నిప్పులపై నడుస్తూ.. కిందపడి..
జలంధర్: హిందూ మతాచారం ప్రకారం ఆచార కార్యక్రమాల్లో భాగంగా నిర్విహిస్తున్న నిప్పులపై నడకలో ఓ తండ్రి తన ఆరేళ్ల కుమారుడిని నిప్పులపై పడేసిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. మా మారియమ్మ జాతరలో ఉట్టికాళ్లతో నిప్పులపై నడవడానికి సిద్ధమైన తండ్రి అతని కొడుకు కార్తీక్(6)ను చేతుల్లో పట్టుకుని నిప్పులపై నడకను ప్రారంభించారు. అయితే, నిప్పుల గుండం మధ్యలోకి వెళ్లిన తర్వాత అతను అదుపుతప్పి కింద పడిపోవడంతో కొడుకు కార్తీక్ శరీరం తీవ్రంగా కాలిపోయింది.
దీంతో పక్కనే ఉన్న వారు స్పందించి వెంటనే కుర్రవాడిని ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యులను ఎవరినైనా కార్తీక్ తోడుగా రమ్మని అడుగగా తమకు దేవుని మీద నమ్మకం ఉందని, పిల్లవాడిని ఆయనే కాపాడతాడని చెప్పినట్లు తెలిపారు. కాగా, కార్తీక్ ను ఆదివారం ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేశారు. తండ్రికి శరీరం కూడా 15 శాతం కాలిపోయిందని వివరించారు. గత వారం ఇదే ఉత్సవాల్లో భాగంగా నిప్పులపై నడుస్తూ ఓ తల్లి, కూతురు కిందపడి గాయలపాలైన విషయం తెలిసిందే.