real estate scam
-
వెయ్యి కోట్లు కొట్టేసేందుకు ప్లాన్, అంతలోనే..
సాక్షి, హైదరాబాద్: పోలీసుల విచారణలో స్వధాత్రి రియల్ ఎస్టేట్ మోసాల్లో కొత్తకోణం వెలుగు చూసింది. ఏడాదిలోగా వెయ్యి కోట్ల రూపాయల వరకు స్కాం చేయాలని స్వధాత్రి ప్రతినిధి రఘు ప్రణాళికలు రచించినట్టు విచారణలో పోలీసులు గుర్తించారు. లాక్డౌన్ కారణంగా అతని కుట్రలు సాగలేదని తెలిపారు. ఇక స్వధాత్రి కంపెనీలో రూ.150 కోట్లకు పైగా అవినితి జరిగినట్లు గుర్తించిన పోలీసులు, ప్లాట్లపై పెట్టుబడి పెట్టినవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ప్రజల వద్ద వసూలు చేసిన డబ్బును నిందితుడు రఘు ఆస్తుల రూపంలో మార్చుకున్నట్టు వారు వెల్లడించారు. (చదవండి లారీ నన్ను ఢీకొట్టలేదు: విజయ్‌బాబు) తన కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లతో రఘు బినామీ ఆస్తులను కూడబెట్టినట్టు పోలీసులు పేర్కొన్నారు. 15 మంది ఏజెంట్ల పేర్ల మీద కూడా అతను ఆస్తులు కొనుగోలు చేసినట్టు విచారణలో వెల్లడైందని అన్నారు. విజయవాడ, హైదరాబాద్‌లో నిందితుడు ఆస్తులు కూడబెట్టినట్టు పోలీసులు తెలిపారు. బై బ్యాక్ పాలసీలో పెట్టుబడులు పెట్టినవారే నష్టపోయే అవకాశం ఉంటుందని పోలీసులు అభిప్రాయపడ్డారు. రఘు మొత్తం లావాదేవీలన్నీ ఏజెంట్ల పేరు మీదే నడిపినట్టు ఆధాలున్నాయని చెప్పారు. ఈ కేసులో స్వధాత్రి ఇన్ఫ్రా లిమిటెడ్ ప్రతినిధులు రఘు యార్లగడ్డ, గొగులపాటి శ్రీనివాసబాబు, మేనేజర్ మీనాక్షిలను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. (రూ.156 కోట్ల ‘రియల్’ మోసం) -
ఎంసీఏ చదివాడు...దారి తప్పాడు
సాక్షి, సిటీబ్యూరో : భూమిపై పెట్టుబడి పెట్టండి.. నెలవారీ ఆదాయాలు పొందండి అంటూ వివిధ రకాల ఆకర్షణీయ స్కీమ్‌లతో దాదాపు 1,450 మందిని.156 కోట్ల రూపాయల మేరకు మోసగించిన కేసులో స్వధాత్రి ఇన్ఫ్రా లిమిటెడ్ ప్రతినిధులు రఘు యార్లగడ్డ, గొగులపాటి శ్రీనివాసబాబు, మేనేజర్ మీనాక్షిలను సైబరాబాద్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్స్, ఐపీసీ 420, 406, 506 సెక్షన్ల కింద నమోదు చేసిన ఈ కేసు వివరాలను గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ మీడియాకు తెలిపారు. ఎంసీఏ చదివాడు...దారి తప్పాడు 1999లో ఎంసీఏ పూర్తిచేసిన రఘు 2008–09 సమయంలో ఐబీఎం కంపెనీలో సిస్టమ్ ప్రోగ్రామర్‌గా పనిచేశాడు. 2010–11 మధ్యలో ఓ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రైవేట్ లెక్చరర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత విజయవాడలో రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా, మరోవైపు భారీ వడ్డీలకు డైలీ ఫెనాన్స్ వ్యాపారం చేశాడు. ఈ సమయంలో పోలీసు స్టేషన్లలో కొన్ని కేసులు నమోదవడంతో హైదరాబాద్‌కు వచ్చాడు. అప్పటికే తనకు పరిచయమున్న శ్రీనివాసబాబుతో కలిసి 2017లో స్వధాత్రి ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, స్వధాత్రి ఇన్ఫ్రా ప్రాజెక్ట్, స్వధాత్రి రియల్టర్స్ పేర్లతో మూడు సంస్థలను ప్రారంభించాడు. 