
సాక్షి, హైదరాబాద్: ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో యాదగిరి రెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిన ఘటన నగరంలో కలకలం రేపింది. రియల్ ఎస్టేట్ వ్యాపారిని ఇంటి నుండి బయటకు రాగానే ఆయనను అనుసరించిన కొందరు దుండగులు 2కార్లతో కాలనీ శివార్లలో అడ్డగించి దౌర్జన్యం చేయబోయారు. దీంతో ఆయన బలవంతంగా ప్రతిఘటించి అరవడంతో దుండగులు ఆయననుంచి ఫోన్, కారు తీసుకొని పరారయ్యారు. కిడ్నాపర్ల చెరనుంచి తప్పించుకున్న యాదగిరి రెడ్డి కాలనీలో పరుగులు తీస్తూ ఇంటికి చేరుకున్నారు. ఈ ఘటనపై బాధితుడు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment