నారు. ఇలాంటి వారిని ఊరికే వదిలేయకూడదని, ఇంకా చెప్పాలంటే బతకనీయరాదని అన్నారు. దుబాయ్‌లోని చట్టాలను తీసుకొచ్చి వారిని ఉరేయాలని రాయ్‌లక్ష్మి మండిపడ్డారు.