2017లో శ్రీనగర్ కాలనీలో ఒక కార్యాలయాన్ని, 2019 అక్టోబర్‌లో మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలోని ద్వారక సిగ్నేచర్‌లో మరో కార్యాలయాన్ని ప్రారంభించాడు. కస్టమర్లను ఆకట్టుకొని డబ్బులు గుంజేయాలన్న ఆలోచనతో మూడు స్కీమ్‌లను తెరపైకి తెచ్చాడు. భారీ హంగులు... అయ్యప్ప సొసైటీలోని ద్వారాక సిగ్నచర్లోని కార్యాలయాన్ని సకలహంగులతో తీర్చిదిద్దాడు. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఏకంగా 30 మంది మార్కెటింగ్ ఏజెంట్లు, 20 మంది టెలీకాలర్లను నియమించాడు. భూమిపై పెట్టుబడి పెట్టండి...లాభాలు పొందండి అంటూ వారితో కస్టమర్లను నమ్మించడం మొదలెట్టాడు. ఆఫీసుకు వచ్చే వారిలో నమ్మకాన్ని కలిగించేందుకు బెంజ్, ఫార్చునర్ కార్లతో సహా ఏకంగా 20 వాహనాలను అద్దెకు తీసుకొని ఆఫీసు ప్రాంగణంలో పార్క్ చేసేవాడు. ఈ హంగు అర్భాటలను చూసి వందలమంది డబ్బులు డిపాజిట్ చేశారు. కట్టిపడేసే స్కీమ్‌లు ఇలా... కనీసం రూ.లక్షకుపైగా డిపాజిట్ చేస్తే ప్రతినెలా ఏడాది పాటు తొమ్మిది శాతం లాభాలు... ఓపెన్ ప్లాట్లకు ఒకేసారి డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏడాది పాటు ప్రతి నెల నాలుగు నుంచి పది శాతం చెల్లింపులు చేస్తామని నమ్మించాడు. అపార్ట్మెంట్లలోని ఫ్లాట్లకు ఒకేసారి 60 శాతం డబ్బులు చెల్లించి బుక్ చేసుకుంటే అందులోకి కస్టమర్ వచ్చేవరకు ప్రతినెల రూ.పదివేలు చెల్లిస్తామంటూ...ఇలా మూడు స్కీమ్‌లతో కస్టమర్లను ఆకర్షించారు. షాద్‌నగర్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద తక్కువ ధరకే ఓపెన్ ప్లాట్లు బుక్ చేసుకొని కొంత మంది కస్టమర్లకు రిజిస్ట్రేషన్ చేశారు. అయితే తర్వాత ఇస్తామన్న లాభాలు ప్రతినెలా చెల్లించలేదు. ఫ్లాట్ల విషయంలోనూ 60 శాతం డబ్బులు వసూలు చేసి ప్రతినెలా ఇస్తామన్న రూ.పదివేలు ఇవ్వలేదు. ఫ్లాట్లు కూడా చేతికి ఇవ్వలేదు. దీంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు మాదాపూర్ పోలీసులతో పాటు సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిపి ఫిర్యాదుచేశారు. ఈమేరకు కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు కేసును ఎకనామిక్ ఆఫెన్స్ వింగ్‌కు అప్పగించడంతో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీరిని పోలీసు కస్టడీకి తీసుకుంటామని సీపీ సజ్జనార్ తెలిపారు. మాదాపూర్ అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఈవోడబ్ల్యూ అడిషనల్ డీసీపీ ప్రవీణ్‌కుమార్, మాదాపూర్ ఏసీపీ శ్యామ్‌ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
స్వాదాద్రి రియల్ ఎస్టేట్ స్కాం : ముగ్గురు అరెస్ట్
-
స్వాదాద్రి రియల్ ఎస్టేట్ స్కాం: ముగ్గురు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : స్వాదాద్రి రియల్ ఎస్టేట్ కుంభకోణం కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. స్వాదాద్రి రియల్ ఎస్టేట్ ఎండీ రఘుతో పాటు శ్రీనివాస్, మీనాక్షి అనే మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజల దగ్గర నుండి డబ్బులు వసులు చేసి ఆ డబ్బులతో భూములను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శనివారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ వెల్లడించారు. నగరానికి చెందిన యార్లగడ్డ రఘు రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో అధిక వడ్డీ ఇస్తానంటూ పలువురిని నమ్మించి మోసం చేశారని సజ్జనార్ తెలిపారు. సుమారు మూడు వేల మంది మోసపోయినట్లు విచారణలో తేలిందన్నారు. ఇప్పటి వరకు 156 కోట్ల రూపాయల స్కాం జరిగిందని తెలిపారు. ఏజెంట్ల ద్వారా డబ్బులు వసూలు చేసి మోసం చేశారని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. (చదవండి : మాదాపూర్‌లో భారీ మోసం) నగరానికి చెందిన యార్లగడ్డ రఘు రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో అధిక వడ్డీ ఇస్తానంటూ పలువురిని నమ్మించాడు. ఆ తర్వాత వారి దగ్గర నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశాడు. అతని మాటలు నమ్మిన అనేకమంది పెద్ద మొత్తంలో ఆయన కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. అయితే ఇదంతా మోసమని గ్రహించిన ఓ బాధితుడు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కుంభకోణం బయటపడింది. ఈ స్కామ్‌లో ఏజెంట్ల పైన కూడా కేసులు నమోదు చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. -
మాదాపూర్‌లో రియల్ ఎస్టేట్ కుంభకోణం
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్‌లో భారీ మోసం బయటపడింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం ముసుగులో కోట్లాది రూపాయలు వసూలు చేసిన కుంభకోణం బుధవారం బట్టబయలైంది. నగరానికి చెందిన యార్లగడ్డ రఘు రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో అధిక వడ్డీ ఇస్తానంటూ పలువురిని నమ్మించాడు. ఆ తర్వాత వారి దగ్గర నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశాడు. అతని మాటలు నమ్మిన అనేకమంది పెద్ద మొత్తంలో ఆయన కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. అయితే ఇదంతా మోసమని గ్రహించిన ఓ బాధితుడు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు రఘును అదుపులోకి తీసుకొని విచారించగా వేలమందిని మోసం చేసినట్లు తెలుస్తోంది. (గర్భిణి మృతదేహాన్ని చెట్టుకు కట్టి వదిలేశారు) మరోవైపు రఘును అదుపులోకి తీసుకున్నారన్న విషయం తెలిసిన బాధితులు మాదాపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. వీరంతా లక్ష రూపాయల నుంచి కోటి రూపాయల వరకు రఘు రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. అధిక వడ్డీకి ఆశపడి తమకు తెలిసిన వారితో పెద్ద మొత్తంలో అప్పులు ఇప్పించామని బాధితులు లబోదిబోమంటున్నారు. 200 కోట్ల రూపాయల వరకు మోసానికి పాల్పడినట్లు బాధితులు పేర్కొంటున్నారు. ఈ కేసును సీఐడీతో విచారణ జరిపించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. (సైబర్ యుగంలో స్వాహాల పర్వం) -
