Razia Sultana
-
పంజాబ్‌లో కొనసాగుతున్న రాజీనామాల పర్వం
చంఢీఘడ్: పంజాబ్ కాంగ్రెస్‌లో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా, పంజాబ్ క్యాబినెట్ మంత్రి రజియా సుల్తానా సిద్ధూబాటలోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సదరు మంత్రి మాలేర్ కోట్లా నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాగా, నవజ్యోతి సింగ్ విలువలు ఉన్న నాయకుడని ఆమె కొనియాడారు. పంజాబ్ ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే నేతగా సిద్ధూను రజియా సుల్తానా అభివర్ణించారు.. ఆయన బాటలోనే తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఒక సామాన్య కార్యకర్తగా పార్టీకి సేవలందిస్తానని తెలిపారు.. రజాయా సుల్తానాతో పాటు... పంజాబ్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ యోగిందర్ ధింగ్రా.. అదే విధంగా పంజాబ్ కాంగ్రెస్ పార్టీ క్యాషియర్ గుల్జార్ ఇండర్ ఛహల్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వరుస రాజీనామాలతో పంజాబ్‌లో కాంగ్రెస్ తీవ్ర అనిశ్చితి ఏర్పడింది. కాగా, గతంలో కెప్టెన్ అమరీందర్ సింగ్, నవజ్యోత్ సింగ్‌ల మధ్య పలు అంశాలలో బేధాభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి చాలా సార్లు ప్రయత్నించింది. ఈ క్రమంలో.. సిద్ధూకి కాంగ్రెస్ అధినాయకత్వం పీసీసీ పదవి అప్పగించింది. కొన్ని రోజుల పాటు వీరిద్దరి మధ్య సయోధ్య కుదిరిందని కాంగ్రెస్ వర్గాలు భావించాయి. కానీ ఆ తర్వాత కూడా సిద్ధూ ఆరోపణలు చేస్తుండటంతో కెప్టెన్ అమరీందర్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత అనూహ్యంగా చరణ్‌జిత్ సింగ్ ఛన్నీని పంజాబ్ సీఎంగా ఎన్నుకున్నారు. అయితే, సిద్ధూ.. చరణ్ జిత్‌సింగ్ ఛన్నీ ఎన్నిక పట్ల అంతగా సానుకూలంగా లేరు. తాజాగా, ఛన్నీ చేసిన క్యాబినెట్ మార్పుల పట్ల కూడా తీవ్ర అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈరోజు (మంగళవారం) సిద్ధూ కాంగ్రెస్ పీసీసీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించగా, పలువురు కాంగ్రెస్ నాయకులు కూడా ఆ పార్టీని వీడటం ఆ పార్టీని కలవర పరుస్తోంది. చదవండి: కాంగ్రెస్‌కు మరో షాక్: పీసీసీ చీఫ్ పదవికి సిద్ధూ రాజీనామా చదవండి: Charan Singh Channi: సిద్ధూ రాజీనామాపై నాకు సమాచారం లేదు -
అయ్యో.. అయ్యయ్యో..!
