ఎస్సీ రుణాల దరఖాస్తులకు ఆహ్వానం
కాకినాడ సిటీ :
జిల్లాలోని షెడ్యూల్డ్ కులాలకు చెందినవారికి స్వయం ఉపాధి కల్పనకు రుణాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నామని ఎస్సీ కార్పొరేషన్ ఇన్చార్జి ఈడీ వి.డేవిడ్రాజు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఎస్సీ కార్యాచరణ ప్రణాళిక ప్రకారం 16,779 మందికి వివిధ పథకాల ప్రకారం ఆర్థిక సహాయం అందించేందుకు లక్ష్యాన్ని నిర్ధేశించినట్టు తెలిపారు. అర్హులైన ఎస్సీ వర్గాల అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాలకు కార్యాలయ పనివేళల్లో 0884–2362196కు సంప్రదించాలని ఆయన కోరారు.