కాపు నేతల రాస్తారోకో
పి.గన్నవరం: తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం జి.తెల్లపూడి గ్రామంలో కాపునేతలు బుధవారం ఉదయం రాస్తారోకో నిర్వహించారు. ముద్రగడకు మద్దతుగా కాపు సామాజికవర్గానికి చెందిన ప్రజలు రాస్తారోకో చేశారు. దాంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది.
మరో వైపు పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలోని భక్తాంజనేయస్వామి ఆలయం వద్ద రిలే నిరాహార దీక్షలు చేస్తున్న కాపు నేతలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ముద్రగడ దీక్షకు మద్దతుగా కొవ్వూరులో కాపు నేతలు రిలే దీక్షలకు కూర్చున్నారు.