అసోంలో స్వల్ప భూకంపం
గువహటి: అసోం రాజధాని గువహటిలోని పలుప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో గువహటి, నాగాన్, దర్రాంగ్ వంటి ప్రాంతాల్లో స్వల్పంగా భూ ప్రకంపనలు సంభవించాయి.
దాంతో ప్రజలు భయాందోళనలతో ఇళ్లలోనుంచి బయటకు పరుగులు తీశారు. కాగా, భూప్రకంపనల తీవ్రత రిక్టర్‌స్కేలుపై 4.3గా నమోదైనట్టు జియోలాజికల్ విభాగం పేర్కొంది.