Sowkarpettai
-
26న తెరపైకి షావుకార్ పేట్టై
షావుకార్ పేట్టై చిత్రం ఈ నెల 26న తెరపై రానుంది. ఇంతకు ముందు మైనా, సాట్టై, మొసకుట్టి వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సాలోమన్ స్టూడియోస్ అధినేత జాన్మ్యాక్, జోన్స్‌తో కలిసి నిర్మించిన తాజా చిత్రం షావుకార్ పేట్టై. శ్రీకాంత్, రాయ్‌లక్ష్మీ జంటగా నటించిన ఈ చిత్రంలో వడివుక్కరసి, మనోబాల, వివేక్, అప్పుకుట్టి, కోటా శ్రీనివాసరావు, తలైవాసల్ విజయ్, సంపత్, కోవైసరళ, పవర్‌స్టార్ శ్రీనివాసన్, టీపీ.గణేశన్ తదితర నటులు ముఖ్య పాత్రల్ని పోషించిన ఇందులో నటుడు సుమన్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతల్ని వడివుడైయాన్ నిర్వహించారు. జాన్‌పీటర్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇది ఇంతకు ముందు వచ్చిన హారర్ చిత్రాలకు భిన్నంగా ఉంటుందని తెలిపారు.ఇందులో హీరోహీరోయిన్లు ఇద్దరూ దెయ్యాలుగా నటించడం విశేషం అన్నారు. ఈ చిత్రం శ్రీకాంత్‌కు, రాయ్‌లక్ష్మీకి టర్నింగ్ ఇస్తుందన్న విషయంలో ఎలాంటి సందేహం లేదన్నారు. షావుకార్ పేట్టై చిత్రం విడుదలకు ముందే ఇదే సంస్థలో బొట్టు చిత్రం చేసే అవకాశాన్ని నిర్మాతలు కల్పించారన్నారు. అంతే కాదు తన తదుపరి చిత్రాన్ని శ్రీకాంత్ హీరోగా ఈ సంస్థలోనే తెరకెక్కించినున్నట్లు వెల్లడించారు. షావుకార్ పేట్టై చిత్ర విడుదల హక్కుల్ని శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ పొందిందని 26న భారీ ఎత్తున విడుదలకు సన్నాహాలు చేస్తోందని దర్శకుడు వెల్లడించారు. -
ఆ రాత్రి... కాళరాత్రి!
అదో ఐదు నక్షత్రాల గది. పదో అంతస్తులో రాయ్ లక్ష్మి ఉన్నారు. ఆమె ‘శౌకారపేట్టై’ (తెలుగులో ‘బేగంపేట’) అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. చిత్రనిర్మాత ఆమెకు ఆ ఫైవ్ స్టార్ హోటల్లో బస ఏర్పాటు చేశారు. ఆ రోజు షూటింగ్‌కి పేకప్ చెప్పగానే హ్యాపీగా గదిలోకెళ్లిపోయారు. హాయిగా నిద్రపోయి మర్నాడు షూటింగ్‌కి వెళదామని నిర్ణయించుకుని, నిద్రకు ఉపక్రమించారు. కట్ చేస్తే.. ఆ రాత్రి రాయ్ లక్ష్మీకి కాళరాత్రి అయ్యింది. ఎందుకంటే, నిద్రపోతుండగా హఠాత్తుగా మెలకువ వచ్చిందట. అలాగే, ఆ గది బయట ఓ ఫ్లాష్ కనిపించిందట. దాంతో పాటు ఓ వింత శబ్దం వినిపించిందామెకు. దాంతో హోటల్ సిబ్బందిని పిలిచి బయట ఏమైనా షార్ట్ సర్క్యూట్ జరిగిందా అని ఆరా తీశారు. అదేమీ లేదన్నారు వాళ్లు. సరేలే అని సరిపెట్టుకున్న ఈ బ్యూటీకి కొంత వ్యవధిలో మరోసారి ఆ లైటింగ్ కనిపించిందట. ఏదో తేడాగా ఉందని హోటల్ సెక్యూరిటీ సిబ్బందిని పిలిచి, గది బయట కాపలాగా ఉండమని కోరారట. కాసేపు దేవుడి శ్లోకాలు చదువుకుని, ఆ తర్వాత నిద్రపోయారట. ‘‘నాకు ఇప్పటికీ ఆ సంఘటన తలుచుకుంటే ఒళ్లంతా చెమటలు పడతాయి’’ అని రాయ్ లక్ష్మి చెప్పారు. ఆ మధ్య చేసిన ‘అరణ్మణై’ సినిమా షూటింగ్ సమయంలో కూడా ఆమెకు ఇలాంటి వింత అనుభవాలు ఎదురయ్యాయట. ఇంతకీ ఎందుకిలా జరుగుతోందంటే.. ‘అరణ్మణై’ దెయ్యాల నేపథ్యంలో సాగుతుంది. ఇప్పుడు ‘శౌకారపేట్టై’ కూడా అంతే. వరుసగా ఇలాంటి చిత్రాల్లో నటిస్తున్నారు కాబట్టి, ఆమె ఏవేవో ఊహించుకుంటున్నారా? లేక నిజంగానే ఏదో కనిపిస్తోందా? ఏమో..? -
