సాక్షి, హైదరాబాద్: పోలీసుల విచారణలో స్వధాత్రి రియల్ ఎస్టేట్ మోసాల్లో కొత్తకోణం వెలుగు చూసింది. ఏడాదిలోగా వెయ్యి కోట్ల రూపాయల వరకు స్కాం చేయాలని స్వధాత్రి ప్రతినిధి రఘు ప్రణాళికలు రచించినట్టు విచారణలో పోలీసులు గుర్తించారు. లాక్‌డౌన్ కారణంగా అతని కుట్రలు సాగలేదని తెలిపారు. ఇక స్వధాత్రి కంపెనీలో రూ.150 కోట్లకు పైగా అవినితి జరిగినట్లు గుర్తించిన పోలీసులు, ప్లాట్లపై పెట్టుబడి పెట్టినవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ప్రజల వద్ద వసూలు చేసిన డబ్బును నిందితుడు రఘు ఆస్తుల రూపంలో మార్చుకున్నట్టు వారు వెల్లడించారు.
(చదవండి లారీ నన్ను ఢీకొట్టలేదు: విజయ్‌బాబు)
తన కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లతో రఘు బినామీ ఆస్తులను కూడబెట్టినట్టు పోలీసులు పేర్కొన్నారు. 15 మంది ఏజెంట్ల పేర్ల మీద కూడా అతను ఆస్తులు కొనుగోలు చేసినట్టు విచారణలో వెల్లడైందని అన్నారు. విజయవాడ, హైదరాబాద్‌లో నిందితుడు ఆస్తులు కూడబెట్టినట్టు పోలీసులు తెలిపారు. బై బ్యాక్ పాలసీలో పెట్టుబడులు పెట్టినవారే నష్టపోయే అవకాశం ఉంటుందని పోలీసులు అభిప్రాయపడ్డారు. రఘు మొత్తం లావాదేవీలన్నీ ఏజెంట్ల పేరు మీదే నడిపినట్టు ఆధాలున్నాయని చెప్పారు. ఈ కేసులో స్వధాత్రి ఇన్‌ఫ్రా లిమిటెడ్ ప్రతినిధులు రఘు యార్లగడ్డ, గొగులపాటి శ్రీనివాసబాబు, మేనేజర్ మీనాక్షిలను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
(రూ.156 కోట్ల ‘రియల్’ మోసం)
Comments
Please login to add a commentAdd a comment