Real estate assets
-
సోనూసూద్‌పై ఐటీ దాడులు మరింత ఉధృతం
ముంబై: పన్ను ఎగవేత ఆరోపణలకు సంబంధించి బాలీవుడ్ నటుడు సోనూ సూద్‌పై ఆదాయ పన్ను శాఖ దాడుల్ని మరింత ఉధృతం చేసింది. ముంబైలోని ఆయన నివాసాలు, కార్యాలయాలపై ఏకకాంలో శుక్రవారం దాడులు చేసినట్టుగా ఐటీ వర్గాలు వెల్లడించాయి. సోనూ సూద్‌కు చెందిన మరిన్ని నివాసాలపై వరసగా మూడో రోజు దాడులు కొనసాగిస్తున్నట్టుగా తెలిపాయి. రియల్ ఎస్టేట్‌కు చెందిన ఒక ఒప్పందం, మరికొన్ని ఆర్థిక లావాదేవీలపై దృష్టి పెట్టినట్టు వివరించాయి. కరోనా సంక్షోభ సమయంలో వలసదారుల్ని తమ స్వగ్రామాలకు సురక్షితంగా చేర్చడంలో ఎంతో సాయం చేసిన సోనూ సూద్ లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్నారు. ఇటీవల ఢిల్లీ సీఎం కేజ్రివాల్ సోనూని ఆప్ పార్టీ తరపున దేశ్ కా మెంటర్‌గా నియమించారు. ఇప్పుడు ఆయనపై ఐటీ శాఖ చేస్తున్న దాడులకి రాజకీయ పరమైన కారణాలున్నాయనే విమర్శలు వస్తున్నాయి. -
ఈక్లర్క్స్- శోభా.. హైజంప్
వరుసగా నాలుగో రోజు మార్కెట్లు జోరు చూపుతున్నాయి. సెన్సెక్స్ లాభాల ట్రిపుల్ సెంచరీ సాధించి 36,400ను తాకగా.. నిఫ్టీ 136 పాయింట్లు బలపడి 10,700ను అధిగమించింది. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల ప్రభావంతో సాఫ్ట్వేర్ సేవల కంపెనీ ఈక్లర్క్స్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్ సంస్థ శోభా లిమిటెడ్ కౌంటర్లు వెలుగులోకి వచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఈక్లర్క్స్ సర్వీసెస్ సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు ఐటీ సేవల దిగ్గజం ఈక్లర్క్స్ సర్వీసెస్ ప్రతిపాదించింది. ఈ అంశంపై నేడు బోర్డు నిర్వహిస్తున్న సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలియజేసింది. రీసెర్చ్ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ బైబ్యాక్ కోసం కంపెనీ రూ. 200-250 కోట్లవరకూ వెచ్చించే వీలున్నట్లు అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఈక్లర్క్స్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. ఎన్ఎస్ఈలో తొలుత ఈ షేరు 11 శాతం దూసుకెళ్లి రూ. 528కు చేరింది. ఆపై కొంత మందగించింది. ప్రస్తుతం 7.5 శాతం ఎగసి రూ. 513 వద్ద ట్రేడవుతోంది. గతేడాది షేరుకి రూ. 1500 ధరలో 1.75 మిలియన్ షేర్లను ఈక్లర్క్స్ బైబ్యాక్ చేసింది. ఇందుకు రూ. 262 కోట్లను వెచ్చించింది. ఈక్లర్క్స్‌లో మార్చికల్లా ప్రమోటర్లకు 50.76 శాతం వాటా ఉంది. శోభా లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి క్వార్టర్లో అమ్మకాల పరిమాణం గతేడాది క్యూ4(జనవరి-మార్చి)తో పోలిస్తే 70 శాతం జంప్‌చేసినట్లు రియల్టీ కంపెనీ శోభా లిమిటెడ్ తాజాగా వెల్లడించింది. ఇందుకు ఆన్లైన్ టెక్నాలజీ, సొంత వ్యాపార విధానాలు, శోభా బ్రాండుపట్ల విశ్వాసం వంటి అంశాలు దోహదం చేసినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం శోభా షేరు ఎన్ఎస్ఈలో 5.5 శాతం జంప్‌చేసి రూ. 236 వద్ద ట్రేడవుతోంది. గత క్యూ4లో కంపెనీ నికర లాభం సగానికిపైగా తగ్గి రూ. 51 కోట్లకు పరిమితంకాగా.. మొత్తం ఆదాయం సైతం రూ. 1422 కోట్ల నుంచి రూ. 928 కోట్లకు క్షీణించింది. -
రియల్టీ విక్రయ యోచనలో ఆమ్టెక్
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ప్రధాన వ్యాపారేతర సంస్థలను, విదేశీ సంస్థల్లో మైనారిటీ వాటాలు, కొన్ని పారిశ్రామిక రియల్ ఎస్టేట్ ఆస్తులు విక్రయించాలని ఆమ్టెక్ ఆటో యోచిస్తోంది. అయితే, ప్రస్తుతం మాత్రం ఇంకా వీటికి సంబంధించి ఎటువంటి చర్చలూ జరగడం లేదని స్టాక్ ఎక్స్చేంజీలకు తెలిపింది. 54 శాతం ఎగసిన షేర్ ధర...: ఈ వార్తలతో శుక్రవారం ఆమ్టెక్ ఆటో షేరు ధర ఏకంగా 54 శాతం ఎగిసి రూ. 46.70 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఏకంగా 75 శాతం కూడా పెరిగింది. ఆమ్టెక్ ఆటో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోగా.. దాని అనుబంధ సంస్థ క్యాస్టెక్స్ టెక్నాలజీస్ షేరు ధరల్లో అవకతవకల ఆరోపణలపై సెబీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు, ఆమ్టెక్ ఆటో గ్రూప్‌కి మరిన్ని రుణాలేమైనా ఇవ్వడానికి.. ముందుగా కంపెనీ ఖాతాల ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలని దానికి లోన్లు ఇచ్చిన బ్యాంకుల సంయుక్త ఫోరం (జేఎల్ఎఫ్) నిర్ణయించింది.