చీటర్ టు స్మగ్లర్
ఇరవై ఏళ్ళ కిందట అతనో జర్నలిస్టు. ఆ తర్వాత రియల్టర్ అవతారం. రియల్ వ్యాపారంలో మోసాలు.. సామాజిక పరపతితో రాజకీయ, అధికార పార్టీ నేతలతో పరిచయాలు...వీటిని అడ్డుపెట్టుకుని విజయవాడలో అపార్ట్మెంట్ ఫ్లాట్లు కొనుగోలు చేసి ఒక్కొక్కదాన్ని ముగ్గురు నలుగురికి విక్రయిస్తూ రూ. వంద కోట్ల వరకు అక్రమార్జన. మోసాలు బయటపడడంతో తాను చనిపోయినట్లు చిత్రీకరించుకునే యత్నం.. చివరకు ప్లాట్ల కొనుగోలుదారులు అతడి చిరునామాను గుర్తించి పోలీసులకు తెలియజేయడంతో అరెస్ట్ చేసి జైలుకు పంపారు. కట్ చేస్తే... సాక్షి, విజయవాడ : రియల్ చీటర్ తన స్వరూపం మార్చుకొని గంజాయి స్మగ్లర్‌గా రూపాంతరం చెందాడు. రాష్ట్ర రాజధానితో పాటు దేశ రాజధానిలోని పోలీస్ స్టేషన్లలో అతడిపై కేసులు నమోదయ్యాయి. ఏడాది కాలంలో సుమారు రూ.10 కోట్ల విలువ చేసే గంజాయిని విక్రయించాడు. తాజాగా ఇతడిపై కేసులు నేపథ్యంలో సోమవారం భారీ హైడ్రామా నడుమ కోర్టు ముందు హాజరుపర్చడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదీ చీటర్ నుంచి స్మగ్లర్‌గా మారిన నార్ల వంశీకృష్ణ బాగోతం. నేడు పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్న వంశీకృష్ణ 2006 నుంచి రియల్ వ్యాపారం చేసి రూ. కోట్లు గడించాడు. విజయవాడ నగరం సత్యనారాయణపురంతో పాటు పలు ప్రాంతాల్లో అపార్ట్మెంట్లలో ఫ్లాటు కొనుగోలు చేసి వాటిని బ్యాంకుల్లో తనఖా పెట్టి తర్వాత ఒకరికి తెలియకుండా మరొకరికి విక్రయించేవాడు. ఇలా విజయవాడ కమిషనరేట్‌లోని కృష్ణలంక, గవర్నర్‌పేట, మాచవరం, సూర్యారావుపేట, పటమట, వన్‌టౌన్‌తోపాటు గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్లలో 13 చీటింగ్ కేసులు నమోదయ్యాయి. 2011లో తెనాలి సమీపంలోని బకింగ్‌హాం కాలువలో తన కారును తోసి తాను ప్రమాదవశాత్తు చనిపోయినట్లు చిత్రీకరించుకునే యత్నం చేశాడు. కొంతకాలం అజ్ఞాతంలో ఉండడంతో ఇది నిజమని బాధితులు నమ్మారు. చివరకు అతడు బతికేఉన్నాడని తెలుసుకుని 2013లో కృష్ణలంక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఇతడిని అరెస్ట్ చేశారు. కృష్ణలంక స్టేషన్లో నమోదయిన కేసులో కేసు రుజువు కావటంతో ఆరు నెలలు శిక్ష పడింది. జైలులో స్మగ్లర్లతో పరిచయాలు.. వంశీకృష్ణ జైలులో ఉండగా అంతర జిల్లాల గంజాయి స్మగ్లర్లతో పరిచయాలు ఏర్పడ్డాయి. అక్కడి నుంచి విడుదలైన వంశీకృష్ణ చాలాకాలం అజ్ఞాతంలోనే ఉన్నాడు. 2015 ఆక్టోబర్ నుంచి స్మగ్లర్ అవతారం ఎత్తాడు. విశాఖపట్నం జిల్లా చింతపల్లిలో గంజాయి సాగుదారులతో నేరుగా మాట్లాడుకొని అమ్మకాలు మొదలుపెట్టాడు. చింతపల్లిలో కొనుగోలు చేసి విజయవాడ, తర్పూగోదావరి, ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు సరఫరా చేసి విక్రయాలు సాగించాడు. ఏడాదిలో రూ.8 నుంచి 10 కోట్లు విలువ చేసే గంజాయిని విక్రయించాడు. 