రియల్టీ విక్రయ యోచనలో ఆమ్‌టెక్ | In a concerted effort to sell stocks of amtek | Sakshi
Sakshi News home page

రియల్టీ విక్రయ యోచనలో ఆమ్‌టెక్

Published Sat, Sep 12 2015 1:09 AM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM

రియల్టీ విక్రయ యోచనలో ఆమ్‌టెక్ - Sakshi

రియల్టీ విక్రయ యోచనలో ఆమ్‌టెక్

న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ప్రధాన వ్యాపారేతర సంస్థలను, విదేశీ సంస్థల్లో మైనారిటీ వాటాలు, కొన్ని పారిశ్రామిక రియల్ ఎస్టేట్ ఆస్తులు విక్రయించాలని ఆమ్‌టెక్ ఆటో యోచిస్తోంది. అయితే, ప్రస్తుతం మాత్రం ఇంకా వీటికి సంబంధించి ఎటువంటి చర్చలూ జరగడం లేదని స్టాక్ ఎక్స్చేంజీలకు తెలిపింది.
 
54 శాతం ఎగసిన షేర్ ధర...: ఈ వార్తలతో శుక్రవారం ఆమ్‌టెక్ ఆటో షేరు ధర ఏకంగా 54 శాతం ఎగిసి రూ. 46.70 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఏకంగా 75 శాతం కూడా పెరిగింది. ఆమ్‌టెక్ ఆటో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోగా.. దాని అనుబంధ సంస్థ క్యాస్టెక్స్ టెక్నాలజీస్ షేరు ధరల్లో అవకతవకల ఆరోపణలపై సెబీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు, ఆమ్‌టెక్ ఆటో గ్రూప్‌కి మరిన్ని రుణాలేమైనా ఇవ్వడానికి.. ముందుగా కంపెనీ ఖాతాల ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలని దానికి లోన్లు ఇచ్చిన బ్యాంకుల సంయుక్త ఫోరం (జేఎల్‌ఎఫ్) నిర్ణయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement