ఆ రాత్రి... కాళరాత్రి! | Lakshmi Rai at Sowkarpettai Movie | Sakshi
Sakshi News home page

ఆ రాత్రి... కాళరాత్రి!

Published Mon, Aug 31 2015 12:58 AM | Last Updated on Sun, Sep 3 2017 8:25 AM

ఆ రాత్రి... కాళరాత్రి!

ఆ రాత్రి... కాళరాత్రి!

 అదో ఐదు నక్షత్రాల గది. పదో అంతస్తులో రాయ్ లక్ష్మి ఉన్నారు. ఆమె ‘శౌకారపేట్టై’ (తెలుగులో ‘బేగంపేట’) అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. చిత్రనిర్మాత ఆమెకు ఆ ఫైవ్ స్టార్ హోటల్లో బస ఏర్పాటు చేశారు. ఆ రోజు షూటింగ్‌కి పేకప్ చెప్పగానే హ్యాపీగా గదిలోకెళ్లిపోయారు. హాయిగా నిద్రపోయి మర్నాడు షూటింగ్‌కి వెళదామని నిర్ణయించుకుని, నిద్రకు ఉపక్రమించారు. కట్ చేస్తే.. ఆ రాత్రి రాయ్ లక్ష్మీకి కాళరాత్రి అయ్యింది. ఎందుకంటే, నిద్రపోతుండగా హఠాత్తుగా మెలకువ వచ్చిందట. అలాగే, ఆ గది బయట ఓ ఫ్లాష్ కనిపించిందట.
 
 దాంతో పాటు ఓ వింత శబ్దం వినిపించిందామెకు. దాంతో హోటల్ సిబ్బందిని పిలిచి బయట ఏమైనా షార్ట్ సర్క్యూట్ జరిగిందా అని ఆరా తీశారు. అదేమీ లేదన్నారు వాళ్లు. సరేలే అని సరిపెట్టుకున్న ఈ బ్యూటీకి కొంత వ్యవధిలో మరోసారి ఆ లైటింగ్ కనిపించిందట.  ఏదో తేడాగా ఉందని హోటల్ సెక్యూరిటీ సిబ్బందిని పిలిచి, గది బయట కాపలాగా ఉండమని కోరారట.
 
 కాసేపు దేవుడి శ్లోకాలు చదువుకుని, ఆ తర్వాత నిద్రపోయారట. ‘‘నాకు ఇప్పటికీ ఆ సంఘటన తలుచుకుంటే ఒళ్లంతా చెమటలు పడతాయి’’ అని రాయ్ లక్ష్మి చెప్పారు.  ఆ మధ్య చేసిన ‘అరణ్‌మణై’ సినిమా షూటింగ్ సమయంలో కూడా ఆమెకు ఇలాంటి వింత అనుభవాలు ఎదురయ్యాయట. ఇంతకీ ఎందుకిలా జరుగుతోందంటే.. ‘అరణ్‌మణై’ దెయ్యాల నేపథ్యంలో సాగుతుంది. ఇప్పుడు ‘శౌకారపేట్టై’ కూడా అంతే. వరుసగా ఇలాంటి చిత్రాల్లో నటిస్తున్నారు కాబట్టి, ఆమె ఏవేవో ఊహించుకుంటున్నారా? లేక నిజంగానే ఏదో కనిపిస్తోందా? ఏమో..?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement