RBI letter
-
వంద మండలాలకే వర్తింపు!
రుణాల రీషెడ్యూల్‌పై రాష్ట్రానికి ఆర్బీఐ లేఖ సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మూడు జిల్లాల పరిధిలోని వంద మండలాల్లో మాత్రమే పంట రుణాల రీషెడ్యూల్కు ఆర్బీఐ అంగీకరించింది. రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన లేఖలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. గత ఏడాది తొమ్మిది జిల్లాల పరిధిలోని 415 మండలాలు కరువు, తుపాను ప్రభావానికి లోనుకావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ప్రభుత్వం వాదించినప్పటికీ ఆర్బీఐ పట్టించుకోలేదు. ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో కలిపి 100 మండలాల్లో మాత్రమే కరువు, తుపాను ప్రభావం నెలకొందని అభిప్రాయపడింది. ఈ మండలాల్లో మాత్రమే రుణాల రీషెడ్యూల్కు అనుమతిస్తామని తెలిపింది. ఆర్బీఐ పంపిన లేఖ ప్రకారం.. ఈ మండలాల్లో పంట రుణాల చెల్లింపుపై ఏడాది పాటు మారటోరియం విధించనున్నారు. అనంతరం రైతులు బ్యాంకులకు బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. కాగా శుక్రవారం అధికారులు చెప్పిన ప్రాథమిక సమాచారం ప్రకారం... మెదక్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రుణాల రీషెడ్యూల్ చేయనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. కానీ, శనివారం ఆర్బీఐ నుంచి రాష్ట్రానికి అందిన లేఖలో మాత్రం ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాలకు రుణాల రీషెడ్యూల్ వర్తిస్తుందని పేర్కొన్నారు. -
రీ షెడ్యూల్‌కు నిబంధనల అడ్డంకి
-
ఆర్బీఐకి సమాధానపత్రం పంపిన ఏపీ ప్రభుత్వం
-
ఆర్బీఐకి సమాధానపత్రం పంపిన ఏపీ ప్రభుత్వం
హైదరాబాద్ : రైతులకు రుణమాఫీపై చంద్రబాబు నాయుడు సర్కారు క్రమేపి దిగివస్తోంది. ఎన్నికల ముందు ప్రకటించిన రుణమాఫీపై ఇప్పటి వరకూ నాన్చవేత ధోరణి అవలంభిస్తున్న ఏపీ ప్రభుత్వం.. తాజాగా ఆర్బీఐకీ సమాధాన పత్రం పంపింది. ఈ మేరకు గురువారం ఓ లేఖను ఆర్బీఐకి అందజేసింది. వ్యవసాయ, బంగారు రుణాలను కూడా ఏడేళ్లు పాటు రీ షెడ్యూల్ చేయాలని ఆ లేఖలో పేర్కొంది. తక్షణమే కొత్త రుణాలను మంజారు చేయాలని ఆర్బీఐకి విన్నవించింది. లక్షన్నర వరకూ రుణమాఫీ చేస్తామని ఆర్బీఐకి హామీ ఇచ్చింది. కాగా, అక్కడ కూడా దాటవేత ధోరణిని అవలంభించింది. రీషెడ్యూల్ పై కోటయ్య కమిటీ వేసామని ఆర్బీఐకి తెలిపింది. రీషెడ్యూల్ ప్రతిపాదనపై వివరాలు కోరుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) బుధవారం లేఖ రాసింది. రైతుల రుణాల రీ షెడ్యూల్‌కు ఆర్బిఐ అంగీకరించినట్లయితే.. మాఫీ చేసిన రుణాలను మూడేళ్లలో చెల్లించగలరా? అని రెండు ప్రభుత్వాలను ఆర్బిఐ ప్రశ్నించింది. రుణాల రీషెడ్యూల్ విధి విధానాలపై నివేదిక పంపాలని రెండు ప్రభుత్వాలను కోరింది.ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి అధికార చేజిక్కించుకున్న చంద్రబాబు రుణాలు మాఫీ చేయలేక, కనీసం రీషెడ్యూల్ అన్నా చేయించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితులలో అనేక నిబంధనలతో ఆర్బిఐ ఓ లేఖను ఏపీ ప్రభుత్వానికి పంపింది. ఇందుకు ప్రతిగా ఓ లేఖను చంద్రబాబు సర్కారు ఆర్బీఐకి అందజేసింది. లక్షన్నర వరకూ రుణమాఫీ చే్స్తామని ఆర్బీఐకి నివేదిక అందజేసినా, మాఫీ చేసిన రుణాలను ఎప్పటిలోగా చెల్లిస్తామన్న దానిపై మాత్రం వివరణ ఇవ్వలేదు. -
రెండు ప్రభుత్వాలకు ఆర్బిఐ లేఖ
-
రెండు ప్రభుత్వాలకు ఆర్బిఐ లేఖ
హైదరాబాద్: రీషెడ్యూల్ ప్రతిపాదనపై వివరాలు కోరుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) లేఖ రాసింది. రైతుల రుణాల రీ షెడ్యూల్‌కు ఆర్బిఐ అంగీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మాఫీ చేసిన రుణాలను మూడేళ్లలో చెల్లించగలరా? అని రెండు ప్రభుత్వాలను ఆర్బిఐ ప్రశ్నించింది. రుణాల రీషెడ్యూల్ విధి విధానాలపై నివేదిక పంపాలని రెండు ప్రభుత్వాలను కోరింది. ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు రైతు రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే రుణాలు మాఫీ చేయడానికి రెండు రాష్ట్రాలకు అనేక అడ్డంకులు ఏర్పడ్డాయి. తెలంగాణలో ఆర్థిక పరమైన ఇబ్బందులు పెద్దగా లేకపోయినా, ఏపిలో మాత్రం చాలా క్లిష్టపరిస్థితులు ఉన్నాయి. ఏపి ఆర్థికంగా దయనీయ స్థితిలో ఉంది. జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులులేని పరిస్థితి ఏర్పడింది. హామీలు ఇచ్చి అధికార చేజిక్కించుకున్న చంద్రబాబు రుణాలు మాఫీ చేయలేక, కనీసం రీషెడ్యూల్ అన్నా చేయించాని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితులలో అనేక నిబంధనలతో ఆర్బిఐ నుంచి లేఖ వచ్చింది. మూడేళ్లలో రుణాలు చెల్లించేలా నిబంధనకు అంగీకరించాలని ఆర్బిఐ కోరింది. 2013-14 ఖరీఫ్‌కు మాత్రమే రుణాలు రీషెడ్యూల్ చేయగలమని ఆర్బిఐ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. అలాగే ఏపీలోని 572 మండలాల్లో 11,700 కోట్ల రూపాయల మేర పంట రుణాలు ఉన్నట్లు ఆర్బిఐ తేల్చింది. ఈ లేఖకు సమాదానం ఇవ్వడానికి ఏపి ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఆర్థిక శాఖ అధికారులు సచివాలయంలో అత్యవసరంగా సమావేశమయ్యారు. బ్యాంకుల నుండి సమాచారం సేకరిస్తున్నారు. రుణ బకాయిల చెల్లింపు గడువును మరింత పెంచమని ఆర్బిఐని కోరాలని ఏపి ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలా ఉండగా, రైతుల రుణాల రీషెడ్యూల్ విషయంలో ఆర్బిఐ లేఖపై తెలంగాణ మంత్రి మండలి చర్చించింది. లేఖ ఆధారంగానే నిర్ణయం తీసుకోవాలని మంత్రి మండలి తీర్మానించింది.