భయపెట్టనున్న రాయ్ లక్ష్మి
కోలీవుడ్‌లో ప్రస్తుతం హర్రర్ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. ముఖ్యంగా కథానాయకిలు దెయ్యాలుగా భయ పెడుతున్నారు. అరణ్మణై చిత్రంలో నటి ఆండ్రియ, డార్లింగ్ చిత్రంలో నందిత, కాంచన సీక్వెల్లో తాప్సీ ప్రజలను భయపెట్టి విజయాలు పొందారు. తాజాగా రాయ్ లక్ష్మి ప్రేక్షకులను భయ పెట్టేందుకు సిద్ధమయ్యారు. షావుకారు పేట చిత్రంలో దెయ్యంగా బీభత్సం సృష్టించనున్నారు. సాట్టై, మైనా, మోసకుట్టి వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించిన షాలోం స్టూడియోస్ అధినేత జాన్ మ్యాక్స్ నిర్మిస్తున్న చిత్రం షావుకారు పేట్టై. శ్రీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో రాయ్ లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను వడి వుడయాన్ నిర్వహిస్తున్నారు. శ్రీకాంత్ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. రాయ్ లక్ష్మి పాత్ర గత చిత్రాలతో పోలిస్తే భిన్నంగా ఉంటుందని దర్శకుడు చెబుతున్నారు. దెయ్యం పట్టి ఆమె ఆడటమేగాక ఇతరులను ఆడించే పాత్రను ఆమె పోషిస్తున్నారని తెలిపారు. ప్రస్తు తం తాంబరంలో షూటింగ్ జరుగుతోందని, జాన్‌పీటర్ సంగీ తం, శ్రీనివాసరెడ్డి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. -
శ్రీకాంత్, లక్ష్మీరాయ్ల సౌకార్‌పేటై
నటుడు శ్రీకాంత్, లక్ష్మీరాయ్ సరికొత్త కాంబినేషన్లో సౌకార్‌పేటై అనే చిత్రం తెరకెక్కనుంది. షాలోం స్టూడియోస్ సంస్థ అధినేత జాన్‌మ్యాక్స్ నిర్మిస్తున్న తాజా చిత్రం సౌకార్పేట్టై. ఎసి వడివుడైయాన్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహిస్తున్న ఈ చిత్రంలో శరవణన్, వివేక్, అప్పుకుట్టి, కోటా శ్రీనివాసరావు, సంపత్, కోవై సరళ, సుమన్, సూపర్‌స్టార్ శ్రీనివాస్, నాన్‌కడవుల్ రాజేంద్రన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు బుధవారం చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు విసి వడివుడైయాన్ మాట్లాడుతూ చెన్నైలోని సౌకార్‌పేటై అత్యంత జనసాంద్రతగల ప్రాంతమే కాకుండా వ్యాపార సముదాయాలకు నిలయం అన్నారు. ఆ ప్రాంతంలో జరిగే పలు ఆసక్తికరమైన సంఘటనల సమాహారమే చిత్రం అన్నారు. ఇందులో ప్రేమ, యాక్షన్, థ్రిల్లర్, హార్రర్ అంటూ పలు అంశాలు చోటు చేసుకుంటాయని దర్శకుడు చెప్పారు. సౌకారపేటై అంటే అధిక ప్రజలు, వ్యాపార సముదాయాల ప్రాంతం అనే చాలామందికి తెలుసన్నారు. అయితే ఆ ప్రాంతంలో ఒక వీధిలో దెయ్యం కథ ఒకటుందని చాలామందికి తెలియదన్నారు. ఆ ఇతివృత్తంతోనే సౌకార్‌పేటై చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. అయితే ఇందులో శ్రీకాంత్ దెయ్యమా? లక్ష్మీరాయ్ దెయ్యమా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అని అన్నారు.