సకాలంలో స్పందించి ఉంటే సబా బతికేదే ఖాకీల నిర్లక్ష్యానికి పరాకాష్ట విషయం తెలిసీ చర్యలకు వెనుకంజ అంతా అయ్యాక హెడ్‌కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు ‘ఐదేళ్ల బాలికపై వేడినూనె పోశారు.. వళ్లంతా వాతలు పెట్టారు. ఆ చిన్నారి చావుబతుకుల్లో ఉంది కాపాడండి బాబూ’ అని ఎవరైనా చెబితే.. మానవత్వమున్న మనిషన్న వాడు అధికారం లేకపోయినా ఆ పాపను కాపాడేందుకు తెగిస్తాడు. కానీ అన్ని అధికారాలున్న మన పోలీసులు సొంత ఖాకీపై కరుణ చూపారు. ఆ చిన్నారి దుస్థితి తెలిసీ తేలిగ్గా తీసుకున్నారు. ఈ కారణంతోనే షాహిస్తా సబ పసిప్రాయంలోనే వసివాడిపోయింది. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదన్న బాధ ఇపుడు ప్రతి హృదయాన్ని తొలుస్తోంది. సంగారెడ్డి క్రైం : వేడి నూనె పడి వ ళ్లంతా కాలిపోయింది. వాతలతో దేహం చిల్లులుపడింది. అన్నం తిని ఎన్నిరోజులైందో... కనీసం అరిచే శక్తికూడా లేదు. అందుకే ఓ మూలన సొమ్మసిల్లిపడిపోయింది. అలా పడిపోయి కూడా ఎన్నిరోజులైందో తెలియదు. అందరూ స్పందించి ఆస్పత్రికి తీసుకెళ్లేలోవు ఆ చిన్నారి ఆయువు తీరిపోయింది. కొండాపూర్ మండలం మల్కాపూర్‌లోని గాంధీనగర్‌లో హెడ్‌కానిస్టేబుల్ సయ్యద్ జాకీర్ హుస్సేన్ అహ్మద్, రజియా సుల్తానా దంపతుల చేతిలో చిత్రహింసలకు గురై గురువారం మృతి చెందిన షాహిస్తా సబ(5) దుస్థితి ఇది. చిన్నారి పరిస్థితి గురించి తెలుసుకున్న స్థానికులు ఈనెల 27వ తేదీన చైల్డ్‌లైన్ నిర్వాహకులకు, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించాల్సిన ఖాకీలు నిందితుడు హెడ్‌కానిస్టేబుల్ కావడంతో అతనిపై కరుణ చూపారు. కనీసం బాలిక ఎలా ఉందో కూడా ఆరా తీయలేదు. బాలిక పరిస్థితి పూర్తిగా విషమించాక గురువారం రాత్రి బాలిక ఆచూకీ కనుగొన్నారు. వైద్యం కోసం 108లో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కానీ బాలిక ఊపిరి అప్పటికే ఆగిపోయింది. అంతా అయ్యాక స్పందించిన పోలీస్ బాస్ షాహిస్తా సబ మృతి ఘటనపై పోలీసు బాస్ స్పందించారు. బాలిక మృతికి కారణమైన దంపతులను గురువారమే అదుపులోకి తీసుకున్నారు. హెడ్‌కానిస్టేబుల్ అహ్మద్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. వీరిపై కిడ్నాప్, హత్య, జస్టిస్ జువెనైల్, బాల కార్మిక చట్టాల కింద కేసులు నమోదు చేశారు. బాలిక శరీరమంతా గాయాలతో ఉండటం తీవ్రంగా కలిచివేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులమని చెప్పుకుంటున్న హెడ్‌కానిస్టేబుల్ దంపతులకు డీఎన్ఎ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. బాలిక పట్ల అత్యంత కిరాతకంగా, వ్యవహరించిన దంపతులు శిక్ష నుంచి తప్పించుకోకుండా కఠిన కేసులు నమోదు చేశామని ఎస్పీ వెల్లడించారు. కేసును పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామన్నారు. అయితే జిల్లా పోలీసు బాస్‌గా మహిళ ఉన్నప్పటికీ ఓ బాలిక ప్రాణం మాత్రం కాపాడలేకపోయారనే విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. గాంధీ ఆస్పత్రికి బాలిక మృతదేహం పోలీసులు బాలిక సబ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సంగారెడ్డిలో ఆధునిక పరికరాలు లేనికారణంగా మృతదేహాన్ని గాంధీకి తరలించినట్లు ఎస్పీ సుమతి తెలిపారు. అమ్మతానికే మచ్చ ఐదుగురు బిడ్డలకు జన్మనిచ్చిన హెడ్‌కానిస్టేబుల్ భార్య రజియా...