red hair
-
రెడ్ హెడ్ డేస్ ఫెస్టివల్ గురించి తెలుసా?
రెడ్ హెడ్ డే పండుగ గురించి ఎపుడైనా విన్నారా? నెదర్లాండ్స్‌లో ఈ పండుగ అత్యంత ఘనంగా జరుగుతుంది. పేరుకు తగ్గట్టే.. ఎర్ర జుట్టు వాళ్లంతా ఒక చోట చేరి చేసుకునే వేడుక ఈ రెడ్ హెడ్ డే ఫెస్టివల్. ఇది ప్రతి ఆగస్టు చివరి వారాంతంలో టిల్బర్గ్ నగరంలో జరుగుతుంది. మూడు రోజుల పాటు జరిగే ఆ పండుగకు పలు దేశాల్లో ఉన్న ఎర్ర జుత్తు మగ, ఆడ అంతా ఒక్క చోట చేరి వేడుక చేసుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 23-25 తేదీల్లో ఈ పండుగను నిర్వహించనున్నారు. అంతేకాదు ఎర్ర జుట్టు లేని వాళ్లు పాల్గొనాలంటే ఎర్ర రంగు బట్ట లేసుకోవాలనే నియమాన్ని పాటిస్తారు. జన్యుపరమైన మార్పులతో ఇలా ఎర్ర జుత్తు వస్తుంది. ప్రపంచ జనాభాలో దాదాపు ఒక శాతం ప్రజలకు ఎర్ర జుత్తు ఉందని ఒక అంచనా. స్కాట్లాండ్, రష్యాలలో రెడ్ హెయిర్ ఉన్నవారు ఎక్కువగా ఉన్నారట. -
ఎరుపు రంగు జుట్టు...అబ్బో ఎబ్బెట్టు!
కత్రినా కైఫ్ పరువు మొత్తం కాన్స్ గంగపాలు అని బాలీవుడ్లో మాట్లాడుకుంటున్నారు. విషయం ఏంటంటే... ప్రస్తుతం ఫ్రాన్స్‌లోని కాన్స్ చలన చిత్రోత్సవాల్లో ఎర్ర తివాచీపై ఈ బ్యూటీ ఏ రేంజ్లో తళుక్కుమంటారోనని చాలామంది ఆసక్తిగా ఎదురు చూశారు. మొదటి రోజు నలుపు రంగు పొడవాటి గౌను, రెండో రోజు ఎరుపు రంగు గౌనుతో ఎర్రతివాచీపై కత్రినా ప్రత్యక్షమయ్యారు. వీక్షకులను పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయారామె. పైగా, విమర్శల పాలయ్యారు. ఆ రెండు రోజులూ కత్రినా ఎరుపు జుట్టుతో కనిపించారు. దాంతో, ‘‘అసలా రంగేంటి? లుక్ మరీ ఓల్డ్‌గా ఉంది’’ అని విదేశీయులు విమర్శించేశారు. కానీ, కత్రినా అదేం పట్టించుకోలేదు. ప్రస్తుతం నటిస్తున్న ‘ిఫిటూర్’లోని పాత్ర కోసమే ఆమె ఎరుపు రంగు వేయించుకున్నారట. కాన్స్‌కి కూడా అలానే వెళ్లిపోయారు.