అలెప్పోకు దాదాపుగా విముక్తి!
డెమాస్కస్: సిరియాలోని ఉగ్రవాదులకు, తిరుగుబాటుదారులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అలెప్పో నగరంలో సిరియా బలగాలు వారిని తుదముట్టించాయి. దాదాపు 93శాతం ప్రాంతాన్ని బలగాలు తమ ఆదీనంలోకి తీసుకున్నాయి. ఇంకొన్ని ప్రాంతాలపై మాత్రమే పట్టుసంపాదించాల్సి ఉంది. ఇది పూర్తయితే, పూర్తిగా అలెప్పోకు తిరుగుబాటుదారుల నుంచి విముక్తి లభించినట్లవుతుంది.
ఇప్పటికే దాదాపు 30వేల మంది అలెప్పో నగర పరిధిలోని పౌరులంతా ప్రభుత్వ రక్షణ దళాల సహాయంతో సురిక్షిత ప్రాంతాలకు తమ ఇంటిని, కట్టుకున్న బట్టలను వదిలేసి వెళ్లారు. తాజాగా మరికొన్ని ప్రాంతాలను తమ అదుపులోకి తెచ్చుకునేందుకు నిర్వహించిన ఆపరేషన్లో మరో మూడువేల మంది సౌకరి అనే ప్రాంతాన్ని విడిచి వేరే ప్రాంతాలకు తరలి వెళ్లారు. అలెప్పో పూర్తిగా ప్రభుత్వం చేతుల్లోకి వచ్చాక దాని రూపురేఖలు పూర్తిగా మార్చి వేస్తామని సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసాద్ అన్నారు.