ఆటోబోల్తా మహిళ మృతి
రెడ్డిగూడెం (తుంగతుర్తి) : ఆటోబోల్తా పడి మహిళ మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి రెడ్డిగూడెం గ్రామ శివారులో చోటు చేసుకుంది. పోలీసులు, మృతిరాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని రెడ్డిగూడెం గ్రామానికి చెందిన అంగన్వాడీ ఆయా కొలిపాక దేవకమ్మ (60) ఉయ్యాల రజిత, ఉయ్యాల పవన్, సూర్యాపేట ఆసుపత్రికి వెళ్లి తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో మద్దిరాల ఎక్స్‌రోడ్డు వద్ద బస్సు దిగి తన స్వగ్రామం రెడ్డిగూడానికి తునికి కుమార స్వామి ఆటోలో వస్తున్నారు. రెడ్డిగూడెం శివారులో స»Œ స్టేషన్ వద్దకు రాగానే ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న దేవకమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఉయ్యాల రజిత, పవన్, గుర్రాల ప్రవీణ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు. వీరిలో రజిత పరిస్థితి విషమంగా ఉంది. మృతురాలి కుమారుడు కొలిపాక వెంకన్న ఫిర్యాదు మేరకు హెడ్‌కానిస్టేబుల్ రాంకోటి కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ఆసుపత్రికి తరలించారు.