తన కూతురు వయసున్న సబ పట్ల కఠినంగా వ్యవహరించేదని తెలుస్తోంది. చిన్న తప్పుకే వాతలు పెట్టేదని స్థానికులు చెబుతున్నారు. ఈ దురాగతం తెలిసినా హుస్సేన్ అహ్మద్ పోలీసుశాఖలో పనిచేస్తుండడంతో ఎవరూ నోరుమెదపలేకపోయినట్లు తెలుస్తోంది. దీన్ని అలుసుగా తీసుకున్న ఆ ‘అమ్మ’ చిన్నారిపై శాడిజం చూపుతూ ఆనందపడుతుంటే.. తన బాధచెప్పుకునే అవకాశమే లేక ఆ పసిమొగ్గ వసివాడిపోయింది. వైద్య సాయంకూడా సకాలంలో అందక ఈ దుర్మార్గలోకం నుంచి వెళ్లిపోయింది. పేరులో వెలుగు.. అంతా చీకటి సబ...అంటే శోభిల్లడం, ప్రకాశవంతం అని అర్థం. కానీ ఖాకీ దంపతుల కర్కశానికి బలైన చిన్నారి షాహిస్తా సబ జీవితం మాత్రం మొగ్గదశలోనే చీకటిలో విసిరి వేయబడింది. బలవంతంగా చిదిమేయబడింది. లోకంపోకడ తెలియని వయస్సులోనే నరకం చూసింది. తల్లిదండ్రులెవరో తెలియదు... నా అన్న వాళ్లు లేరు. ఎక్కడో దర్గాలో ఉన్న సబను సొంత బిడ్డలా పెంచుకుంటామని ఇంటికి తెచ్చుకున్న ఖాకీ దంపతులు చిన్నచిన్న పనులు చేయలేదన్న కారణంతో వేడినూనె పోయడం, వాతలు పెట్టడం లాంటి దుర్మార్గమైన చర్యలకు పూనుకోవడంతో ఆ పాప అల్లాడిపోయింది. వారి దాష్టికాన్ని తాళలేక అనంతలోకాలకు తరలిపోయింది. -
నాలుగేళ్ల పోరాటానికి తొలి విజయం
నాలుగేళ్ల పాటు కొనసాగించిన పోరాటానికి తొలి విజయం లభించింది. అన్యాయం జరిగిందని ఆక్రోశించిన రజియా సుల్తానాకు అధికారులు అండగా నిలబడ్డారు. ప్రేమ పేరుతో ఖాకీ ముసుగులో మోసానికి పాల్పడ్డ ఎస్ఐ రంగనాథ్‌గౌడ్‌పై వేటు వేశారు. గుంటూరు రేంజి ఐజీ పి.వి.సునీల్‌కుమార్ అతడ్ని ఉద్యోగం నుంచి తొలగిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం జిల్లా పోలీస్ వర్గాల్లో సంచలనమైంది. అదేస్థాయిలో తీవ్ర చర్చనీయాంశమైంది. పొన్నూరుకు చెందిన రజియా సుల్తానాకు ఇంటర్ చదివే రోజుల్లో (2009, జూలైలో) అప్పటి ఎస్ఐ రంగనాథ్‌గౌడ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తరువాత తనను రంగనాథ్ ప్రేమపేరుతో మోసం చేశాడని అప్పటి ఎస్పీకి ఫిర్యాదు చేసింది. అప్పట్లో ఈ కేసు వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో జిల్లా పోలీస్ అధికారులు రంగనాథ్‌గౌడ్‌ను సస్పెండ్ చేసి కేసు నమోదు చేశారు. కొన్నాళ్ల తరువాత అరెస్టయిన రంగనాథ్ బెయిల్‌పై విడుదలయ్యాడు. సస్పెన్షన్ ఎత్తివేశాక నెల్లూరు జిల్లాకు బదిలీ అయ్యాడు. అప్పటి నుంచి రజియా సుల్తానా న్యాయపోరాటం సాగిస్తోంది. తనకు న్యాయం చేయాలంటూ కోర్టులు, పోలీసుల చుట్టూ తిరుగుతూనే ఉంది. ఒక సందర్భంలో ఆమె సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని కూడా కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వెళ్లబోసుకుంది. దీంతో కేసు విచారణలో వేగం పుంజుకుంది. దీనికితోడు గుంటూరు రేంజి ఐజీ సునీల్‌కుమార్ కూడా కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఒకటికి రెండుసార్లు రజియాసుల్తానా ఆవేదనను విన్నారు. ఒంగోలు డీఎస్పీ జాషువాను న్యాయవిచారణ జరపాలని ఏడాది కిందట ఆదేశాలు జారీ చేశారు. గత డిసెంబరులో గుంటూరు వచ్చిన డీఎస్పీ జాషువా రంగనాథ్, రజియా సుల్తానాలతో విడివిడిగా మాట్లాడి వారి వాదనలను విన్నారు. ఆయన నుంచి నివేదిక అందుకున్న ఐజీ సునీల్‌కుమార్ కేసులోని వాస్తవాలను గుర్తించారు. విచారణలో వాస్తవాలు వెలుగు చూసిన క్రమంలో ఎస్ఐ రంనాథ్‌గౌడ్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ఐజీ కార్యాలయం శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటనలో పేర్కొంది. రజియా సుల్తానా కేసుతో పాటు మరో నాలుగు కేసుల్లోనూ రంగనాథ్గౌడ్ పాత్ర ఉన్నట్లు విచారణలో రుజువు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఐజీ పేర్కొన్నారు. జిల్లా అంతటా చర్చే... కాగా రంగనాథ్‌గౌడ్‌పై పోలీస్ ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా చర్చ జరిగింది. ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్‌వర్గాలు, మహిళా సంఘాలు, కళాశాల విద్యార్థినులు ఇదే విషయంపై చర్చించుకోవడం కేసు ప్రాధాన్యతను తేటతెల్లం చేసింది. రంగనాథ్‌గౌడ్‌ను ఉద్యోగం నుంచి తొలగించిన విషయంపై బాధితురాలు రజియా సుల్తానా స్పందిస్తూ పోలీసులు పరంగా తనకు న్యాయం జరిగినట్లే, కోర్టు పరంగానూ న్యాయం జరగాలని, రంగనాథ్‌పై న్యాయపరమైన చర్యలు కూడా తీసుకోవాలని కోరింది. కష్టకాలంలో తనకు వె న్నంటే ఉండి ధైర్యాన్నిచ్చిన కుటుంబ పెద్దలు, స్నేహితులకు రజియా కృతజ్ఞతలు తెలిపింది. -
ఎస్ఐ రంగనాథ్, రజియాల కేసు విచారణ
గుంటూరు, న్యూస్‌లైన్: సంచలనం రేకెత్తించిన ఎస్ఐ రంగనాథ్ గౌడ్, రజియా సుల్తానా వివాహేతర సంబంధం కేసు నాలుగేళ్ల అనంతరం బహిరంగ విచారణకు నోచుకుంది. గుంటూరు పోలీస్ క్లబ్లో ప్రకాశం జిల్లా ఒంగోలు డీఎస్పీ జాషువా శుక్రవారం సాక్షులను విచారించారు. అప్పట్లో హోటల్లో సిబ్బందిగా పనిచేసిన వారితోపాటు, ఇద్దరు డీఎస్పీలు విచారణకు హాజరయ్యారు. పొన్నూరు ఎస్ఐగా పని చేసిన రంగనాథ్గౌడ్ తనని ప్రేమ పేరుతో మోసం చేసినట్లు రజియా సుల్తానా ఆరోపించిన విషయం తెలిసిందే. తనకు న్యాయం చేయాలని రజియా నాలుగేళ్లుగా పోరాటం చేస్తోంది. అప్పట్లో ఎస్ఐ రంగనాథ్గౌడ్ పారిపోయాడు. మూడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి అతని కోసం వెతికాయి. చివరకు అతను హైదరాబాద్‌లో దొరికాడు. ఆ తరువాత అతనిని సస్పెండ్ చేశారు. ఒక పక్క రజియా ఆందోళన చేస్తూనే ఉంది. రంగనాథ్ మరో పక్క పెళ్లి కూడా చేసుకున్నాడు. రజియా పోరాటం కొనసాగిస్తూనే ఉంది.