పోస్టల్ ద్వారా ‘రియల్ షాపీ’ వస్తువులు
కర్నూలు (ఓల్డ్‌సిటీ): తపాలా శాఖ ద్వారా రియల్షాపీ వస్తువుల మార్కెటింగ్‌కు రంగం సిద్ధమైంది. వినియోగదారులు స్థానిక పోస్టాఫీసులో కేటలాగ్‌లోని వస్తువులు ఆర్డర్ ఇస్తే సప్లై చేస్తారు. ఈ విధానానికి తపాలా శాఖ శ్రీకారం చుట్టినట్లు పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు తెలిపారు. రియల్షాపీ విధానంపై శుక్రవారం డివిజన్ స్థాయి సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. వాచీలు, మొబైల్స్, శారీలు మొదలు ఆన్లైన్లో కొనుగోలు చేసే ప్రతి వస్తువును వినియోగదారుడి ఆర్డరుపై తపాలా సిబ్బంది తెప్పిస్తారని సుబ్బారావు తెలిపారు.