2015లో ఇతనిపై గంజాయి కేసులు మొదలయ్యాయి. ఢిల్లీలోని వసంత్‌విహార్ స్టేషన్లో వెయ్యి కిలోల గంజాయి కేసు, ఈ ఏడాది జనవరి 22న కొండపల్లిలో మూడు వేల కిలోల గంజాయి కేసు, మార్చి 27న తూర్పుగోదావరి జిల్లా డొంకరాయిలో వెయ్యి కిలోల కేసు, విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ పరి«ధిలోని భారతీ నగర్లో 600 కిలోల కేసు, మాచవరం పోలీస్ స్టేషన్లో 150 కిలోల కేసు, ఇబ్రహీంపట్నంలో 3,200 కిలోల కేసులు మొత్తం కలిపి ఆరు ఉన్నాయి. అదుపులోకి తీసుకున్న పోలీసులు... వంశీకృష్ణ కోసం రెండు నెలల కిందట ఢిల్లీ నుంచి నార్కోటిక్స్ బృందం విచారణ కోసం విజయవాడ రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వంశీకృష్ణ తల్లి కోర్టులో సెర్చ్ వారెంట్ పిటిషన్ వేయడంతో నేరుగా న్యాయస్థానం ఎదుట సోమవారం ఉదయం న్యాయవాదులు హాజరుపరిచారు. వాస్తవానికి నాలుగో ఏసీఎంఎం కోర్టులో హాజరుపరచాల్సి ఉండగా పోలీసుల ఒత్తిడి ఎక్కువగా ఉందని న్యాయవాదులు మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయమూర్తి ఎదుట రెండు కేసుల్లో హాజరుపరిచారు. మిగిలిన కేసులు నిమిత్తం 29న నాలుగో ఏసీఎంఎం కోర్టులో హాజరుపర్చాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఢిల్లీ, తూర్పుగోదావరి జిల్లాల కేసుల్లో అరెస్ట్ కావాల్సి ఉంది. గంజాయి కేసులో నార్ల వంశీకృష్ణకు రిమాండ్ విజయవాడ లీగల్ : గంజాయి కలిగిఉన్న కేసులో నిందితుడు నార్ల వంశీకృష్ణకు ఈ నెల 29 వరకు రిమాండ్ విధిస్తూ నగర మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఆర్.నిరంజన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వంశీకృష్ణ రియల ఎస్టేట్ వ్యాపారం చేసి ఒకే ప్లాటును ఇద్దరికి రిజిస్ట్రేషన్ చేసి దాదాపు రూ. 100 కోట్ల మేర చీటింగ్ చేశాడు. దానికి సంబంధించి వంశీకృష్ణపై నగరంలోని వివిధ పోలీసు స్టేషన్లలో 13 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో వంశీ తాను చనిపోయినట్లు ప్రజలను నమ్మించేందుకు తెనాలి వద్ద కారు ప్రమాదం సృష్టించాడు. ఆ తర్వాత వైజాగ్ వద్ద అడవులలో గంజాయి వ్యాపారం మొదలు పెట్టాడు. దాదాపు 20 టన్నుల గంజాయిని వివిధ రాష్ట్రాలకు చేరవేశాడు. ఈ నెల 16న ఇబ్రహీంపట్నం పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. అక్రమంగా బంధించారు తన కుమారుడు ఏ నేరం చేయలేదని పోలీసులు అన్యాయంగా అరెస్టు చేసి అన్ని గంజాయి కేసులు ఒప్పుకోమని వేధింపులకు గురిచేశారని వంశీ తల్లి కోర్టులో సెర్చ్ వారెంట్ పిటిషన్ తన న్యాయవాది ద్వారా దాఖలు చేశారు. దాన్ని విచారించిన న్యాయమూర్తి అడ్వకేట్ కమిషనర్‌గా న్యాయవాది కె.శ్రీకాంత్‌ను నియమించారు. విచారించగా ఎన్.టి.టి.పి.ఎస్. గెస్ట్‌హౌస్ రూం నంబరు 36 వంశీ ఉన్నట్లు గుర్తించారు. కోర్టులో హాజరుపరచకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఎం.ఎస్.జె.కోర్టులో నిందితుడు సరెండర్ పిటిషన్ దాఖలు చేసుకుని లొంగిపోయాడు. న్యాయమూర్తి ఈ నెల 29 వరకు రిమాండ్ విధించినట్లు వంశీ న్యాయవాది కిలారు బెనర్జీ తెలిపారు.