రాజధాని తొలిదశకు 21వేల కోట్లు
30 వేల ఎకరాలు
పట్టణాభివృద్ధిశాఖ అంచనా రూపకల్పన
విజయవాడకు 12 కి.మీ. వాయవ్యంగా.. గుంటూరుకు 20 కి.మీ. ఈశాన్యంగా రాజధాని
సాక్షి, హైదరాబాద్: రాజధానికి తొలిదశలో 30 వేల ఎకరాలు అవసరమని, నిర్మాణానికి 20,935 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ అంచనాలను రూపొందించింది. తొలిదశ రాజధాని నిర్మాణం మంగళగిరి, తుళ్లూరు, తాడేపల్లి మండలాల్లోని 31 గ్రామాలు, నివాస ప్రాంతాల్లో ఉంటుందని పేర్కొంది. గుంటూరు జిల్లాలోని 122 చదరపు కిలోమీటర్ల పరిధిలో నిర్మాణాలు వస్తాయి. ఈ రాజధాని కృష్ణానదిని ఆనుకుని విజయవాడ నగరానికి 12 కిలోమీటర్ల దూరంలో వాయవ్యదిశగా, గుంటూ రు నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఈశాన్యదిశగా ఉంటుందని మున్సిపల్ శాఖ పేర్కొంది.
తొలిదశ రాజధాని నిర్మాణంలో భాగంగా 8.5 లక్షల జనాభాకు సరిపడా వచ్చే పదేళ్లలో ఇళ్లు నిర్మించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజధాని నిర్మాణ ప్రాంతం ఐటీ, వ్యాపారం, పర్యాటక, వైద్య సౌకర్యాలతో ఉంటుంది. పార్కులు, రిక్రియేషనల్ సౌకర్యాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రీడా సిటీ, క్రీడా ప్రాంగణాలు ఉంటాయి. కృష్ణానది వ్యూతో నిర్మిస్తున్నందున పర్యాటకులను ఆకర్షించేలా ఉంటుందన్నారు. నూతన రాజధాని తొలిదశ నిర్మాణ అంచనాలు ఈ విధంగా ఉన్నాయి.
C - కమర్షియల్ జోన్
JB - జంగిల్ సఫారీ
LH - లాజిస్టిక్ హబ్
KP - నాలెడ్జ్ పార్క్
CM - సీఎం ఇల్లు
G - స్టేట్ గెస్ట్ హౌస్
CH - సర్క్యూట్ హౌస్
RF - రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్
GQF - గవర్నమెంట్ హౌసింగ్ ఫీచర్
GQ - గవర్నమెంట్ హౌసింగ్
R - రెసిడెన్షియల్ జోన్
MQ - మినిస్టర్స్ క్వార్టర్స్
OQ - ఆఫీసర్స్ క్వార్టర్స్
R - రెసిడెన్షియల్ జోన్
VS - విధాన సభ
CC - క్యాపిటల్ కాంప్లెక్స్
GO - గవర్నమెంట్ ఆఫీస్
CP - సెంట్రల్ పార్క్
CBD - సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్
OC - ఆఫీస్ కాంప్లెక్స్
I - ఇండస్ట్రియల్ జోన్
గృహ నిర్మాణాలకు రిజర్వ్ చేసే విస్తీర్ణం రంగాల వారీగా ఈ విధంగా ఉంది
ఆర్థికంగా వెనుకబడిన వర్గాల గృహాలకు - 400.62 హెక్టార్లు
తక్కువ ఆదాయ వర్గాల గృహాలకు - 801.24 హెక్టార్లు
మధ్య ఆదాయ వర్గాల గృహాలకు- 934.78 హెక్టార్లు
అధిక ఆదాయ వర్గాల గృహాలకు- 534.16 హెక్టార్లు
రాజధాని ప్రాంతంలో భూ వినియోగం ఇలా..
1. హౌసింగ్ డెవలప్మెంట్ కోసం రిజర్వు చేసింది: 22%
2.నగరస్థాయి మౌలిక సదుపాయాలకు: 20%
3. రంగాలవారీ మౌలిక సదుపాయాలకు: 15%
4. రాజధాని కాంప్లెక్స్, ప్రభుత్వ భవనాలకు: 5%
5.గవర్నర్, సీఎం, మంత్రుల నివాసాలకు: 1%
6.ప్రభుత్వ గృహాల కోసం: 1%
7.సామాజిక మౌలిక సదుపాయాలకు:3%
8.రిక్రియేషన్కు:5%
9.ప్రాజెక్టు బాధితులకు: 9%
10. పర్యావరణ ప్రాజెక్టులకు: 8%
11.సి.బి.డి. కోసం : 1%
12.కార్యాలయాలకు: 2%
13.బహిరంగ ప్రాంగణం కోసం : 8%