ఆ ఎమ్మెల్సీలపై తొందరగా చర్య తీసుకోండి
కౌన్సిల్ చైర్మన్‌కు డీఎస్ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్ : విప్‌ను ధిక్కరించి అధికారపక్షానికి అనుకూలంగా ఓటేసిన 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్సీలపై తొందరగా చర్య తీసుకుని ప్రజాస్వామ్య గౌరవాన్ని కాపాడాలని శాసనమండలిలో ప్రతిపక్షనేత ధర్మపురి శ్రీనివాస్ మండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు విజ్ఞప్తి చేశారు. డీఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీలు షబ్బీర్‌అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, సంతోష్‌కుమార్, ఎమ్మెస్ ప్రభాకర్, మాగం రంగారెడ్డి, ఫారూఖ్‌హుస్సేన్, బి.వెంకట్రావు, మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి తదితరులు సోమవారం స్వామిగౌడ్‌ను కలిసి విడివిడిగా అనర్హత పిటిషన్లు అందజేశారు. శాసనమండలి సాక్షిగా విప్ ఉల్లంఘన జరిగినందున తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.