మృతుల కుటుంబాలకు ఆర్డీఆర్ పరామర్శ
సూర్యాపేటరూరల్ : మండలంలోని కాసరబాదలో కాంగ్రెస్‌పార్టీ పేట పట్టణ అధ్యక్షుడు అబ్దుల్‌రహీం మామగారైన తన్నీరు సత్యం(75) అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన మృతదేహాన్ని గురువారం రాంరెడ్డి దామోదర్‌రెడ్డి సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కుటుంబాన్ని పరామర్శించారు. అలాగే రామారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడైన బొడ నర్సయ్య(80) ఇటీవల మృతి చెందగా వారి నివాసానికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. నర్సయ్య కుటుంబసభ్యులకు రూ.10 వేలు ఆర్థికసాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లానాయకులు కొప్పుల వేణారెడ్డి, డీసీసీబి డైరెక్టర్ ముదిరెడ్డి రమణారెడ్డి, ఉపసర్పంచ్ కోతి గోపాల్‌రెడ్డి, సింగిల్‌విండో డైరక్టర్ చిలుముల సునీల్‌రెడ్డి, నాయకులు గట్టు శ్రీను, పాలవరపు వేణు, మిద్దే రమేష్, పల్సా మనోజ్‌గౌడ్, ఉయ్యాల మల్సూర్, పల్స వెంకటయ్య, మేకల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.