record poling
-
French elections 2024: ఫ్రాన్స్ రెండో దశలో... రికార్డు పోలింగ్
పారిస్: ఫ్రాన్స్ పార్లమెంటు ఎన్నికల్లో ఆదివారం కీలకమైన రెండో దశలో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం ఐదుగంటలకు 59.7 శాతం పోలింగ్ నమోదైనట్లు ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. 1981 తర్వాత ఇంతటి పోలింగ్ నమోదవడం ఇదే తొలిసారి. జూన్ 30వ తేదీన జరిగిన తొలి రౌండ్లో 67 శాతం పోలింగ్ జరిగింది. ఐరోపా ఎన్నికల్లో మధ్యేవాదుల పరాజయం తర్వాత అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ జూన్ 9న పార్లమెంట్‌ను రద్దు చేసి ఎన్నికలకు పిలుపునిచ్చారు. ఫ్రాన్స్‌లో అధ్యక్ష ఎన్నికలైనా, పార్లమెంటు ఎన్నికలైనా రెండు దశల్లో జరుగుతాయి. ఆదివారం జరిగిన రెండో దశ కీలకమైనది. మాక్రాన్ అధ్యక్ష పదవీ కాలం ఇంకా మూడేళ్లు ఉంది. ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల ఫలితాల వల్ల ఆయన పదవికి తక్షణ ప్రమాదం ఏమీ లేకున్నా, చట్టాలు చేసేటప్పుడు పార్లమెంటులో అడుగడుగునా పరీక్ష ఎదురయ్యే అవకాశం ఉంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌కు తొలిరౌండ్లో చేదు అనుభవం ఎదురైన విషయం తెల్సిందే. మేక్రాన్‌కు చెందిన మితవాద సెంట్రిస్ట్ ఎన్‌సింబల్ కూటమి మూడో స్థానంలో సరిపెట్టుకుంది. తొలి రౌండ్లో అతివాద నేషనల్ ర్యాలీ కూటమి 33.14 శాతం ఓట్లను ఒడిసిపట్టి విజయం సాధించింది. విపక్షాలకు చెందిన న్యూ పాపులర్ ఫ్రంట్ కూటమి 27.99 శాతం ఓట్లను సాధించింది. మేక్రాన్ పార్టీ కేవలం 20.04 శాతం ఓట్లతో సరిపెట్టుకుంది. ఇటీవల యురోపియన్ పార్లమెంట్ ఎన్నికల్లో నాయకురాలు మెరీన్ లీ పెన్కు చెందిన నేషనల్ ర్యాలీ పార్టీ విజయం సాధించింది. ఆలస్యం చేస్తే విపక్షాలు మరింత పుంజుకుంటాయన్న భయంతో మేక్రాన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లిన విషయం విదితమే. -
రికార్డు స్థాయిలో 67.11% పోలింగ్
న్యూఢిల్లీ: సోమవారం ఉదయానికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 2019 సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా చూస్తే 67.11% పోలింగ్ నమోదైంది. భారత పార్లమెంటు ఎన్నికల చరిత్రలో ఇదే అత్యధికం. అయితే ఈ లెక్కలు మారే అవకాశం ఉంది. 2019 ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో జరగ్గా, ఓటు హక్కు కలిగిన వారి సంఖ్య దాదాపు 91 కోట్లు. 2014 ఎన్నికల్లో 66.4 పోలింగ్ శాతం నమోదు కాగా, 2009లో అది మరీ 56.9 శాతమే. దేశంలో మొత్తం 543 లోక్‌సభ నియోజకవర్గాలుండగా, 542 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. తమిళనాడులోని వేల్లూరులో ధన ప్రవాహం అధికంగా ఉందనే కారణంతో ఈసీ అక్కడ ఎన్నికను రద్దు చేసింది. వేల్లూరులో తర్వాత ఎన్నిక ఎప్పుడు నిర్వహించేదీ ఈసీ ఇంకా ప్రకటించలేదు. 2014తో పోలిస్తే 2019కి ఓటర్ల సంఖ్య దాదాపు 8 కోట్లు పెరిగింది. 2019లో తొలిదశలో 69.61%, రెండో దశలో 69.44%, మూడో దశలో 68.4%, నాలుగో దశలో 65.5%, ఐదో దశలో 64.16%, ఆరో దశలో 64.4%, ఏడో దశలో 65.15% పోలింగ్ నమోదైంది. 2014తో పోలిస్తే మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌ల్లో పోలింగ్ 5 ఐదు శాతానికి పైగా పెరిగింది. చండీగఢ్‌లో 10% పైగా తగ్గింది. -
కర్నూలు, ప్రకాశంలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు
కర్నూలు/ప్రకాశం : ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల తర్వాత ముగిసింది. కర్నూలు జిల్లాలో భారీగా పోలింగ్ నమోదైంది. అక్కడ అత్యధికంగా 1087 ఓట్లకు గాను 1080 ఓట్లు పోలవడంతో 99.67 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రకాశం జిల్లాలో 76 శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ 992 ఓట్లకు గాను 755 ఓట్లు పోలయ్యాయి. ఈ నెల 7వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.