హైదరాబాద్ అమ్మాయి, ప్రియుడు యూపీలో..
డియోరియా: హైదరాబాద్‌లో తప్పిపోయిన ఓ బాలిక, ఆమె ప్రియుడిని ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాలో గుర్తించారు. హైదరాబాద్ పోలీసులు, స్థానిక పోలీసుల సాయంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్‌లోని లంగర్ హౌజ్ ప్రాంతం నివాసి, ఇంటర్ కాలేజీ విద్యార్థిని గత నెల 21న తప్పిపోయింది. లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్లో ఈ మేరకు కేసు నమోదైంది. బాలిక తన ప్రియుడితో కలసి ఉత్తరప్రదేశ్‌కు పారిపోయింది. డియోరియాలో ఓ యువకుడు ఈ యువజంటకు ఆశ్రయం ఇచ్చాడు. గురువారం పోలీసులు ఈ యువజంటను అదుపులోకి తీసుకున్నారు. వారికి ఆశ్రయమిచ్చిన యువకుడిని అరెస్ట్ చేశారు.