
26న తెరపైకి షావుకార్ పేట్టై
షావుకార్ పేట్టై చిత్రం ఈ నెల 26న తెరపై రానుంది. ఇంతకు ముందు మైనా, సాట్టై, మొసకుట్టి వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సాలోమన్ స్టూడియోస్ అధినేత జాన్‌మ్యాక్, జోన్స్‌తో కలిసి నిర్మించిన తాజా చిత్రం షావుకార్ పేట్టై. శ్రీకాంత్, రాయ్‌లక్ష్మీ జంటగా నటించిన ఈ చిత్రంలో వడివుక్కరసి, మనోబాల, వివేక్, అప్పుకుట్టి, కోటా శ్రీనివాసరావు, తలైవాసల్ విజయ్, సంపత్, కోవైసరళ, పవర్‌స్టార్ శ్రీనివాసన్, టీపీ.గణేశన్ తదితర నటులు ముఖ్య పాత్రల్ని పోషించిన ఇందులో నటుడు సుమన్ కీలక పాత్రలో నటించారు.
ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతల్ని వడివుడైయాన్ నిర్వహించారు. జాన్‌పీటర్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇది ఇంతకు ముందు వచ్చిన హారర్ చిత్రాలకు భిన్నంగా ఉంటుందని తెలిపారు.ఇందులో హీరోహీరోయిన్లు ఇద్దరూ దెయ్యాలుగా నటించడం విశేషం అన్నారు. ఈ చిత్రం శ్రీకాంత్‌కు, రాయ్‌లక్ష్మీకి టర్నింగ్ ఇస్తుందన్న విషయంలో ఎలాంటి సందేహం లేదన్నారు.
షావుకార్ పేట్టై చిత్రం విడుదలకు ముందే ఇదే సంస్థలో బొట్టు చిత్రం చేసే అవకాశాన్ని నిర్మాతలు కల్పించారన్నారు. అంతే కాదు తన తదుపరి చిత్రాన్ని శ్రీకాంత్ హీరోగా ఈ సంస్థలోనే తెరకెక్కించినున్నట్లు వెల్లడించారు. షావుకార్ పేట్టై చిత్ర విడుదల హక్కుల్ని శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ పొందిందని 26న భారీ ఎత్తున విడుదలకు సన్నాహాలు చేస్తోందని దర్శకుడు వెల్లడించారు.