యప్ టీవీకి రెడ్ హెర్నింగ్ పురస్కారం
హైదరాబాద్: యప్ టీవీ 2015 సంవత్సరానికినూ అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రెడ్ హెర్రింగ్ టాప్ 100 ఉత్తర అమెరికా పురస్కారాన్ని కైవసం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా సంబంధిత రంగాల్లో అభివృద్ధి చెందుతూ..మార్కెట్ లీడర్లుగా ఎదిగే సంస్థలకు ఈ జాబితాలో చోటు కల్పిస్తారు. ఉత్తర అమెరికాలోని వందలాది సంస్థలతో పోటీపడి వినోదం, మీడియారంగంలో యప్ టీవీ ఈ అవార్డును కైవసం చేసుకుంది.
ప్రముఖ కంపెనీలైన గూగుల్, ఫేస్బుక్, ట్విట్టర్, స్కైప్, ఈబేలు ఇంతకు ముందు ఈ జాబితాలో చోటు సంపాదించాయి. దక్షిణాసియా కంటెంట్, లైవ్ టీవీ, క్యాచ్ అప్ టీవీ, ఆన్ డిమాండ్ మూవీ సొల్యూషన్స్‌కు సంబంధించి యప్ టీవీ ప్రపంచపు అగ్రగామి ఓవర్-ది-టాప్ (ఓటీటీ) కంటెంట్ ప్లేయర్‌గా యప్ టీవీ ఎదిగింది. జార్జియాలోని అట్లాంట ప్రధాన కేంద్రంగా పని చేస్తోంది. యప్ టీవీ 200కు పైగా టీవీ చానళ్లు, 4500 వీడియోలు, అపరిమిత మూవీలు, లైవ్ ఈవెంట్స్ ఇంకా మరెన్నో అందిస్తోంది.
ఈ సందర్భంగా యప్ టీవీ సీఈఓ ఉదయ్‌నందన్ రెడ్డి మాట్లాడుతూ..ఎన్నో ప్రముఖ కంపెనీల నడుమ యప్ టీవీని రెడ్ హెర్రింగ్ అవార్డుకు ఎంపిక చేయడం గౌరవప్రదంగా భావిస్తున్నామన్నారు. పురస్కారానికి ఎంపిక కావడంతో తమపై బాధ్యత మరింత పెరిగిందని, నూతన ఆవిష్కారాలకు ఊతమందించే చోదకంలా ఈ పురస్కారం తమను ఉత్సాహపరుస్తుందని తెలిపారు.